< Hiob 12 >

1 Na Hiob buaa sɛ,
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,
2 “Ampa ara mone nnipa no, na mowu a na nyansa asa!
నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరి పోతుందా?
3 Nanso mewɔ adwene sɛ mo ara na monnsene me. Hwan na ɔnnim saa nneɛma yi nyinaa?
మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు?
4 “Mayɛ aseredeɛ ama me nnamfonom, mefrɛɛ Onyankopɔn na ɔbuaeɛ. Mayɛ aseredeɛ tata, nanso metene, na me ho nni asɛm.
దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులపాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది.
5 Nnipa a wɔn ho tɔ wɔn bu amanehunu animtiaa sɛdeɛ wɔbu wɔn a wɔn nan rewatiri no awieeɛ animtiaa.
క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు.
6 Wɔmmfa wɔn nsa nka akorɔmfoɔ ntomadan, na wɔn a wɔma Onyankopɔn bo fuo no wɔ banbɔ na Onyankopɔn bɔ deɛ ɔde ma wɔn ho ban.
దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు.
7 “Bisa mmoa no, na wɔbɛkyerɛ wo anaasɛ ewiem nnomaa no, na wɔbɛka akyerɛ wo
అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి.
8 anaasɛ kasa kyerɛ asase, na ɛbɛkyerɛ wo, anaasɛ ma ɛpo mu mpataa nka nkyerɛ wo.
భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి.
9 Wɔn nyinaa mu hwan na ɔnnim sɛ Awurade nsa na ayɛ yei.
యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు?
10 Ne nsam na abɔdeɛ nyinaa ahome wɔ ne adasamma nyinaa ahome.
౧౦జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.
11 Aso nsɔ nsɛm nnhwɛ, sɛdeɛ tɛkrɛma ka aduane hwɛ no anaa?
౧౧నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా.
12 Wɔnnya nyansa mfiri mpanin nkyɛn, na ɛnyɛ ɔnyinkyerɛ na ɛde nteaseɛ ba anaa?
౧౨వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది.
13 “Nyansa ne tumi yɛ Onyankopɔn dea; afotuo ne nteaseɛ yɛ ne dea.
౧౩అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.
14 Deɛ ɔbubu guo no, obiara rentumi nsi; deɛ ɔde no to nneduadan mu no, obiara rentumi nyi no.
౧౪ఆలోచించు, ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవ్వరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు.
15 Sɛ ɔma osuo gyae tɔ a, asase no so yɛ wesee; sɛ ɔgyaa osutɔ mu a, ɛsɛe asase no.
౧౫చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడిచేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచివేస్తాయి.
16 Ahoɔden ne nkonimdie wɔ no osisifoɔ ne deɛ wɔsisi noɔ nso wɔ no.
౧౬బలమూ, జ్ఞానమూ ఆయన గుణ లక్షణాలు. మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు.
17 Ɔpa afotufoɔ ho ntoma ma wɔkɔ na ɔma atemmufoɔ yɛ nkwasea.
౧౭ఆలోచనలు చెప్పేవాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేనివాళ్ళని ఆయన రుజువు చేస్తాడు.
18 Ɔworɔ ahemfo nkyehoma na ɔde abɔsoɔ bɔ wɔn asene.
౧౮రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్ళతో బంధిస్తాడు.
19 Ɔpa asɔfoɔ ho ntoma, na ɔtu nnipa a wɔn ase atim akyɛre gu.
౧౯యాజకులను వస్త్రహీనులనుగా చేసి వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్నవాళ్ళను ఆయన కూలదోస్తాడు.
20 Ɔka afotufoɔ a wɔgye wɔn die no kasaboa hyɛ, na ɔgye mpanimfoɔ nhunumu.
౨౦వాక్చాతుర్యం గలవారు చెప్పే మాటలను ఆయన వ్యర్ధపరుస్తాడు. పెద్దమనుషులను తెలివితక్కువ వాళ్లనుగా చేస్తాడు.
21 Ɔde animguaseɛ gu atitire so na ɔtintim gye ahoɔdenfoɔ nsam akodeɛ.
౨౧పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు.
22 Ɔda esum mu nneɛma a ahinta adi na ɔde esum kabii ba hann mu.
౨౨చీకట్లోని లోతైన విషయాలను ఆయన బయలు పరుస్తాడు. మరణాంధకారంలోకి వెలుగు రప్పిస్తాడు.
23 Ɔyɛ aman akɛseɛ, na ɔsɛe wɔn; ɔtrɛ aman mu, na ɔhwete wɔn mu.
౨౩ఆయన ప్రజలను వృద్ది పరుస్తాడు, అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాల పరుస్తాడు. వాళ్ళను ఖైదీలుగా కూడా తీసుకు పోతాడు.
24 Ɔgye ewiase akannifoɔ adwene firi wɔn nsam; na ɔma wɔkyinkyini asase wesee a ɛkwan nna soɔ so.
౨౪లోకంలోని ప్రజల, పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారీతెన్నూ లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు.
25 Wɔhwehwɛ wɔ esum mu a wɔnni kanea; na ɔma wɔtɔ ntintan sɛ asabofoɔ.
౨౫వాళ్ళు వెలుగు లేనివారై చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలి పడినట్టు ఆయన వాళ్ళను తూలిపోయేలా చేస్తాడు.

< Hiob 12 >