< Hiob 32 >

1 Enti saa mmarima baasa yi ammua Hiob bio, ɛfiri sɛ, na ɔtene wɔ ɔno ara ani so.
యోబు తన దృష్టికి తాను నీతిమంతుడుగా ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు గ్రహించి అతనికి జవాబు చెప్పడం చాలించుకున్నారు.
2 Na Busini Barakel babarima Elihu a ɔfiri Ram abusua mu no bo fuu Hiob yie sɛ ɔbu ne ho bem na ɔmmu Onyankopɔn mmom bem.
అప్పుడు రము వంశస్థుడు, బూజీయుడు, బరకెయేలు కుమారుడు అయిన ఎలీహు, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకోవడం చూసి అతని మీద ఎంతో కోపగించాడు.
3 Ne bo fuu nnamfonom baasa no sɛ wɔantumi anya nnyinasoɔ bi ammɔ Hiob nsɛm no angu, nanso wɔbuu no fɔ.
యోబు ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకుండా యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు ఎంతో కోపగించాడు.
4 Elihu twɛnee sɛ afoforɔ no bɛkasa akyerɛ Hiob, ɛfiri sɛ, na wɔanyinyini sene no.
వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సు గలవారు గనక అతడు యోబుతో మాటలాడాలని ఎదురు చూస్తున్నాడు.
5 Na ɔhunuu sɛ nnipa baasa no nni asɛm biara ka bio no, nʼabufuo sɔreeɛ.
అయితే ఆ ముగ్గురూ ప్రత్యుత్తరమేమీ ఇయ్యక పోవడం చూసి అతనికి కోపం రేగింది.
6 Enti Busini Barakel babarima Elihu kaa sɛ, “Meyɛ abɔfra, na moyɛ mpanimfoɔ; ɛno enti na mesuroo sɛ mɛka deɛ menim akyerɛ mo.
కాబట్టి బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలా మాటలాడసాగాడు. నేను వయస్సులో చిన్నవాణ్ణి. మీరు బహు వృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు.
7 Medwenee sɛ, ‘Ɛsɛ sɛ mpanimfoɔ kasa; ɛsɛ sɛ wɔn a wɔn ani afire kyerɛ nyansa.’
వృద్ధాప్యం మాట్లాడాలి, అధిక సంఖ్యగల సంవత్సరాలు జ్ఞానం బోధించడానికి తగినవి, అని నేను అనుకున్నాను.
8 Nanso honhom a ɛte onipa mu, Otumfoɔ no ahomeɛ no na ɛma nteaseɛ.
అయినా మనుషుల్లో ఆత్మ ఒకటి ఉంది. సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేస్తుంది.
9 Ɛnyɛ mpanimfoɔ nko na wɔyɛ anyansafoɔ, ɛnyɛ wɔn a wɔn ani afire nko na wɔte deɛ ɛyɛ ase.
వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. పెద్ద వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసినవారు కారు.
10 “Enti mese: Montie me; me nso mɛka mʼadwene.
౧౦కాబట్టి నా మాట అంగీకరించమని మనవి చేస్తున్నాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను.
11 Metwɛneeɛ wɔ ɛberɛ a morekasa, metiee mo adwenkyerɛ; ɛberɛ a na monhunu deɛ monka no,
౧౧ఏమి పలకాలా అని మీరు ఆలోచిస్తుండగా నేను మీ మాటల కోసం కనిపెట్టుకున్నాను.
12 meyɛɛ aso maa mo pa ara, nanso mo mu biara antumi ankyerɛ sɛ Hiob ayɛ mfomsoɔ; mo mu biara anyi nʼanosɛm ano.
౧౨మీ అభిప్రాయాలు చెవిని వేసుకోవడం కోసం మీరు చెప్పిన వాటిపై బహు జాగ్రత్తగా ధ్యాస పెట్టాను. అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు. ఎవరూ అతని మాటలకు జవాబు ఇయ్యలేదు.
13 Monnka sɛ, ‘Ɔnim nyansa; Onyankopɔn nko ara na ɔbɛtumi asesa nʼadwene.’
౧౩కాబట్టి మాకు జ్ఞానం లభించిందని, దేవుడు తప్ప మనుషులు అతన్ని ఓడించలేరని మీరు అనకూడదు.
14 Sɛ Hiob ne me kasaeɛ a, anka merennyina mo adwenkyerɛ no so mmua no.
౧౪అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి జవాబు ఇయ్యను.
15 “Mo ho adwiri mo, monni hwee ka bio; mo nsɛm asa.
౧౫వారు ఆశ్చర్యపడి ఇక జవాబు చెప్పడం మానుకున్నారు. పలకడానికి వారికి మాట ఒకటి కూడా లేదు.
16 Ɛsɛ sɛ metwɛn wɔ ɛberɛ a moayɛ komm yi, saa ɛberɛ a mo monni mmuaeɛ biara de ma yi?
౧౬కాగా వారిక ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. వారు మాటలాడక పోవడం చూసి నేను ఊరుకుంటానా?
17 Me nso mɛka bi me nso mɛka mʼadwene.
౧౭నేను ఇయ్యవలసిన జవాబు నేనిస్తాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను.
18 Ɛfiri sɛ, nsɛm ahyɛ mʼanomu ma, na honhom a ɛte me mu no hyɛ me sɛ menka;
౧౮నా మనస్సునిండా మాటలున్నాయి. నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నది.
19 Me mu no, mete sɛ nsa a ɛhyɛ toa mu; Me te sɛ nsã kotokuo foforɔ a ɛrebɛpae.
౧౯నా మనస్సు తెరవని ద్రాక్షారసపు తిత్తి లాగా ఉంది. కొత్త తిత్తుల్లాగా అది పిగిలిపోడానికి సిద్ధంగా ఉంది.
20 Ɛsɛ sɛ mekasa na me ho tɔ me; ɛsɛ sɛ mebue mʼano na me ma mmuaeɛ.
౨౦నేను మాట్లాడి బరువు దించుకుంటాను. నా పెదాలు విప్పి ప్రత్యుత్తరమిస్తాను.
21 Merenyɛ animhwɛ na merenkorɔkorɔ obiara.
౨౧మీరు దయచేసి వినండి. నేను ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించను. నేను ముఖస్తుతి కోసం ఎవరికీ బిరుదులు తగిలించను.
22 Na sɛ makwadare akorɔkorɔ mu a, anka me Yɛfoɔ bɛyi me afiri hɔ ntɛm so.
౨౨ముఖస్తుతి చేయడం నా చేత కాదు. అలా చేస్తే నన్ను చేసినవాడు శీఘ్రంగా నన్ను నిర్మూలం చేస్తాడు.

< Hiob 32 >