< 1 Mose 13 >
1 Abram tu firii Misraim. Ɔno, ne yere, Lot, nʼagyapadeɛ ne ne fiefoɔ nyinaa baa Negeb.
౧అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు.
2 Saa ɛberɛ no na Abram anya ne ho a ɔwɔ nyɛmmoa, dwetɛ ne sikakɔkɔɔ pii.
౨అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి.
3 Ɔfirii Negeb hɔ no, ɔdii atutena ara kɔduruu Bet-El, baabi a ɔdii ɛkan sii ne ntomadan a ɛwɔ Bet-El ne Ai ntam no.
౩అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు.
4 Ɛhɔ na kane no ɔsii nʼafɔrebukyia. Ɛhɔ nso na ɔkɔɔ so somm Awurade.
౪అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
5 Na Lot a ɔne Abram nam no nso yɛ ɔdefoɔ a ɔwɔ nnwan, anantwie ne asomfoɔ bebree.
౫అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి.
6 Esiane sɛ saa ɛberɛ no na Abram ne Lot nyinaa anya wɔn ho, na wɔwɔ nnwan, anantwie ne asomfoɔ pii enti, na wɔnsene asase no so.
౬వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది.
7 Na akasakasa taa baa Abram mmoahwɛfoɔ ne Lot mmoahwɛfoɔ no ntam. Saa ɛberɛ no na Kanaanfoɔ ne Perisifoɔ nso tete asase no so.
౭ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు.
8 Enti, Abram ka kyerɛɛ Lot sɛ, “Mesrɛ wo, mma akasakasa mma me ne wo anaa me mmoahwɛfoɔ ne wo mmoahwɛfoɔ ntam, ɛfiri sɛ, yɛyɛ anuanom.
౮కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు.
9 Ɛnyɛ asase no nyinaa na ɛda wʼanim yi? Ma yɛnni mpaapaemu. Sɛ wokɔ benkum a, mɛkɔ nifa, na sɛ wokɔ nifa nso a, mɛkɔ benkum.”
౯ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు.
10 Lot hwɛɛ ne ho hyiaeɛ, hunuu sɛ asase a ɛda Yordan ho no yɛ asasebereɛ. Na nsuo wɔ mu baabiara te sɛ Eden turom anaasɛ Misraim asase a ɛda Soar fam hɔ no ara pɛ. Saa ɛberɛ no, na Awurade nnya nsɛee Sodom ne Gomora.
౧౦లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది.
11 Na Lot de nʼani kyerɛɛ apueeɛ fam, faa asase a ɛda Yordan ho no. Yei ne ɛkwan a Abram ne Lot faa so dii ntetemu no.
౧౧కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు.
12 Abram tenaa Kanaan asase so. Ɛnna Lot nso dii atutena wɔ nkuropɔn a ɛwowɔ nsase tamaa no so, na ɔkɔsii ne ntomadan wɔ baabi a ɛbɛn Sodom.
౧౨అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు.
13 Na nnipa a wɔwɔ Sodom kuro no mu no yɛ amumuyɛfoɔ a daa wɔyɛ bɔne akɛseakɛseɛ de tia Awurade.
౧౩సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.
14 Lot tee ne ho firii Abram ho akyiri no, Awurade ka kyerɛɛ Abram sɛ, “Afei, ma wʼani so hwɛ atifi fam, anafoɔ fam, apueeɛ fam ne atɔeɛ fam.
౧౪లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా “నువ్వు ఉన్నచోటనుంచి నాలుగు దిక్కులకూ చూడు.
15 Mede asasetam a wʼani tua yi nyinaa bɛma wo ne wʼasefoɔ afebɔɔ.
౧౫నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.
16 Mɛma wʼasefoɔ adɔɔso sɛ asase so mfuturo a obiara ntumi nkan.
౧౬నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసులనుకూడా లెక్కపెట్టవచ్చు.
17 Sɔre, kɔ na kɔhwehwɛ asase no so nyinaa, ɛfiri sɛ, mede rema wo.”
౧౭నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను” అని అబ్రాముతో చెప్పాడు.
18 Enti, Abram tutuu ne ntomadan bɛtenaa odum kwaeɛ bi a ɛyɛ Mamrɛ dea wɔ Hebron. Ɛhɔ na ɔsii afɔrebukyia maa Awurade.
౧౮అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.