< Hesekiel 18 >

1 Awurade asɛm baa me nkyɛn sɛ,
యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది.
2 “Sɛ mo saa nkurɔfoɔ yi bu saa bɛ a ɛfa Israel asase yi ho a, na mopɛ sɛ mokyerɛ ɛdeɛn: “‘Agyanom adi bobe bunu, nanso wɔn mma mmom se afem anaa?’
“తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి” అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్థం ఏంటి?
3 “Nokorɛm, sɛ mete ase yi, sei na Awurade seɛ, moremmu saa bɛ yi bio wɔ Israel.
నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో ఇంక మీరు పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
4 Ɔkra teasefoɔ biara wɔ me, agya ne ɔba barima nyinaa, wɔn nyinaa wɔ me. Ɔkra a ɔyɛ bɔne no, ɔno ne deɛ ɔbɛwuo.
“చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!
5 “Sɛ ɛba sɛ onipa tenenee bi wɔ hɔ a ɔyɛ deɛ ɛtene na ɛyɛ pɛ;
ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి,
6 ɔnnidi wɔ mmepɔ so abosonnan mu na ɔnsom ahoni a wɔwɔ Israel efie. Ɔngu ne yɔnko yere ho fi na ɔne ɔbaa a wabu ne nsa nna.
పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా,
7 Ɔnhyɛ obiara so, na ɔde boseagyeni awowasideɛ sane ma no. Ɔmmɔ korɔno mmom ɔde nʼaduane ma deɛ ɛkɔm de no na ɔfira deɛ ɔda adagya no ntoma.
అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,
8 Ɔmmɔ bosea nye nsiho na ɔnnye mfɛntom mmorosoɔ. Ɔtwe ne ho firi mfomsoɔyɛ ho na ɔbu nnipa baanu ntam atɛntenenee.
వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి,
9 Ɔdi mʼahyɛdeɛ so na ɔdi me mmara so nokorɛm. Saa onipa no na ɔtene; na ampa ara ɔbɛnya nkwa Awurade asɛm nie.
నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
10 “Sɛ ɛba sɛ ɔwɔ ɔba barima a ɔdi akakabensɛm na ɔhwie mogya gu anaasɛ ɔyɛ saa nneɛma yi mu biara a
౧౦కాని ఆ నీతిమంతునికి, ఇలాంటివేవీ చెయ్యకుండా రక్తం ఒలికించే ఒక హింసాత్మకుడైన కొడుకు ఉంటే, వాడు బలాత్కారం చేస్తూ, ప్రాణహాని చేస్తూ, చెయ్యరాని పనులు చేసి,
11 (bɔne a nʼagya mpo anyɛ bi da): “Ɔdidi wɔ mmepɔ so abosonnan mu. Ɔgu ne yɔnko yere ho fi.
౧౧చెయ్యాల్సిన మంచి పనులు ఏవీ చెయ్యకుండా ఉంటే, అంటే, పర్వతాల మీద భోజనం చెయ్యడం, తన పొరుగువాడి భార్యను చెరచడం,
12 Ɔhyɛ ahiafoɔ ne mmɔborɔfoɔ so. Ɔbɔ korɔno. Ɔmmfa boseagyeni awowasideɛ mma no. Ɔde ne ho to abosom so. Ɔyɛ akyiwadeɛ.
౧౨అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,
13 Ɔbɔ bosea gye nsiho na ɔgye mfɛntom mmorosoɔ. Saa onipa yi bɛnya nkwa anaa? Dabi! Esiane sɛ wayɛ saa akyiwadeɛ yi nyinaa enti, ampa ara, wɔbɛkum no na ne mogya bɛbɔ nʼankasa tiri so.
౧౩అప్పిచ్చి వడ్డీ తీసుకోవడం, అధిక లాభం తీసుకోవడం, మొదలైన పనులు చేస్తే, వాడు బ్రతకాలా? వాడు బ్రతకడు! ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు గనుక అతడు తప్పకుండా చస్తాడు. అతని ప్రాణానికి అతడే బాధ్యుడు.
14 “Nanso sɛ ɛba sɛ saa ɔbabarima yi wɔ ɔbabarima a ɔhunu bɔne a nʼagya yɛ no nyinaa nanso ɔnnyɛ saa nneɛma no bi:
౧౪అయితే అతనికి ఒక కొడుకు పుట్టినప్పుడు, ఆ కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసి, తనమట్టుకు తాను దేవునికి భయపడి, అలాంటి పనులు చెయ్యకపోతే, అంటే,
15 “Ɔnnidi wɔ mmepɔ so abosonnan mu na ɔmfa ne ho nto ahoni a ɛwɔ Israel efie so. Ɔngu ne yɔnko yere ho fi.
౧౫పర్వతాలమీద భోజనం చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరచకుండా,
16 Ɔnhyɛ obiara so na ɔnnye boseagyeni hɔ awowasideɛ. Ɔmmɔ korɔno, mmom ɔde nʼaduane ma deɛ ɛkɔm de noɔ na ɔfira deɛ ɔda adagya no ntoma.
౧౬ఎవరినీ బాధ పెట్టకుండా, తాకట్టు వస్తువు ఉంచుకోకుండా, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యకుండా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,
17 Ɔtwe ne ho firi bɔne ho, na ɔnnye nsiho anaa mfɛntom mmorosoɔ. Ɔdi me mmara ne mʼahyɛdeɛ so. Ɔrenwu wɔ nʼagya no bɔne nti; ampa ara ɔbɛnya nkwa.
౧౭పేదవాడి మీద అన్యాయంగా చెయ్యి వేయకుండా, లాభం కోసం అప్పివ్వకుండా, వడ్డీ తీసుకోకుండా, నా ఆదేశాలు పాటిస్తూ నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!
