< Yesaia 34 >
1 Montwi mmɛn, mo amanaman, na montie; monyɛ aso, mo ɔmanfoɔ! Momma asase ne deɛ ɛwɔ so nyinaa ntie, ewiase ne deɛ ɛfiri mu ba nyinaa!
౧రాజ్యాలన్నీ నా దగ్గరికి వచ్చి నేను చెప్పేది వినండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఆలకించండి. భూమీ దాని సంపూర్ణతా, లోకం, దానిలో పుట్టినదంతా వినాలి.
2 Awurade bo afu amanaman no; nʼabufuhyeɛ no tia wɔn akodɔm nyinaa. Ɔbɛsɛe wɔn pasaa, ɔbɛma wɔakunkum wɔn.
౨యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు.
3 Wɔbɛto wɔn mu atɔfoɔ no agu, wɔn afunu no bɛyi hwa; wɔn mogya bɛfɔ mmepɔ no.
౩వారిలో చనిపోయిన వారిని ఎవరూ సమాధి చేయరు. వారి శవాలు కంపుకొడతాయి. వారి రక్తం కొండలను నింపేస్తుంది.
4 Ɔsoro nsoromma nyinaa bɛyera na wɔbɛbobɔ ɔsoro te sɛ nwoma mmobɔeɛ; ɔsoro atumfoɔ bɛhwe ase sɛdeɛ nhahan te firi bobe so, sɛdeɛ mman a awo firi borɔdɔma dua ho.
౪ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి.
5 Mʼakofena anom deɛ ɛmee no wɔ soro; hwɛ, ɛresiane de atemmuo aba Edom so, wɔn a masɛe wɔn koraa no.
౫నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది.
6 Mogya adware Awurade akofena ho, wɔde sradeɛ asra ho, nnwammaa ne mpɔnkye mogya, nnwennini sawa mu sradeɛ. Awurade wɔ afɔrebɔ bi bɔ wɔ Bosra ne okum kɛseɛ wɔ Edom.
౬యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది కొవ్వుతో కప్పి ఉంటుంది. గొర్రెపిల్లల, మేకల రక్తం చేతా, పొట్లేళ్ల మూత్రపిండాల మీది కొవ్వు చేతా కప్పి ఉంటుంది. ఎందుకంటే బొస్రా నగరంలో యెహోవా బలి జరిగిస్తాడు. ఎదోము దేశంలో గొప్ప వధ చేస్తాడు.
7 Anantwie aniɔdenfoɔ ne wɔn bɛtotɔ, anantwinini nketewa ne akɛseɛ. Mogya bɛfɔ wɔn asase no, na sradeɛ ayɛ ɛso dɔteɛ no sɔkyee.
౭వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి. ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది.
8 Na ɛyɛ Awurade aweretɔ da a ɔbɛdi ama Sion.
౮అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం.
9 Edom nsuwa nsuwa bɛdane agodibea, ne dɔteɛ bɛdane sɔfe a ɛdɛre nʼasase bɛyɛ agoprama a ɛdɛre!
౯ఎదోము కాలువలు కీలులాగా, దాని మట్టి గంధకంగా మారిపోతుంది. దాని భూమి మండుతున్న గంధకంగా ఉంటుంది.
10 Ɛrennum awia anaa anadwo; ne wisie bɛfiri a ɛtoɔ rentwa da. Ɛbɛda mpan firi awoɔ ntoatoasoɔ akɔsi awoɔ ntoatoasoɔ; obiara remfa ho bio koraa.
౧౦అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది. అది తరతరాలు పాడుగా ఉంటుంది. దానిలో గుండా ఇక ఎవ్వరూ ఎన్నటికీ ప్రయాణించరు.
11 Anweatam so patuo ne ɔbonsamnoma bɛgye hɔ afa; ɔpatuo ne anene bɛtena hɔ. Onyankopɔn bɛtwe basabasayɛ ahoma wɔ Edom so, ɔde bɛsɛe ɔman no.
౧౧గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు.
12 Nʼatitire renya biribiara a ɛbɛma wɔafrɛ no ahennie, nʼahenemma mmarima nyinaa bɛtu ayera.
౧౨రాజ్యం గురించి ప్రకటించడానికి వారి ప్రధానులు అక్కడ ఉండరు. దాన్ని పరిపాలించే వాళ్ళంతా గతించిపోయారు.
13 Nkasɛɛ bɛgye nʼabankɛsewa afa, nsansono ne nkasɛɛ bɛfu wɔ nʼabankɛsewa hɔ. Ɛhɔ bɛyɛ adompo atuo, ne apatuo tenabea.
౧౩ఎదోము నగరాల్లో ముళ్లచెట్లు పెరుగుతాయి. దాని దుర్గాల్లో దురదగొండ్లు, గచ్చపొదలు ఎదుగుతాయి. అది అడవికుక్కలకు, నిప్పుకోళ్లకు నివాసంగా ఉంటుంది.
14 Anweatam so mmoa ne mpataku bɛhyia adi afra, mpɔnkye aniɔdenfoɔ bɛsu akyerɛ wɔn ho; ɛhɔ na anadwo mmoa bɛdeda na wɔde ayɛ wɔn homebea.
౧౪క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి.
15 Ɛhɔ na ɔpatuo bɛyɛ ne pirebuo, na wato ne nkosua. Ɔbɛhwane ne mma, na ɔde ne ntaban akata wɔn so; ɛhɔ na nkorɔma bɛboaboa wɔn ho ano, obiara ne deɛ ɔka ne ho.
౧౫గుడ్లగూబలు గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పొదుగుతాయి. అక్కడే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కలుసుకుంటాయి.
16 Hwɛ Awurade nwoma mmobɔeɛ no mu, na kenkan: Yeinom mu biara renyera, obiara bɛnya deɛ ɔka ne ho. Ɛfiri sɛ nʼanom na ɔhyɛ asɛm no firie, na ne honhom bɛboaboa wɔn ano.
౧౬యెహోవా గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. ఆ జంతువులన్నీ అక్కడ ఉండి తీరుతాయి. దేని జతపక్షి దాని దగ్గర ఉంటుంది. ఎందుకంటే యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు. ఆయన ఆత్మ వాటిని పోగు చేస్తాడు.
17 Ɔde wɔn kyɛfa rema wɔn; ɔde ne nsa yɛ susudua kyekyɛ. Wɔbɛfa no sɛ wɔn dea afebɔɔ na wɔfiri awoɔ ntoatoasoɔ akɔsi awoɔ ntoatoasoɔ atena hɔ.
౧౭అవి రావాలని ఆయన చీట్లు వేశాడు. ఆయన కొలనూలు పట్టుకుని వాటికి ఆ దేశాన్ని పంచిపెడతాడు. అవి శాశ్వతంగా దాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. యుగయుగాలు దానిలో నివసిస్తాయి.