< Hesekiel 19 >
1 “Momma Israel mmapɔmma ho kwadwom
౧“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.
2 na monka sɛ: “‘Na wo maame yɛ gyatabereɛ mu soronko wɔ agyata mu! Ɔdaa gyataburuwa mu yɛnee ne mma.
౨నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది. అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది.
3 Ɔyɛn ne mma no mu baako ma ɔbɛyɛɛ gyata ɔhoɔdenfoɔ. Ɔsuaa sɛdeɛ wɔtete ahaboa mu, na ɔwee nnipa nam.
౩వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. అది మనుషులను మింగేసింది.
4 Amanaman no tee ne nka, na wɔn amena yii no. Wɔguu no nkapo de no kɔɔ Misraim asase so.
౪అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు. వాళ్ళు అతనికి గాలాలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు.
5 “‘Ɛberɛ a ɔhunuu sɛ nʼanidasoɔ anyɛ hɔ, na deɛ ɔrehwɛ anim ayera no, ɔfaa ne ba foforɔ yɛɛ no gyata ɔhoɔdenfoɔ.
౫దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది.
6 Ɔkyinkyinii agyata no mu ɛfiri sɛ na wayɛ gyata hoɔdenfoɔ. Ɔsuaa sɛdeɛ wɔtete ahaboa mu na ɔwee nnipa nam.
౬ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది.
7 Ɔbubuu wɔn abandenden na ɔsɛee wɔn nkuro. Asase no ne wɔn a wɔte so nyinaa no, ne mmobomu bɔɔ wɔn hu.
౭తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడు చేశాడు. అతని గర్జన శబ్దానికి ఆ దేశం, దానిలో ఉన్నదంతా ఖాళీ అయి పోయింది.
8 Afei amanaman no sɔre tiaa no, wɔn a wɔfiri nsase a atwa ahyia no so. Wɔguu no asau kyeree no wɔ wɔn amena mu.
౮నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది.
9 Wɔde nnarewa twee no kɔhyɛɛ ebuo mu na wɔde no brɛɛ Babilonia ɔhene. Wɔde no too nneduafie, na wɔante ne mmobomu no bio wɔ Israel mmepɔ no so.
౯అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. దాని గర్జన ఇశ్రాయేలు పర్వతాలమీద ఇక ఎన్నటికీ వినబడకుండా వాళ్ళు దాన్ని కొండ కోటలో ఉంచారు.
10 “‘Na wo maame te sɛ bobedua a wɔtɛɛ no nsuo ho wɔ wo bobeturo mu. Na ɛso aba, na ɛyiyii mman nsuo a ɔnya no bebree no enti.
౧౦నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది. అక్కడ విస్తారమైన నీళ్ళు ఉండేవి గనుక అది ఎన్నో తీగలు కలిగి విరివిగా ద్రాక్షలు కాసేది.
11 Ne mman yɛɛ den yie ɛdi mu sɛ wɔde yɛ ahemfo ahempoma. Ɛkorɔn, bunkam faa nhahan a ayɛ kuhaa no so, ne sorokɔ ne ne mman bebree no maa no yɛɛ sononko.
౧౧రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.
12 Nanso wɔde abufuhyeɛ tuu nʼase de no hwee fam. Apueeɛ mframa maa no kasaeɛ, ɛso aba tete guiɛ; na ne mman a ɛwɔ ahoɔden no twintwameeɛ na ogya hyeeɛ.
౧౨కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.
13 Afei wɔakɔtɛ no wɔ ɛserɛ so asase wesee a nsuo nni muo.
౧౩కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది. దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి,
14 Ogya trɛ firii ne mman baako so na ɛhyee nʼaba. Anka mman a ɛwɔ ahoɔden baako mpo wɔ so deɛ wɔde yɛ ahemfo ahempoma ma ɛyɛ yie no.’ Yei yɛ kwadwom, na ma wɔnto no saa ara.”
౧౪దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు. ఏలుబడి చేసేందుకు రాజదండం లేదు.” ఇది ఒక శోకం, ఒక శోక గీతంగా దీన్ని పాడతారు.