< 2 Samuel 7 >
1 Ɛberɛ a wɔbɔɔ ɔhene no atenaseɛ wɔ nʼahemfie na Awurade ama asomdwoeɛ aba asase no so no,
౧యెహోవా దావీదుకు నాలుగు దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి, నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి,
2 Dawid frɛɛ nkɔmhyɛni Natan sɛ, “Hwɛ, mete ahemfie a wɔde ntweneduro asi mu, na Onyankopɔn Adaka no nso si ntomadan mu.”
౨“నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు.
3 Na Natan buaa ɔhene no sɛ, “Biribiara a woadwene ho sɛ wobɛyɛ no, kɔ so na yɛ, na Awurade ka wo ho.”
౩అప్పుడు నాతాను “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి” అన్నాడు.
4 Na anadwo no, Awurade asɛm baa Natan so sɛ,
౪అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది,
5 “Kɔka kyerɛ me ɔsomfoɔ Dawid sɛ, ‘Sɛdeɛ Awurade seɛ nie: Wone obi a ɛsɛ sɛ wosi ɛdan ma me na metena mu anaa?
౫“నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా?
6 Ɛfiri ɛberɛ a mede Israelfoɔ firi Misraim baeɛ de bɛsi ɛnnɛ no, mentenaa ɛdan mu da. Daa wɔtu mʼase firi beaeɛ kɔ beaeɛ.
౬ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను బయటకు రప్పించినప్పటి నుండి నేటి వరకూ మందిరంలో నివసించకుండా డేరాలో, గుడారంలో నివసిస్తూ సంచరించాను.
7 Ɛberɛ biara a wɔtu mʼase a Israelman nyinaa ka me ho no, motee sɛ mebisaa wɔn sodifoɔ, wɔn a mehyɛ wɔn sɛ wɔnhwɛ me nkurɔfoɔ Israelfoɔ no sɛ, “Adɛn enti na momfaa ntweneduro nsii fie mmaa me da?”’
౭ఇశ్రాయేలీయులతో కలసి నేను సంచరించిన కాలమంతా నా ప్రజలను సంరక్షించమని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రా నాయకుల్లో ఎవ్వరితోనైనా దేవదారు కలపతో నాకొక మందిరం కట్టించలేకపోయారే అని ఎవ్వరితోనైనా అన్నానా?
8 “Afei, kɔka kyerɛ me ɔsomfoɔ Dawid sɛ, ‘Sɛdeɛ Awurade Otumfoɔ seɛ nie: Meyii wo firii mmoa adidibea ne nnwan akyidie mu, de wo bɛsii me nkurɔfoɔ Israel so ɔhene.
౮కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.
9 Na baabiara a wokɔ no, meka wo ho, na matwa wʼatamfoɔ nyinaa afiri wʼanim. Na mɛma wɔagye din wɔ asase yi nyinaa so.
౯నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను.
10 Na mapɛ tenaberɛ ama me nkurɔfoɔ Israel; beaeɛ bi a ɛwɔ banbɔ a obiara renha wɔn. Ɛhɔ bɛyɛ wɔn ankasa asase a aman amumuyɛfoɔ renhyɛ wɔn so, sɛdeɛ wɔyɛɛ wɔ ɛberɛ bi a atwam no,
౧౦నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండ తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి,
11 ɛfiri ɛberɛ a mepaa atemmufoɔ sɛ wɔnni me nkurɔfoɔ so no. Mɛsane ama mo banbɔ afiri mo atamfoɔ nyinaa nsam. “‘Na Awurade aka akyerɛ wo sɛ, ɔno Awurade na ɔbɛkyekyere efie ama wo; ahemfo ntoatoasoɔ efie.
౧౧నీ శత్రువులపై నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలిగేలా చేశాను. యెహోవానైన నేను నీకు చెబుతున్నదేమిటంటే, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను వారు శాశ్వతంగా పాలన చేస్తారు.
12 Na sɛ wo nna to twa a, mɛma wʼaseni a ɔfiri wʼasenem adi wʼadeɛ, na matim nʼahemman ase.
౧౨నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను.
13 Ɔno ne obi a ɔbɛsi dan de me din ato so. Na matim nʼahemman mu ahennwa ase afebɔɔ.
౧౩అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను.
14 Mɛyɛ nʼagya, na wayɛ me ba. Sɛ ɔyɛ bɔne a, mɛma aman bi atwe nʼaso.
౧౪అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.
15 Nanso, merenyi me dɔ mfiri ne so da, sɛdeɛ meyi mefirii Saulo a meyii no firii wʼanim no so ansa na wobɛdii nʼadeɛ no.
౧౫అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను.
16 Wo fie ne wʼahemman bɛtim wɔ mʼanim afebɔɔ; na wʼahennwa bɛtena hɔ daa.’”
౧౬నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”
17 Natan kaa saa adiyisɛm yi nyinaa kyerɛɛ Dawid.
౧౭తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు.
