< Daniel 6 >
1 Ɛsɔɔ Ɔhene Dario ani sɛ ɔbɛpa ahenemma ɔha ne aduonu de wɔn atuatua amantam a ɛwɔ ahemman no mu no ano.
౧రాజైన దర్యావేషు తన రాజ్య పరిపాలన వ్యవహారాలు నిర్వహించేందుకు 120 మంది అధికారులను నియమించాడు.
2 Ɔhene no sane yii Daniel ne afoforɔ baanu bi sɛ sohwɛfoɔ mpanimfoɔ a wɔhwɛ ahenemma no so, sɛdeɛ wɔbɛyɛ ahwɛyie, na ɔhene no ammɔ ka.
౨ఆ 120 మందిని పర్యవేక్షించడానికి ముగ్గురు ప్రధానమంత్రులను నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దేశానికి, రాజుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ అధికారులు ఈ ప్రధానమంత్రులకు ఎప్పటికప్పుడు లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ జారీ చేశాడు.
3 Na Daniel daa ne ho adi sɛ ɔnim de wɔ sohwɛfoɔ ne ahenemma no mu, ɛno enti, Ɔhene yɛɛ nhyehyɛeɛ sɛ, ɔde no bɛsi ɔman no nyinaa so panin.
౩దానియేలు శ్రేష్ఠమైన జ్ఞాన వివేకాలు కలిగి ఉండి అధికారుల్లో, ప్రధానమంత్రుల్లో ప్రఖ్యాతి పొందాడు, కనుక అతణ్ణి రాజ్యమంతటిలో ముఖ్యుడుగా నియమించాలని రాజు నిర్ణయించుకున్నాడు.
4 Ɛyɛɛ saa maa sohwɛfoɔ ne ahenemma no hwehwɛɛ sɛ wɔbɛnya Daniel ho asɛm wɔ nʼamammuo no fam, nanso wɔannya nʼadwumayɛ no ho mfomsoɔ biara, ɛfiri sɛ ɔyɛ nokwafoɔ.
౪అందువల్ల ప్రధానమంత్రులు, అధికారులు రాజ్య పరిపాలన వ్యవహారాల్లో దానియేలుపై ఏదైనా ఒక నేరం ఆరోపించడానికి ఏదైనా కారణం కోసం వెదుకుతూ ఉన్నారు. దానియేలు ఎలాంటి తప్పు, పొరపాటు చేయకుండా రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంవల్ల అతనిలో ఎలాంటి దోషం కనిపెట్టలేకపోయారు.
5 Ɛna mmarima no kaa sɛ, “Yɛrennya Daniel yi ho asɛmmɔne biara gye sɛ yɛhunu biribi a ɛfa ne nyamesom ho de asum no afidie.”
౫అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు.
6 Enti, sohwɛfoɔ no ne ahenemma no kɔɔ Ɔhene Dario no nkyɛn kɔka kyerɛɛ no sɛ, “Nana wo nkwa so!
౬అప్పుడు ఆ ప్రధానమంత్రులు, అధికారులు రాజు దగ్గరికి గుంపుగా వచ్చారు. వాళ్ళు రాజుతో ఇలా చెప్పారు. “రాజువైన దర్యావేషూ, నువ్వు చిరకాలం జీవిస్తావు గాక.
7 Yɛn sohwɛfoɔ, mpanimfoɔ, ahenemma, afotufoɔ ne mpanimfoɔ a aka no nyinaa apene so sɛ, ɛsɛ sɛ Nana hyɛ mmara sɛ, adaduasa a ɛdi animu yi, obiara nni ho ɛkwan sɛ ɔbɛbɔ mpaeɛ akyerɛ onyame bi anaa onipa bi a ɛnyɛ wo Nana no, wɔde no bɛto agyata amena mu.
౭ఈ దేశంలోని పాలకులు, ప్రముఖులు, అధికారులు, మంత్రులు, సంస్థానాల అధిపతులు అందరూ సమావేశమై రాజు కోసం ఒక కచ్చితమైన చట్టం సిద్ధం చేసి దాన్ని రాజు ఆజ్ఞగా చాటించాలని ఆలోచన చేశారు. అది ఏమిటంటే దేశంలోని ప్రజల్లో ఎవ్వరూ 30 రోజుల దాకా నీకు తప్ప మరి ఏ ఇతర దేవునికీ, ఏ ఇతర మనిషికీ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయాలి. అందువల్ల రాజా, ఈ ప్రకారంగా రాయించి రాజ శాసనం సిద్ధం చేయండి.
