< Hesekiel 22 >
1 Awurade asɛm baa me nkyɛn sɛ:
౧యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఇలా అన్నాడు,
2 “Onipa ba, wobɛbu Yerusalem atɛn? Wobɛbu saa mogyahwiegu kuropɔn yi atɛn anaa? Ɛnneɛ fa ne nneyɛɛ a ɛyɛ akyiwadeɛ no nyinaa si nʼanim
౨“నరపుత్రుడా, తీర్పు తీరుస్తావా? ఈ రక్తపు పట్టణానికి తీర్పు తీరుస్తావా? దాని అసహ్యమైన పనులన్నీ దానికి తెలియజెయ్యి.
3 na ka sɛ: ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ: Ao kuropɔn a ɔnam mogya hwieguo so de nnome aba ne ho so na ɔde ahoni a ɔyɛ agu ne ho fi,
౩నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం!
4 woadi fɔ wɔ mogya a woahwie agu na woagu wo ho fi wɔ ahoni a woayɛ enti. Woama wo nna abɛn, na wo mfeɛ awieeɛ no aba. Enti mɛyɛ wo ahohoradeɛ wɔ amanaman no mu, ne asredeɛ wɔ amantam no nyinaa mu.
౪రక్తం కార్చిన కారణంగా నువ్వు నేరం చేశావు. నువ్వు చేసుకున్న విగ్రహాల మూలంగా నువ్వు అశుద్ధం అయ్యావు! నువ్వే నీ దినాలు ముగింపుకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ఆఖరి సంవత్సరాల్లో ఉన్నావు. కాబట్టి అన్యప్రజల్లో ఒక నిందగానూ, అన్ని దేశాల దృష్టిలో ఒక ఎగతాళిగానూ నిన్ను చేస్తాను.
5 Wɔn a wɔbɛn ne wɔn a wɔwɔ akyirikyiri bɛdi wo ho fɛw, Ao Kuropɔn a ɛnni animuonyam, na basabasayɛ ahyɛ no ma.
౫దగ్గర వాళ్ళూ, దూరం వాళ్ళు అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఓ అపవిత్ర పట్టణమా, నువ్వు గందరగోళంతో నిండిన దానివన్న కీర్తి అందరికీ పాకింది.
6 “‘Hwɛ sɛdeɛ Israel mmapɔmma a wɔwɔ wo mu no mu biara de ne tumi hwie mogya guo.
౬నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు.
7 Wɔabu agya ne ɛna animtiaa wɔ wo mu. Wɔahyɛ ɔnanani so, na wɔatane awisiaa ne akunafoɔ ani.
౭నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు.
8 Wɔabu mʼakronkronneɛ animtiaa na woagu me home nna ho fi.
౮నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను నువ్వు అలక్ష్యం చేశావు. నా విశ్రాంతిదినాలను అపవిత్రం చేశావు.
9 Wo mu na mmarima ntwatosofoɔ a wɔpɛ sɛ wɔhwie mogya guo wɔ, wɔn a wɔdidi wɔ sorɔnsorɔmmea abosonnan mu, na wɔyɛ ahohoradeɛ.
౯దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు.
10 Wo mu na wɔn a wɔgu wɔn agyanom mpa ho fi wɔ. Wɔn a wɔne mmaa a wɔabu wɔn nsa, na wɔn ho nteɛ no da no wɔ wo mu.
౧౦తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు.
11 Wo mu na ɔbarima ne ne yɔnko yere yɛ bɔne a ɛyɛ akyiwadeɛ. Ɔfoforɔ ne nʼase baa da wɔ animguaseɛ mu, na ɔfoforɔ ne ne nuabaa da, ɔno ankasa nʼagya babaa.
౧౧ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు.
12 Wo mu na nnipa gye adanmudeɛ ka mogya guo; wɔgye nsihoɔ ne mfasoɔ a ɛboro so firi wɔn mfɛfoɔ nkyɛn de nya wɔn ho bebree. Na mo werɛ afiri me, Otumfoɔ Awurade na ɔseɛ.
౧౨వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
13 “‘Ampa ara mɛbɔ me nsam agu wʼasisie ahonya ne mogya a woahwie agu no so.
౧౩“కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను.
14 Wʼakokoduro bɛtumi agyina anaa sɛ wo nsa bɛyɛ den ɛda no a me ne wo bɛnya no anaa? Me Awurade na akasa, na mɛyɛ.
౧౪నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను.
15 Mɛhwete wo mu agu amanaman no so, na mabɔ wo apansam amantam no mu; na mede wo afideyɛ aba nʼawieeɛ.
౧౫కాబట్టి అన్యప్రజల్లోకి నిన్ను చెదరగొడతాను. ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను. ఈ విధంగా నీ అపవిత్రతను ప్రక్షాళన చేస్తాను.
16 Sɛ wɔgu wo ho fi wɔ amanaman no mu a, wobɛhunu sɛ mene Awurade no.’”
౧౬కాబట్టి నువ్వు అన్యదేశాల దృషిలో అశుద్ధం ఔతావు. అప్పుడు నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.”
