< 5 Mose 27 >
1 Mose ne Israel mpanimfoɔ hyɛɛ ɔmanfoɔ no sɛ, “Monni mmara a mede rema mo ɛnnɛ yi nyinaa so.
౧మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు. “ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి.
2 Sɛ motwa Yordan kɔduru asase a Awurade, mo Onyankopɔn de rema mo no so a, monhyehyɛ aboɔ akɛseɛ na momfa akaadoo nsra ho.
౨మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.
3 Sɛ motwa Yordan kɔ asase a Awurade, mo Onyankopɔn de rema mo no so, asase a ɛwoɔ ne nufosuo resene so no so a, montwerɛ mmara no nyinaa ngu so sɛdeɛ Awurade, mo agyanom Onyankopɔn, hyɛɛ mo bɔ no.
౩మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి.
4 Na sɛ motwa Yordan a, monhyehyɛ aboɔ no wɔ Ebal bepɔ so sɛdeɛ merehyɛ mo ɛnnɛ yi na momfa akaadoo no mfa ho.
౪మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.
5 Monsi afɔrebukyia, aboɔ afɔrebukyia wɔ hɔ mma Awurade, mo Onyankopɔn. Mommfa dadeɛ biribiara nka.
౫అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు.
6 Momfa aboɔ nkunkuma nsi Awurade, mo Onyankopɔn afɔrebukyia no na mommɔ ɔhyeɛ afɔdeɛ wɔ so mma Awurade, mo Onyankopɔn.
౬చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి.
7 Mommɔ asomdwoeɛ afɔdeɛ nso wɔ so na momfa anigyeɛ nnidi wɔ hɔ wɔ Awurade, mo Onyankopɔn, anim.
౭మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి.
8 Montwerɛ mmara no mu nhyehyɛeɛ nyinaa pɛpɛɛpɛ ngu aboɔ a wɔde akaadoo aka so no so.”
౮ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి.
9 Afei, Mose ne Lewifoɔ asɔfoɔ kasa kyerɛɛ Israelfoɔ no sɛ, “Ao Israel, monyɛ komm na montie! Ɛnnɛ, moabɛyɛ Awurade, mo Onyankopɔn manfoɔ.
౯మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి.
10 Monyɛ ɔsetie mma Awurade, mo Onyankopɔn, na monni ne mmara ne nʼahyɛdeɛ a mede rema mo ɛnnɛ yi so.”
౧౦ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి.
11 Saa ɛda no ara, Mose hyɛɛ ɔmanfoɔ no sɛ,
౧౧ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు,
12 Sɛ motwa Asubɔnten Yordan a, Simeon, Lewi, Yuda, Isakar, Yosef ne Benyamin mmusuakuo na wɔnnyina Gerisim bepɔ so nhyira ɔman no.
౧౨బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి.
13 Ruben, Gad, Aser, Sebulon, Dan ne Naftali mmusuakuo nso nnyina Ebal bepɔ so nnome.
౧౩రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి.
14 Na afei, Lewifoɔ nteam ngu nnipa a wɔwɔ Israel nyinaa so sɛ:
౧౪అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.” “యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో
15 “Nnome nka onipa a ɔbɛyɛ ohoni a wɔasene anaa deɛ wɔagu de ahyɛ kɔkoam. Saa ahoni adwumfoɔ nsaano nnwuma yi yɛ Awurade akyiwadeɛ.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౧౫మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “ఆమేన్” అనాలి.
16 “Nnome nka obiara a ɔbɛbu nʼagya anaa ne maame animtia.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౧౬“తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
17 “Nnome nka obiara a ɔsesa hyeɛ nam so bɔ ne yɔnko korɔno.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౧౭“తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
18 “Nnome nka obiara a ɔma onifirani fom ɛkwan.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౧౮“గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
19 “Nnome nka obiara a ɔsisi ahɔhoɔ, nwisiaa ne akunafoɔ.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౧౯“పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
20 “Nnome nka obiara a ɔne nʼagya yere bɛda, ɛfiri sɛ, wagu nʼagya mpa ho fi.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౦“తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
21 “Nnome nka obiara a ɔne aboa bɛda.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౧“ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
22 “Nnome nka obiara a ɔne ne nuabaa bɛda, sɛ ɔyɛ nʼagya babaa anaa ne maame babaa.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౨“తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
23 “Nnome nka obiara a ɔne nʼase baa bɛda.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౩“తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
24 “Nnome nka obiara a ɔbɛkum ɔfoforɔ wɔ kɔkoam.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౪“రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
25 “Nnome nka obiara a ɔgye apaabɔdeɛ na ɔkum onipa a ɔnyɛɛ bɔne biara.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౫“నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
26 “Nnome nka obiara a wanni mmaransɛm yi so na wannye anto mu.” Na ɔman no nyinaa bɛgye so sɛ, “Amen!”
౨౬“ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.