8 Ɛno enti, Nana, twerɛ na fa wo nsa hyɛ saa mmara yi ase, sɛdeɛ Mediafoɔ ne Persiafoɔ mmara a wɔntumi nsesa no no teɛ.”
౮మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనంగా ఉండేలా దాని మీద రాజముద్ర వేసి, సంతకం చేయండి” అని విన్నవించుకున్నారు.
9 Ɛno enti, ɔhene Dario twerɛɛ mmara no.
౯అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు.
10 Na Daniel tee sɛ wɔde nsa ahyɛ mmara no ase no, ɔkɔɔ fie kɔhyɛnee nʼaborɔsan dan a ne mpomma anim kyerɛ Yerusalem no. Ɛda biara ɔbuu nkotodwe bɔɔ mpaeɛ mprɛnsa daa ne Onyankopɔn ase sɛdeɛ ɔyɛ daa no.
౧౦ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.
11 Mpanimfoɔ no nyinaa bɔɔ mu kɔɔ Daniel fie kɔhunuu no sɛ ɔrebɔ mpaeɛ resrɛ Onyankopɔn mmoa.
౧౧ఆ వ్యక్తులు గుంపుగా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయనను వేడుకోవడం చూశారు.
12 Enti, wɔsane kɔɔ Ɔhene Dario no nkyɛn kɔkaee no ne mmara no sɛ, “Nana, woamfa wo nsa anhyɛ mmara a ɛka sɛ adaduasa a ɛdi animu yi, obiara a ɔbɛbɔ obi mpaeɛ, onyame anaa onipa na ɛnyɛ Nana no, wɔde no bɛto agyata amena mu no anaa?” Ɔhene no buaa sɛ, “Aane, saa mmara no wɔ hɔ; ɛyɛ Mediafoɔ ne Persiafoɔ mmara a wɔrentumi nsesa no.”
౧౨రాజు సన్నిధికి వచ్చి రాజు నియమించిన శాసనం విషయం ప్రస్తావించారు. “రాజా, 30 రోజుల వరకూ నీకు తప్ప మరి ఏ దేవునికైనా, మానవునికైనా ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసినట్టైతే వాడిని సింహాల గుహలో పడవేస్తామని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు గదా” అని అడిగారు. రాజు “మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనం. దాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు” అని చెప్పాడు.
13 Afei, wɔka kyerɛɛ ɔhene no sɛ, “Nana, Daniel no a ɔyɛ Yuda atukɔfoɔ no mu baako no mmu wo, na ɔnni wo mmara no nso so. Ɔda so bɔ ne Onyankopɔn mpaeɛ mprɛnsa da koro.”
౧౩అప్పుడు వాళ్ళు “బందీలుగా చెరపట్టిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నూ నువ్వు నియమించిన శాసనాన్నీ నిర్లక్ష్యం చేసి, ప్రతిరోజూ మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు.
14 Ɔhene no tee saa no, ɛhaa no yie, na ɔdwene ho ara kɔsii anwummerɛ pɛɛ ɛkwan bi a ɔbɛfa so agye Daniel nkwa.
౧౪ఈ మాట విన్న రాజు ఎంతో మధనపడ్డాడు. దానియేలును ఎలాగైనా రక్షించాలని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు. పొద్దుపోయే వరకూ అతణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేశాడు.
15 Mmarima yi bɔɔ mu kɔɔ ɔhene no anim kɔka kyerɛɛ no sɛ, “Nana, anidie mu, wonim sɛ, Mediafoɔ ne Persiafoɔ mmara mu no, wɔntumi nsesa mmara biara a ɔhene ahyɛ.”
౧౫ఇది గమనించిన ఆ వ్యక్తులు రాజ మందిరానికి గుంపుగా వచ్చి “రాజా, రాజు నియమించిన ఏ శాసనాన్ని గానీ, తీర్మానాన్ని గానీ ఎవ్వరూ రద్దు చేయకూడదు. ఇది మాదీయుల, పారసీకుల ప్రధాన విధి అని మీరు గ్రహించాలి” అని చెప్పారు.