17 Afei, Awurade asɛm baa me nkyɛn sɛ:
౧౭తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.
18 “Onipa ba, Israel efie abɛyɛ dwetɛ ase fi ama me; wɔn nyinaa yɛ kɔbere, sanya, dadeɛ ne sumpii a wɔagya wɔ fononoo mu. Wɔyɛ dwetɛ fi hunaa.
౧౮“నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.”
19 Ɛno enti sei na Otumfoɔ Awurade seɛ: ‘Esiane sɛ mo nyinaa abɛyɛ dwetɛ fi enti, mɛboaboa mo ano wɔ Yerusalem.
౧౯కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు,
20 Sɛdeɛ nnipa boaboa dwetɛ, kɔbere, sumpii ne sanya ano hyɛ fononoo mu de egyadɛreɛ a ano yɛ dene nane no, saa ara na mɛfiri mʼabufuo ne mʼabufuhyeɛ mu aboaboa mo ano wɔ kuropɔn no mu na manane mo.
౨౦నా కోపంతోనూ, ఉగ్రతతోనూ మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిస్తాను.
21 Mɛboaboa mo ano na mahu mʼabufuhyeɛ ogya agu mo so, na moanane wɔ ne mu.
౨౧మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు.
22 Sɛdeɛ wɔnane dwetɛ wɔ fononoo mu no, saa ara na mobɛnane wɔ ne mu na moahunu sɛ me Awurade na mahwie mʼabufuhyeɛ agu mo so.’”
౨౨కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.”
23 Na Awurade asɛm baa me nkyɛn bio sɛ:
౨౩యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు,
24 “Onipa ba, ka kyerɛ asase no sɛ, ‘Woyɛ asase a woanya osutɔ anaa osuo ampete wo so wɔ abufuo ɛda no.’
౨౪“నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు!
25 Ne mmapɔmma abɔ pɔ bɔne wɔ ne mu te sɛ gyata a ɔbobɔm na ɔtete ne haboa mu. Wɔwe nnipa nam, wɔfa ademudeɛ ne nneɛma a ɛsom bo na wɔma akunafoɔ dɔɔso wɔ ne mu.
౨౫అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.
26 Nʼasɔfoɔ bu me mmara so na wɔgu mʼakronkronneɛ ho fi; wɔnnkyerɛ nsonsonoeɛ a ɛda deɛ ɛyɛ kronn ne deɛ ɛnyɛ kronn ntam; wɔkyerɛkyerɛ sɛ nsonsonoeɛ biara nna deɛ ɛho nteɛ ne deɛ ɛho teɛ ntam, na wɔbu wɔn ani gu me home nna die so, de gu me ho fi wɔ wɔn mu.
౨౬దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు. నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను అపవిత్రం చేస్తారు. ప్రతిష్ఠితమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడాన్ని ప్రజలకు నేర్పరు. వాళ్ళ మధ్య నేను దూషణ పొందేలా, నేను విధించిన విశ్రాంతి దినాలను వాళ్ళ దృష్టికి రానివ్వరు.
27 Nʼadwumayɛfoɔ te sɛ mpataku a wɔretete wɔn ahaboa mu; wɔhwie mogya gu na wɔkum nnipa de pɛ mfasoɔ bɔne.
౨౭దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు.
28 Nʼadiyifoɔ nam atorɔ anisoadehunu ne nkontompo nkɔmhyɛ so ma saa nnebɔne yi yɛ fitaa. Wɔka sɛ, ‘Yei ne deɛ Otumfoɔ Awurade seɛ,’ wɔ ɛberɛ a Awurade nkasaeɛ.
౨౮దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు.
29 Asase no so nnipa di amin na wɔbɔ korɔno; wɔhyɛ ahiafoɔ ne mmɔborɔfoɔ so, wɔnnye ahɔhoɔ ani na wɔde atɛntenenee kame wɔn.
౨౯దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు.
30 “Mehwehwɛɛ obi wɔ wɔn mu a ɔbɛto ɔfasuo no na wagyina mʼanim wɔ asase no anan mu, sɛdeɛ ɛbɛyɛ a merensɛe asase no, nanso manhunu obiara.
౩౦నేను దేశాన్ని పాడు చెయ్యకుండా ఉండేలా గోడలు కట్టి, బద్దలైన గోడ సందుల్లో నిలిచి ఉండడానికి తగిన వాడి కోసం నేను ఎంత చూసినా, ఒక్కడైనా నాకు కనిపించలేదు.
31 Ɛno enti, mɛhwie mʼabufuhyeɛ agu wɔn so, na mede mʼabufuo a ɛyɛ hu no atɔre wɔn ase, na mama deɛ wɔayɛ nyinaa abɔ wɔn tiri so, Otumfoɔ Awurade asɛm nie.”
౩౧కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.