18 Nanso nʼagya no bɛwu wɔ ɔno ara bɔne enti, ɛfiri sɛ ɔsisii nnipa, bɔɔ ne yɔnko korɔno, na ɔyɛɛ bɔne wɔ ne nkurɔfoɔ mu.
౧౮అతని తండ్రి క్రూరంగా ఇతరులను బాధపెట్టి, బలవంతంగా తన సహోదరులను దోపిడీ చేసి, తన ప్రజల్లో తగని పనులు చేశాడు గనుక తన పాపం కారణంగా తానే చస్తాడు.
19 “Nanso mobisa sɛ, ‘Adɛn enti na ɔbabarima no nnya nʼagya afɔdie no bi ho asotwe?’ Esiane sɛ ɔbabarima no ayɛ deɛ ɛtene na ɛyɛ pɛ na wahwɛ yie adi mʼahyɛdeɛ nyinaa so enti, ampa ara ɔbɛnya nkwa.
౧౯కాని మీరు “తండ్రి పాపశిక్ష కొడుకు ఎందుకు మొయ్యడు?” అంటారు. ఎందుకంటే, కొడుకు నీతిన్యాయాలకు అనుగుణంగా, నా శాసనాలనే అనుసరించి వాటి ప్రకారం చేస్తున్నాడు గనుక అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!
20 Ɔkra a ɔyɛ bɔne no, ɔno ne deɛ ɔbɛwuo. Ɔbabarima no rennya nʼagya afɔdie no ho asotwe bi, saa ara na agya no nso rennya ɔbabarima no afɔdie ho asotwe no bi. Ɔteneneeni adeteneneeyɛ no bɛdi ama no, na wɔde omumuyɛfoɔ amumuyɛsɛm bɛbu atia no.
౨౦పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.
21 “Na sɛ omumuyɛfoɔ twe ne ho firi bɔne a wayɛ nyinaa ho, na ɔdi mʼahyɛdeɛ so, na afei ɔyɛ deɛ ɛtene ne deɛ ɛyɛ papa a, ampa ara ɔbɛnya nkwa na ɔrenwu.
౨౧అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు.
22 Wɔrennyina bɔne a wayɛ no mu biara so mmu no atɛn. Ne tenenee nneyɛɛ enti, ɔbɛnya nkwa.
౨౨అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు.
23 Mʼani gye amumuyɛfoɔ wuo ho anaa? Otumfoɔ Awurade bisa. Sɛ wɔtwe wɔn ho firi wɔn akwammɔne ho na wɔnya nkwa a, mʼani nnye anaa?
౨౩“దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
24 “Na sɛ ɔteneneeni twe ne ho firi ne tenenee adeyɛ ho, kɔyɛ bɔne, na ɔyɛ akyiwadeɛ a amumuyɛfoɔ yɛ a, ɔbɛnya nkwa anaa? Wɔrenkae ne tenenee nneyɛɛ no. Esiane sɛ ɔdi nokorɛdie ho fɔ na wayɛ bɔne enti, ɔbɛwu.
౨౪“కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.
25 “Nanso moka sɛ, ‘Awurade ɛkwan ntene.’ Montie, Israel efie, Me ɛkwan ntene anaa? Ɛnyɛ mo akwan mmom na ɛntene?
౨౫కాని మీరు, ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి! మీ మార్గాలే గదా అన్యాయమైనవి.
26 Sɛ ɔteneneeni twe ne ho firi ne tenenee nneyɛɛ ho na ɔkɔyɛ bɔne a, ɛno enti ɔbɛwu, bɔne a wayɛ enti, ɔbɛwu.
౨౬నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు వాటిని బట్టి చస్తాడు. తాను పాపం చేసిన కారణంగానే అతడు చస్తాడు.
27 Nanso sɛ omumuyɛfoɔ twe ne ho firi amumuyɛsɛm a wayɛ ho, na ɔyɛ deɛ ɛtene ne deɛ ɛyɛ papa a, ɔbɛgye ne kra nkwa.
౨౭కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు.
28 Esiane sɛ wahunu ne mmarato na watwe ne ho afiri ho enti, ɔbɛnya nkwa na ɔrenwu.
౨౮అతడు గమనించుకుని తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నీ చెయ్యకుండా మాని వేశాడు గనక అతడు చావకుండా కచ్చితంగా బ్రతుకుతాడు.
29 Nanso, Israel efie ka sɛ, ‘Awurade ɛkwan ntene.’ Mʼakwan ntene? Israel efie, ɛnyɛ mo akwan mmom na ɛntene anaa?
౨౯కాని ఇశ్రాయేలీయులు ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అని అంటున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయం ఎందుకు కాదు? మీ మార్గం అన్యాయం ఎందుకు కాదు?
30 “Ɛno enti, Israel efie, mɛbu mo mu biara atɛn sɛdeɛ nʼakwan teɛ, Otumfoɔ Awurade na ɔseɛ. Monsakra mo adwene! Montwe mo ho mfiri mo mmaratoɔ nyinaa ho; na afei bɔne remfa mo nkɔ asehweɛ mu bio.
౩౦కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.
31 Monto mfomsoɔ a moayɛ nyinaa ngu na moanya akoma foforɔ ne honhom foforɔ. Adɛn enti na ɛsɛ sɛ mowuo, Ao Israel efie?
౩౧మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి?
32 Mʼani nnye obiara owuo ho, Otumfoɔ Awurade na ɔseɛ. ‘Monsakra mo adwene na moanya nkwa!’
౩౨నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.”

< Hesekiel 18 >