< Hiob 5 >
1 “Wopɛ a frɛ, na hwan na ɔbɛgye wo soɔ? Akronkronfoɔ no mu hwan nkyɛn na wobɛkorɔ?
౧నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?
2 Ahisɛm kum ɔkwasea, na anibereɛ kum atetekwaa.
౨తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.
3 Mʼankasa mahunu ɔkwasea a ɔrefefɛ, nanso, mpofirim, wɔdomee ne fie.
౩మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.
4 Ne mma ne banbɔ ntam ɛkwan ware, wɔdwerɛ wɔn wɔ asɛnniiɛ a wɔnnya ɔkamafoɔ.
౪అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.
5 Deɛ ɛkɔm de noɔ no di ne nnɔbaeɛ, na ɔfa firi nkasɛɛ mu mpo, na deɛ osukɔm de noɔ no pere di nʼahodeɛ akyi.
౫ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.
6 Ahokyere mmpue mfiri dɔteɛ mu na ɔhaw nso mmpue mfiri fam.
౬దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
7 Nanso wɔwo nnipa to ɔhaw mu mpɛn dodoɔ a ogyaframa turi kɔ ɔsoro.
౭నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.
8 “Nanso sɛ ɛyɛ me a, anka mɛdwane atoa Onyankopɔn; na mede mʼasɛm ato nʼanim.
౮అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.
9 Ɔyɛ anwanwadeɛ a wɔntumi nhwehwɛ mu, ne nsɛnkyerɛnneɛ a wɔntumi nkan ne dodoɔ.
౯ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
10 Ɔtɔ nsuo gu asase so; na ɔde kɔ wira mu.
౧౦ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.
11 Ɔde ahobrɛasefoɔ si deɛ ɛkorɔn, na ɔma wɔn a wɔdi awerɛhoɔ nya asomdwoeɛ.
౧౧ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.
12 Ɔsɛe anifirefoɔ nhyehyɛeɛ, ma wɔn nsa si fam.
౧౨వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
13 Ɔkyere anyansafoɔ wɔ wɔn anifire mu, na ɔbɔ anitefoɔ nhyehyɛeɛ gu.
౧౩దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
14 Esum duru wɔn awia ketee; na wɔkeka owigyinaeɛ te sɛ anadwo.
౧౪వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.
15 Ɔgye ahiafoɔ firi afena a ɛhyɛ wɔn anomu; ɔgye wɔn firi ahoɔdenfoɔ nkyehoma mu.
౧౫బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.
16 Enti, ahiafoɔ wɔ anidasoɔ, na ntɛnkyea ka nʼano to mu.
౧౬కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.
17 “Nhyira ne onipa a Onyankopɔn tene no, enti mmu Otumfoɔ ntenetene no animtiaa.
౧౭దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
18 Ɛfiri sɛ, ɔno na ɔpira na ɔno ara akyekyere; ɔpira nanso ne nsa sa yadeɛ.
౧౮ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.
19 Ɔbɛgye wo afiri ɔhaw ahodoɔ nsia mu; nson so, a bɔne biara renka wo.
౧౯ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
20 Ɛkɔm ba a, ɔbɛgye wo afiri owuo mu, na ɔko mu nso, ɔbɛgye wo afiri afena ano.
౨౦కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
21 Wɔbɛbɔ wo ho ban afiri kasatwie ho na sɛ ɔsɛeɛ ba a, ɛnsɛ sɛ wosuro.
౨౧దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.
22 Wobɛsere ɔsɛeɛ ne ɔkɔm; na ɛnsɛ sɛ wosuro asase so mmoa.
౨౨కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.
23 Wo ne afuo so aboɔ bɛyɛ apam, na emu nkekaboa nso ne wo bɛtena asomdwoeɛ mu.
౨౩నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.
24 Wobɛhunu sɛ wo ntomadan wɔ banbɔ; na sɛ wosese wʼahodeɛ a, wobɛhunu sɛ hwee nyeraeɛ.
౨౪నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.
25 Wobɛhunu sɛ wo mma bɛyɛ bebree; na wʼasefoɔ bɛdɔre sɛ ɛserɛ.
౨౫నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.
26 Wode ahoɔden bɛkɔ damena mu, te sɛ afiafi a wɔaboa ano wɔ otwa berɛ mu.
౨౬ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.
27 “Yɛahwehwɛ yei mu, na ɛyɛ nokorɛ ɛno enti tie na fa toto wʼabrabɔ ho.”
౨౭ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.