< Yesaia 17 >
1 Adehunu a ɛfa Damasko ho: “Hwɛ, Damasko renyɛ kuropɔn bio ɛbɛdane ayɛ mmubuiɛ sie.
౧ఇది దమస్కు నగరం గూర్చిన దైవ ప్రకటన. “దమస్కు ఇక మీదట నగరంగా ఉండదు. అది శిథిల గృహంలా ఉంటుంది.
2 Aroer nkuropɔn bɛdane nkurofon na wɔagya ama nnwankuo ama wɔadeda hɔ, a obiara renyi wɔn hu.
౨అరోయేరు పట్టణాలు జనాలు లేకుండా ఉంటాయి. అవి గొర్రెల మందలు మేసే ప్రదేశాలవుతాయి. అవి అక్కడ ఎవరి భయమూ లేకుండా పడుకుంటాయి.
3 Kuropɔn a wɔabɔ ho ban bɛyera wɔ Efraim, adehyetumi nso bɛfiri Damasko; Aram nkaeɛfoɔ bɛyɛ Israelfoɔ animuonyam,” Sɛdeɛ Asafo Awurade seɛ nie.
౩ఎఫ్రాయిములో భద్రత కోసం కట్టిన ప్రాకారాలూ, దమస్కులో రాజ్యాధికారమూ మాయమవుతాయి. ఇశ్రాయేలు ప్రజల ప్రాభవానికి జరిగినట్టే సిరియాలో మిగిలి ఉన్న వారికీ జరుగుతుంది.” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.
4 “Ɛda no, Yakob animuonyam bɛpa; na ne mu sradeɛ bɛsa.
౪“ఆ రోజుల్లో యాకోబు ప్రాభవం హీన దశకు చేరుకుంటుంది. బలిసిన అతని శరీరం చిక్కి పోతుంది.
5 Ɛbɛyɛ sɛdeɛ otwafoɔ twa aburoo a ɛgyina afuo so na ɔde ne nsa pempan sɛ ɛberɛ a obi redi mpɛpɛwa wɔ Refaim Bɔnhwa mu.
౫అది పంట కోసేవాడు ధాన్యాన్ని సమకూర్చినట్టుగా, అతడి చేయి కంకులను కోసినట్టుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె సేకరించినట్టుగా ఉంటుంది.
6 Nanso mpɛpɛwa no mu bi bɛka, sɛdeɛ wɔwoso ngo dua a ɛyɛ no; ɛka aba no mmienu anaa mmiɛnsa wɔ atifi mman no so, ne ɛnan anaa enum wɔ mman a ɛsoɔ no so,” sɛdeɛ Awurade, Israel Onyankopɔn seɛ nie.
౬అయినా ఒలీవ చెట్టును దులిపినప్పుడు పైన కొన్ని పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది. రెండు మూడు ఒలీవ పళ్ళు చిట్టచివరి కొమ్మలో మిగిలి ఉన్నట్టుగా, ఫలభరితమైన చెట్టు చిటారు కొమ్మలో నాలుగైదు పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది.” ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రకటన ఇది.
7 Saa ɛda no, nnipa de wɔn ani bɛto wɔn Yɛfoɔ so na wɔadane wɔn ani ahwɛ Israel Ɔkronkronni no.
౭ఆ రోజుల్లో మనుషులు తమ సృష్టికర్త వైపు చూస్తారు. ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధ దేవునిపై తమ దృష్టి నిలుపుతారు.
8 Wɔremfa wɔn ho nto afɔrebukyia a ɛyɛ wɔn nsa ano adwuma no so, na wɔbɛbu Asera afɔrebukyia ne nnuhwan afɔrebukyia a wɔde wɔn nsateaa ayɛ no animtia.
౮తమ చేతులతో చేసిన బలిపీఠాలను గానీ, తమ చేతివేళ్ళతో చేసిన ఆషేరా దేవతా స్తంభాలను గానీ, సూర్యుడి విగ్రహాలను గానీ చూడరు.
