< Yesaia 4 >
1 Saa ɛda no, mmaa baason bɛsɔ ɔbarima baako mu aka sɛ, “Yɛbɛbɔ yɛn ho akɔnhoma na yɛn ankasa apɛ yɛn aduradeɛ; ma wo din nna yɛn so kɛkɛ. Yi ahohora firi yɛn so!”
౧ఆ రోజున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకుని “మా అన్నం మేమే తింటాం. మా వస్త్రాలు మేమే వేసుకుంటాం. కాని, మా అవమానం పోయేలా నీ పేరు మాత్రం మమ్మల్ని పెట్టుకోనివ్వు” అంటారు.
2 Saa ɛda no Awurade Baa no bɛyɛ fɛ na anya animuonyam, na asase no so aba bɛyɛ ahohoahoa ne animuonyam ama Israel nkaeɛfoɔ no.
౨ఆ రోజున యెహోవా కొమ్మ అందంగానూ, మహిమతోనూ నిండి ఉంటుంది. ఇశ్రాయేలులో శేషించినవాళ్ళ భూమి పంట రుచిగానూ, చూడ ముచ్చటగానూ ఉంటుంది.
3 Wɔn a wɔaka wɔ Sion a wɔte Yerusalem no, wɔbɛfrɛ wɔn kronkron, wɔn a wɔatwerɛ wɔn din aka ateasefoɔ ho wɔ Yerusalem nyinaa.
౩సీయోనులో శేషించిన వాడూ, యెరూషలేములో నిలిచి ఉన్నవాడూ, అంటే సజీవుడుగా లెక్కకు వచ్చినవాడు “పవిత్రుడు” అని పిలిపించుకుంటాడు.
4 Awurade bɛhohoro Sion mmaa ho fi; ɔde atemmuo honhom ne ogya honhom bɛpepa mogya nkekaawa a ɛwɔ Yerusalem.
౪న్యాయాత్మ వలన, దహించే అగ్ని ఆత్మ వలన, ప్రభువు సీయోను కుమార్తెల కల్మషం కడిగేసినప్పుడు, యెరూషలేముకు అంటిన రక్తపు మరకలను దాని మధ్య నుంచి తీసి వేసి దాన్ని శుద్ధి చేసిన వాడవుతాడు.
5 Afei, Bepɔ Sion ne wɔn a wɔboa wɔn ano wɔ hɔ nyinaa, Awurade de wisie omununkum bɛkata wɔn so awia, na ɔde ogya dɛreɛ akata wɔn so anadwo; ntoma kyiniiɛ bɛkata animuonyam yi nyinaa so.
౫సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు.
6 Ɛbɛyɛ hintabea ne enwunu wɔ owibɔ ano den mu, na osutɔ ne ahum mu nso ɛbɛyɛ dwanekɔbea ne atɛeɛ.
౬ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.