< 2 Samuel 21 >

1 Dawid ahennie so no, ɛkɔm baa asase no so mfeɛ mmiɛnsa, enti Dawid bisaa Awurade ɛkɔm no ho asɛm. Na Awurade kaa sɛ, “Esiane ɛfɔ a Saulo ne ne fiefoɔ di wɔ kunkum a wɔkunkumm Gibeonfoɔ no ho enti na ɛkɔm saa aba no.”
దావీదు పరిపాలిస్తున్న కాలంలో మూడేళ్ళపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “సౌలు గిబియోనీయులను హతమార్చాడు. అతణ్ణి బట్టి, నరహంతకులైన అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది.”
2 Enti, ɔhene Dawid frɛɛ Gibeonfoɔ no nyinaa. Na wɔnka Israelfoɔ no ho, na mmom, wɔyɛ Amorifoɔ nkaeɛfoɔ bi. Israel kaa ntam sɛ, wɔrenkum wɔn, nanso ɛsiane Saulo ahopereɛ enti, ɔpɛɛ sɛ ɔtɔre wɔn ase.
గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు. వారు అమోరీయుల్లో మిగిలిపోయిన వారు. సౌలు రాజు కాక ముందు ఇశ్రాయేలీయులు “మిమ్మల్ని చంపం” అని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలు, యూదా వారిపట్ల అమితమైన ఆసక్తి కనపరచి గిబియోనీయులను హతం చేస్తూ వచ్చాడు.
3 Dawid bisaa Gibeonfoɔ no sɛ, “Ɛdeɛn na mɛtumi ayɛ de apata mo? Monka, sɛdeɛ ɛbɛyɛ a Awurade bɛhyira ne nkurɔfoɔ bio.”
దావీదు గిబియోనీయులను పిలిపించి “మీరు యెహోవా సొత్తును దీవించడానికి మా దోషం తొలగిపోయేందుకు పరిహారంగా నేను మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు?” అని అడిగాడు.
4 Gibeonfoɔ no buaa sɛ, “Anokwa, sika rentumi, na yɛmpɛ nso sɛ wɔbɛkunkum Israelfoɔ aweretɔ so.” Enti, Dawid kɔɔ so bisaa wɔn sɛ, “Enti, ɛdeɛn na menyɛ? Monka nkyerɛ me, na mɛyɛ ama mo.”
గిబియోనీయులు “సౌలు అతని ఇంటి వారు చేసినదాన్ని బట్టి పరిహారం చేయడానికి వెండి, బంగారాలు గానీ, ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపాలని గానీ మేము కోరుకోవడం లేదు” అన్నారు. అప్పుడు దావీదు “మీరేమి కోరుకున్నా అది మీకు చేస్తాను” అన్నాడు.
5 Na wɔbuaa sɛ, “Ɛyɛ Saulo na ɔdwenee ho sɛ ɔbɛsɛe yɛn, sɛdeɛ yɛrennya afa biara wɔ Israel.
వారు “ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేస్తూ మేము నిర్మూలం అయ్యేలా కీడు కలిగించినవాడి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించు.
6 Enti, wɔnyi Saulo mmammarima anaa ne nananom mmarima baason mma yɛn, na yɛbɛkum wɔn wɔ Awurade anim wɔ Gibea bepɔ no so.” Ɔhene no kaa sɛ, “Ɛyɛ. Mɛyɛ.”
యెహోవా నియమించిన సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సన్నిధానంలో మేము వారిని ఉరితీస్తాం” అని రాజును కోరారు. అప్పుడు రాజు “నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు.
7 Dawid gyaee Yonatan babarima Mefiboset a na ɔyɛ Saulo nana no, ɛsiane ntam a na Dawid ne Yonatan aka wɔ Awurade anim no enti.
అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరిట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక,
8 Nanso, ɔde Saulo mmammarima baanu a na wɔn edin de Armoni ne Mefiboset a na wɔn maame Rispa no yɛ Aia babaa maa wɔn. Ɔsane de Saulo babaa Mikal a na ɔyɛ Adriel a na ɔyɛ Barsilai a ɔfiri Mehola no yere mmammarima baanum no maeɛ.
అయ్యా కుమార్తె రిస్పా ద్వారా సౌలుకు పుట్టిన యిద్దరు కొడుకులు అర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మెరాబుకు మెహూలతీయుడైన బర్జిల్లయి కొడుకు అద్రీయేలు ద్వారా పుట్టిన ఐదుగురు కొడుకులను తీసుకువచ్చి గిబియోనీయులకు అప్పగించాడు.
9 Na Gibeon mmarima no kunkumm wɔn wɔ bepɔ no so wɔ Awurade anim. Enti, nnipa baason no nyinaa, wɔkunkumm wɔn wɔ ɛberɛ a wɔrefiri atokotwa afahyɛ no ase no.
వారు ఈ ఏడుగురిని తీసుకువెళ్ళి యెహోవా సన్నిధానంలో కొండ మీద ఏడుగురినీ ఒకే విధంగా ఉరితీశారు. యవల పంట కోతకాలం ఆరంభంలో వారు చనిపోయారు.
10 Rispa a ɔyɛ mmarima no mu baanu maame no de ayitoma sɛɛ ɔbotan bi so, tenaa hɔ otwaberɛ no nyinaa mu. Wamma apete ammɛtete wɔn amu no awiaberɛ mu, na anadwo nso, ɔsii nkekaboa ho kwan.