9 Ɛda no, wɔn nkuropɔn a ɛwɔ banbɔ denden a Israelfoɔ enti wɔgyaa hɔ no bɛyɛ sɛ mmeammea a wɔagya ama nnɔtɔ ne wira. Ne nyinaa bɛda mpan.
౯ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల భయం వల్ల వాళ్ళు వదిలి వెళ్ళిన బలమైన పట్టణాలు కొండ శిఖరాల పైన నిర్జనమైన అడవుల్లా ఉంటాయి. అవి నాశనమై పోతాయి.
10 Mo werɛ afiri Onyankopɔn, mo Agyenkwa, na monkaee Ɔbotan no, mo aban no. Enti ɛwom sɛ mopɛ nnua papa na modua bobe a moatɔ afiri amanɔne.
౧౦ఎందుకంటే నీ రక్షణకు కారకుడైన దేవుణ్ణి నువ్వు మర్చి పోయావు. నీ బలానికి ఆధారంగా ఉన్న బండను అలక్ష్యం చేశావు. కాబట్టి నువ్వు అందమైన మొక్కలను నాటావు. అన్య దేశాల ద్రాక్ష చెట్లు నాటావు.
11 Ɛwom sɛ ɛda a moduaeɛ no, momaa ɛnyiniiɛ anɔpa a moduaeɛ no, na moma ɛguu nhwiren. Nanso otwa no renyɛ hwee sɛ yadeɛ ne ɔyea a wɔntumi nsa.
౧౧నువ్వు వాటిని నాటిన రోజున దానికి కంచె వేసి సేద్యం చేశావు. త్వరలోనే నీ విత్తనాలు ఫలించి మొక్కలు పెరిగాయి. కానీ అమితమైన దుఃఖం, భయంకరమైన విచారం కలిగే రోజున నీ పంట విఫలమవుతుంది.
12 Ao aman dodoɔ no nhurusoɔ, wɔhuruso te sɛ ɛpo a ɛrebɔ asorɔkye! Ao nnipa dodoɔ nworosoɔ, wɔworoso sɛ nsuo akɛseɛ!
౧౨అయ్యో! భీకరమైన సముద్ర ఘోషలా అనేక జనాలు వేసే కేకలు, బలమైన నీటి ప్రవాహపు హోరులాగా అనేక జాతులు తరలి పోతున్న శబ్దాలూ వినిపిస్తున్నాయి.
13 Ɛwom sɛ nnipa dodoɔ no woro so te sɛ nsuo a ɛresene mmirika so, nanso, Onyankopɔn bɛka wɔn anim ama wɔadwane akɔ akyirikyiri, te sɛ ntɛtɛ a mframa bɔ gu wɔ bepɔ so te sɛ anweatam so wira a mframa den rebɔ no.
౧౩అనేక నీటి ప్రవాహాల హోరులాగా జాతులు గర్జిస్తున్నాయి. కానీ దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. వాళ్ళు దూరంగా పారిపోతారు. గాలికి ఎగిరిపోయే చచ్చిన మొక్కలను గాలి ఎగర గొట్టినట్టుగా, సుడిగాలిలో పిచ్చి మొక్కలు గిర్రున తిరిగి పోయినట్టుగా వాళ్ళు పారిపోతారు.
14 Anwummerɛ, wɔbɔ yɛn hu awerɛfirie mu. Nanso ansa na adeɛ bɛkye no, na wɔkɔ dada! Wɔn a wɔfo yɛn nneɛma, ne wɔn a wɔbɔ yɛn korɔno kyɛfa nie.
౧౪సాయంత్రం, చూడండి, భయోత్పాతం! ఉదయం కాకుండానే వాళ్ళు కనిపించకుండా పోతారు. మమ్మల్ని దోచుకునే వాళ్లకి పట్టే గతి ఇదే. మా సంపదను దొంగతనం చేసేవాళ్ళకి దక్కేది ఇదే.