16 Ɔhene Dario hyɛɛ sɛ, wɔnkɔfa Daniel, na wɔnto no ntwene agyata amena no mu. Ɔhene no ka kyerɛɛ no sɛ, “Daniel, wo Onyankopɔn a wosom no daa no, nnye wo.”
౧౬రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు.
17 Wɔde boɔ bɛhinii amena no ano. Na Ɔhene no de nʼankasa nsɔano ne atitire nsɔano sosɔɔ ɛboɔ no sɛdeɛ obiara rentumi nyɛ Daniel ho hwee.
౧౭ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు.
18 Afei, ɔhene no sane kɔɔ nʼahemfie a anadwo no nyinaa, wannidi. Ɔpoo anigyedeɛ biara, na wantumi anna anadwo mu no nyinaa.
౧౮తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.
19 Adeɛ kyee anɔpatutuutu no, ɔhene no yɛɛ ntɛm kɔɔ agyata amena no ano.
౧౯తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు.
20 Ɔduruu hɔ no, ɔde awerɛhoɔ frɛɛ sɛ, “Daniel, Onyankopɔn teasefoɔ ɔsomfoɔ. Wo Onyankopɔn a wosom no daa no tumi gyee wo firii agyata no mu?”
౨౦అతడు గుహ దగ్గరికి వచ్చి, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. “జీవం గల దేవుని సేవకుడివైన దానియేలూ, నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?” అని అతణ్ణి అడిగాడు.
21 Daniel teaam sɛ, “Nana wo nkwa so!
౨౧అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక.
22 Me Onyankopɔn somaa ne ɔbɔfoɔ bɛkataa agyata no ano, sɛdeɛ wɔrentumi nyɛ me bɔne, ɛfiri sɛ, wahunu sɛ, medi bem wɔ nʼanim. Na wo, Nana nso, menyɛɛ wo bɔne biara.”
౨౨నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు.
23 Ɔhene no ani gyee mmorosoɔ, na ɔhyɛɛ sɛ wɔnyi Daniel mfiri amena no mu, enti woyii no. Wɔanhunu etwã biara wɔ ne ho, ɛfiri sɛ, ɔde ne ho too ne Onyankopɔn so.
౨౩రాజు చాలా సంతోషించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు దానియేలును బయటికి తీశారు. అతడు దేవునిపట్ల భయభక్తులు గలవాడు కావడం వల్ల అతనికి ఎలాంటి ఏ హానీ జరగలేదు.
24 Afei, ɔhene no hyɛɛ sɛ, wɔnkɔkyere mmarima a wɔnam ntwatosoɔ so ma wɔde Daniel kɔtoo agyata amena mu no. Ɔmaa wɔtoo wɔn ne wɔn yerenom ne wɔn mma guu agyata amena no mu. Agyata no hurihuri sisii wɔn so, tetee wɔn, bobɔɔ wɔn nnompe mu ansa koraa na wɔreduru amena no ase.
౨౪దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి.
25 Afei, Ɔhene Dario too nkra yi kɔmaa nnipa ahodoɔ nyinaa, aman nyinaa ne kasa biara wɔ ewiase afanan nyinaa sɛ: “Ɛnsi mo yie mmoroso!
౨౫అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించే ప్రజలకూ జాతులకూ వివిధ భాషలు మాట్లాడే వాళ్ళకూ ఈ విధంగా ప్రకటన రాయించాడు. “మీకందరికీ క్షేమం కలుగు గాక.
26 “Mehyɛ mmara sɛ, ɛsɛ sɛ obiara a ɔwɔ mʼahemman mu suro, fɛre na ɔde anidie ma Daniel Onyankopɔn.
౨౬నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు.
27 “Ɔyɛ amanehunu mu gyefoɔ na ɔgye nkwa nso;
౨౭ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశంలో, భూమి మీదా ఆయన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయనే సింహాల బారి నుండి ఈ దానియేలును రక్షించాడు” అని రాయించాడు.
28 Enti, Daniel kɔɔ so dii yie wɔ Ɔhene Dario ne Persiahene Kores mmerɛ so.
౨౮ఈ దానియేలు దర్యావేషు పరిపాలన కాలంలో, పారసీకుడైన కోరెషు పరిపాలనలో వృద్ది చెందుతూ వచ్చాడు.