18 Na ɔhene Dawid kɔtenaa Awurade anim bɔɔ mpaeɛ sɛ, “Ao, Awurade Otumfoɔ, mene hwan, na me fiefoɔ yɛ ɛdeɛn a wode me abɛduru ɛnnɛ?
౧౮అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. “నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది?
19 Na afei Otumfoɔ Awurade, yeinom nyinaa akyi no, woka sɛ wobɛma me ahennie a ɛte hɔ daa. Woyɛ nnipa nyinaa sei anaa, Ao Awurade Otumfoɔ?
౧౯నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిషత్తులో కలగబోయే ఉన్నతిని గూర్చి నాకు వెల్లడించావు. యెహోవా, నా ప్రభూ, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకొంటాను?
20 “Ɛdeɛbɛn bio na mɛtumi aka? Ɛfiri sɛ, wonim sɛdeɛ wʼakoa teɛ, Ao Awurade Otumfoɔ.
౨౦యెహోవా నా ప్రభూ, నీ దాసుడనైన నా గురించి నీకు తెలుసు.
21 Wʼasɛm ne wo pɛ mu enti, woayɛ nneɛma kɛseɛ yi nyinaa akyerɛ wo ɔsomfoɔ.
౨౧నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున ఈ గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు.
22 “Wo kɛseyɛ yɛ kokuroo, Ao Awurade Otumfoɔ! Obi biara nte sɛ wo, Onyankopɔn bi nni hɔ sɛ wo, na yɛntee onyame foforɔ bi mpo ho asɛm!
౨౨దేవా, యెహోవా, నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడెవరూ లేడు.
23 Ɔman bɛn na ɛwɔ asase yi so a ɛte sɛ Israel? Ɔman foforɔ bɛn na woayi no afiri nkoasom mu de wɔn ayɛ wo ɔman? Ɛberɛ a woyii wo nkurɔfoɔ firii Misraim no, wogyee edin. Woyɛɛ anwanwadeɛ akɛseɛ de pamoo aman ne ahoni ahodoɔ a na wɔyɛ akwansideɛ ma wo nkurɔfoɔ.
౨౩నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు.
24 Woatim wo nkurɔfoɔ Israel sɛ wʼankasa wʼadeɛ afebɔɔ, na wo Ao Awurade, woabɛyɛ wɔn Onyankopɔn.
౨౪యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు.
25 “Na afei, Awurade Onyankopɔn, di ɛbɔ a wohyɛ faa wʼakoa ne ne mʼabusuafoɔ ho no so. Ma ɛnyɛ bɔhyɛ a ɛbɛtena hɔ daa.
౨౫దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను గూర్చీ, నా వంశం గూర్చీ నీవు సెలవిచ్చిన మాట ఎప్పటికీ నిలిచిపోయేలా దృఢపరచు.
26 Na ma wo din nkron afebɔɔ na ewiase nyinaa nka sɛ, ‘Awurade Otumfoɔ yɛ Israel so Onyankopɔn.’ Na ma wo ɔsomfoɔ Dawid ahennie ase ntim wɔ wʼanim.
౨౬‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలనే మాటచేత నీకు శాశ్వత మహిమ కలిగేలా నీ దాసుడనైన నా వంశం నీ సన్నిధిలో స్థిరపరచబడేలా నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చు.
27 “Ao, Awurade Otumfoɔ, Israel Onyankopɔn, masi me bo abɔ saa mpaeɛ yi ɛfiri sɛ woakyerɛ sɛ wobɛkyekyere fie a ɛyɛ daa ahennie ama me.
౨౭ఇశ్రాయేలీయుల దేవా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నాకు సంతానం కలిగిస్తానని నీ దాసునికి తెలియపరచావు. కాబట్టి ఈ విధంగా నీతో విన్నపం చేయడానికి నీ దాసుడనైన నాకు ధైర్యం వచ్చింది.
28 Ao, Awurade Otumfoɔ, woyɛ Onyankopɔn! Wo nsɛm mu wɔ ahotosoɔ, na woahyɛ wo ɔsomfoɔ nnepa ho bɔ.
౨౮యెహోవా, నా ప్రభూ, నీ దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్తున్నావు కదా. నువ్వు దేవుడివి కాబట్టి నీ మాటలన్నీ నిజమైనవి.
29 Afei, ma ɛnyɛ wo pɛ sɛ wobɛhyira wʼakoa fie so, na atoa so afebɔɔ wɔ wʼanim, na wo, Ao Awurade Otumfoɔ, woakasa, na wo nhyira a wode bɛhyira wo ɔsomfoɔ fie no bɛyɛ daapem nhyira.”
౨౯నీ దాసుడనైన నా వంశం అంతా నిత్యమూ నీ సన్నిధిలో ఉండేలా దయచేసి దీవించు. యెహోవా నా ప్రభూ, నువ్వు సెలవిచ్చినట్టు నీ దీవెనలు పొంది నా వంశం అన్నివేళలా దీవెన పొందుతుంది గాక.”