< Ɔsɛnkafoɔ 9 >

1 Enti medwenee yeinom nyinaa ho na mehunuu sɛ ateneneefoɔ, anyansafoɔ ne deɛ wɔyɛ wɔ Onyankopɔn nsam; nanso obiara nnim sɛ ɔdɔ anaasɛ ɔtan retwɛn no.
నీతిమంతులు, జ్ఞానులు, వారు చేసే పనులు అన్నీ పరిశీలించి చూసి అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయని నేను గ్రహించాను. ప్రేమించడం, ద్వేషించడం అనేవి మనుషుల చేతిలో లేవని, అది వారి వలన కాదనీ నేను తెలుసుకున్నాను.
2 Wɔn nyinaa hyɛberɛ yɛ baako; ateneneefoɔ ne amumuyɛfoɔ, nnipa pa ne nnipa bɔne, wɔn a wɔn ho teɛ ne wɔn a wɔn ho nteɛ, wɔn a wɔbɔ afɔdeɛ ne wɔn a wɔmmɔ. Sɛdeɛ ɛte ma onipa pa no, saa ara na ɛte ma ɔbɔnefoɔ; sɛdeɛ ɛte ma wɔn a wɔka ntam no, saa ara na ɛte ma wɔn a wɔsuro sɛ wɔbɛka ntam.
జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు, దుష్టులకు, మంచివారికి, చెడ్డవారికి, పవిత్రులకు, అపవిత్రులకు, బలులర్పించే వారికి, అర్పించని వారికి, అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది. ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.
3 Yei ne bɔne a ɛwɔ biribiara a ɛsi wɔ owia yi ase mu. Hyɛberɛ baako ba yɛn nyinaa so. Deɛ ɛka ho ne sɛ, bɔne ahyɛ nnipa akoma mu ma na abɔdamsɛm wɔ wɔn akoma mu ɛberɛ a wɔwɔ nkwa mu, na akyire no, wɔkɔka awufoɔ ho.
అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.
4 Obiara a ɔka ateasefoɔ ho no wɔ anidasoɔ, mpo ɔkraman a ɔte ase yɛ sene gyata a wawuo.
చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.
5 Na ateasefoɔ nim sɛ wɔbɛwu, nanso awufoɔ nnim hwee; wɔnni akatua biara bio, na wɔn ho nkaeɛ mpo ayera.
బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
6 Wɔn dɔ, ɔtan ne ninkunu atu ayera dada; wɔnni hwee yɛ wɔ biribiara a ɛsi wɔ owia yi ase mu.
వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి. సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు.
7 Enti kɔ, fa anigyeɛ di wʼaduane, na fa ahosɛpɛ akoma nom wo nsã, ɛfiri sɛ saa ɛberɛ yi na Onyankopɔn pene deɛ woyɛ so.
నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి. సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
8 Ɛberɛ biara ma wʼaduradeɛ nyɛ fitaa na fa ngohwam sra wo tirim.
ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో.
9 Wo ne wo yere monnye mo ani, ɔbaa a wo dɔ noɔ no, wɔ nna a ɛnka hwee a Onyankopɔn de ama mo wɔ owia yi ase, mo ahuhudeɛ nna no. Ɛfiri sɛ ɛyɛ mo kyɛfa wɔ mo nkwa nna mu, ne mo adwumaden wɔ owia yi ase.
దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం.
10 Deɛ wo nsa bɛso mu biara, fa wʼahoɔden nyinaa yɛ, ɛfiri sɛ damena a wɔrekɔ mu no, adwumayɛ, adwendwene, nhunumu ne nimdeɛ nni hɔ. (Sheol h7585)
౧౦నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు. (Sheol h7585)
11 Mehunuu biribi foforɔ wɔ owia yi ase: Mmirikakansie nni hɔ mma deɛ ne ho yɛ herɛ anaasɛ ɔko nni hɔ mma ɔhoɔdenfoɔ, aduane mma onyansafoɔ nkyɛn anaasɛ ahonya nnkɔ nhunumufoɔ hɔ na adom nnkɔ animdefoɔ nkyɛn; nanso berɛ ne akwannya wɔ hɔ ma wɔn nyinaa.
౧౧నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.
12 Bio, onipa biara nnim dɔn ko a ne berɛ bɛso: Sɛdeɛ asau tumi kyere mpataa, ne sɛdeɛ afidie yi nnomaa no saa ara na mmerɛ bɔne to nnipa wɔ ɛberɛ a wɔn ani nni wɔn ho so.
౧౨తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు. చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు, హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు.
13 Bio, mehunuu saa nimdeɛ ho nhwɛsoɔ yi wɔ owia yi ase ma ɛtɔɔ me so yie:
౧౩ఇంకా జరుగుతున్న దాన్ని చూసినప్పుడు నేను అది జ్ఞానం అనుకున్నాను. అది నా దృష్టికి గొప్పదిగా ఉంది.
14 Ɛberɛ bi na kuropɔn ketewa bi wɔ hɔ a emu nnipa yɛ kakraa bi. Ɔhene bi a ɔwɔ tumi to hyɛɛ kuropɔn yi so. Ɔtwaa ho hyiaeɛ na ɔsisii mpie akɛseɛ tiaa no.
౧౪ఏమంటే కొద్దిమంది నివసించే ఒక చిన్న పట్టణం ఉంది. దానిమీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించి దాని ఎదురుగా గొప్ప బురుజులు కట్టించాడు.
15 Na ohiani bi a ɔnim nyansa wɔ kuropɔn no mu, na ɔnam ne nimdeɛ so gyee kuropɔn no sii hɔ. Nanso obiara ankae saa ohiani no.
౧౫అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు.
16 Enti mekaa sɛ, “Nimdeɛ yɛ sene ahoɔden.” Nanso wɔbuu ohiani no nimdeɛ no animtiaa, na obiara ntie nʼasɛm bio.
౧౬కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”
17 Ɛsɛ sɛ wɔtie onyansafoɔ nsɛm a ɔka no brɛoo no na ɛnyɛ nkwaseafoɔ sodifoɔ nteateam.
౧౭మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.
18 Nimdeɛ yɛ sene akodeɛ, nanso ɔdebɔneyɛfoɔ baako sɛe nnepa bebree.
౧౮యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.

< Ɔsɛnkafoɔ 9 >