౧౦అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.
11 Ɛberɛ a Dawid tee deɛ Rispa a na ɔyɛ Saulo mpena no ayɛ no,
౧౧సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది.
12 ɔkɔɔ nkurɔfoɔ a wɔfiri Yabes Gilead nkyɛn, kɔbisaa wɔn Saulo ne ne babarima Yonatan nnompe ase. (Ɛberɛ a Saulo ne Yonatan totɔɔ ɔko a wɔne Filistifoɔ koeɛ no ano no, Yabes Gileadfoɔ na wɔkɔtasee wɔn amu Filistifoɔ kuro Bet-San abɔntene so.)
౧౨కాబట్టి దావీదు వెళ్లి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానులను హతం చేసి బేత్షాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడినుంచి దొంగిలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు.
13 Enti, Dawid de Saulo ne Yonatan nnompe baeɛ. Saa ara na ɔde mmarima a Gibeonfoɔ kunkumm wɔn no nnompe baeɛ.
౧౩కనుక దావీదు వారి దగ్గర నుండి సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురి ఎముకలను సమకూర్చారు.
14 Ɔsiee wɔn nyinaa wɔ Saulo agya Kis ɔboda a ɛwɔ kuro Sela a ɛwɔ Benyamin asase so no mu. Ɛno akyi, Onyankopɔn twaa ɛkɔm no so wɔ Israel asase so.
౧౪సౌలు, అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు.
15 Bio, Filistifoɔ ne Israel koeɛ. Na ɛberɛ a ɔko no duruu ne mpɔmpɔnsoɔ no, Dawid tɔɔ baha.
౧౫ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కలసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దావీదు నీరసించి సొమ్మసిల్లిపోయాడు.
16 Na Yisbi-Benob yɛ abrane no asefoɔ mu baako. Na ne pea mu duru kari boro kilogram mmiɛnsa ne fa, a wɔde akofena foforɔ ahyehyɛ ne ho. Na waka Dawid ahyɛ a anka ɔrebɛkum no.
౧౬అక్కడ రెఫాయీయుల సంతానం వాడైన ఇష్బిబేనోబ అనేవాడు కొత్తగా చేసిన కత్తి, మూడున్నర కిలోల బరువున్న ఇత్తడి ఈటె పట్టుకుని “నేను దావీదును చంపుతాను” అని చెబుతూ వచ్చాడు.
17 Nanso, Seruia babarima Abisai bɛgyee Dawid, na ɔkumm Filistini no. Ɛno akyi, Dawid mmarima no kaa ntam sɛ, “Wo ne yɛn renkɔ ɔko bio. Anyɛ saa a, Israel kanea bɛdum.”
౧౭సెరూయా కొడుకు అబీషై రాజును కాపాడి ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. ఇది చూసిన దావీదు మనుషులు “ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా ఉండేలా ఇకపై మాతో కలసి యుద్ధాలకు రావద్దు” అని చెప్పి, అతని చేత ఒట్టు పెట్టించారు.
18 Yei akyi, ɔko foforɔ ba de tiaa Filistifoɔ no wɔ Gob. Wɔgu so reko no, Sibekai a ɔfiri Husan, kumm Saf a na ɔno nso yɛ abrane no asefoɔ no bi.
౧౮ఆ తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మళ్ళీ యుద్ధం జరిగింది. యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతానం వాడైన సఫును చంపాడు.
19 Ɔko foforɔ bi a wɔkoo wɔ Gob no nso, Yair babarima Elhanan a ɔfiri Betlehem kumm Gatni Goliat nuabarima bi. Na ne pea nsa mu duru bɛyɛ sɛ ntomanwomfoɔ nsadua.
౧౯గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగినప్పుడు అక్కడ బేత్లెహేము నివాసి యహరేయోరెగీము కొడుకు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుణ్ణి చంపాడు. వాడి చేతిలో ఉన్న ఈటె నేతగాని అడ్డకర్ర అంత పెద్దది.
20 Ɔko bi a ɛsii bio wɔ Gat nso, ɔbarima tetetuo bi a na ɔyɛ nsansia ne nansia a ɔyɛ abrane no aseni no
౨౦మరొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ బాగా పొడవైనవాడు ఒకడు ఉన్నాడు. వాడి చేతులకు, కాళ్ళకు ఆరు వేళ్ళు చొప్పున మొత్తం ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతానం వాడు.
21 pɛɛ sɛ ɔbu fa Israel so, gu nʼanim ase. Ɔno nso, Dawid nua Simea babarima Yonatan na ɔkumm no.
౨౧వాడు ఇశ్రాయేలీయులను దూషిస్తున్నప్పుడు దావీదు సోదరుడు షిమ్యా కొడుకు యోనాతాను వాణ్ణి చంపివేశాడు.
22 Saa Filistifoɔ abrane baanan yi yɛ Gat abrane no asefoɔ. Na Dawid ne nʼakofoɔ na wɔkunkumm wɔn nyinaa.
౨౨గాతులో ఉన్న రెఫాయీయుల సంతతివారైన ఈ నలుగురినీ దావీదు, అతని సేవకులు హతం చేశారు.

< 2 Samuel 21 >