< 2 Petro 3 >
1 Adɔfonom, yei ne krataa a ɛtɔ so mmienu a matwerɛ abrɛ mo. Metwerɛɛ sɛ mede rebɛkae mo, de akanyane mo adwene.
౧ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను.
2 Mepɛ sɛ mokae nsɛm a adiyifoɔ kronkron no kaa mmerɛ bi a atwam no ne mmara a ɛfiri Awurade ne Agyenkwa a wɔde faa mo asomafoɔ so maa mo no.
౨పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
3 Deɛ ɛdi ɛkan no, ɛsɛ sɛ mote aseɛ sɛ nna a ɛdi akyire no mu no, nnipa bi bɛba a wɔn ara wɔn honam akɔnnɔ na ɛbɛdi wɔn so. Wɔbɛdi mo ho fɛ
౩ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
4 aka sɛ, “Ɔhyɛɛ mo bɔ sɛ ɔbɛba. Wanka? Na ɔwɔ he? Yɛn agyanom awuwu dada, nanso biribiara te sɛ deɛ ɛte firi adebɔ mfitiaseɛ!”
౪“ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
5 Wɔhyɛ da ma wɔn werɛ firi nokorɛ no sɛ, ɛfiri tete no, Onyankopɔn kasaeɛ na wɔbɔɔ ɔsoro ne asase. Wɔbɔɔ asase firi nsuo mu na wɔde nsuo na ɛyɛeɛ.
౫చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,
6 Akyire no wɔde nsuyire bɛsɛee no.
౬ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
7 Nanso, Onyankopɔn ahyɛ sɛ ɔsoro ne asase ntena hɔ nkɔsi Atemmuo da. Afei wɔbɛsɔ emu ogya na wɔbɛsɛe nnebɔneyɛfoɔ.
౭అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.
8 Nanso, anuanom, mommma mo werɛ mfiri adeɛ baako sɛ Awurade ani so deɛ, nsonsonoeɛ nni da koro ne mfeɛ apem ntam. Ne fam deɛ, ne mmienu nyinaa yɛ pɛ.
౮కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
9 Awurade ntwentwɛn ne nan ase wɔ ne bɔ a wahyɛ ho sɛdeɛ ebinom dwene no. Mmom, ɔwɔ mo ho boasetɔ ɛfiri sɛ, ɔmpɛ sɛ wɔbɛsɛe obiara, na mmom, ɔpɛ sɛ obiara sakra firi ne bɔne ho.
౯కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
10 Na Awurade da no bɛba sɛ owifoɔ. Ɛda no, ɔsoro bɛbobom na ayera na ewiem nneɛma bɛhye na asɛe na asase ne so nneɛma nyinaa nso bɛda adi.
౧౦అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి.
11 Sɛ saa ɛkwan yi so na wɔbɛfa asɛe adeɛ nyinaa a, na ɛdeɛn bra na ɛsɛ sɛ wobɔ? Ɛsɛ sɛ mo bra yɛ kronkron na mode mo ho ma Onyankopɔn.
౧౧ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
12 Monhwɛ saa da no kwan na monyɛ mo nneɛma pɛpɛɛpɛ; saa da a Onyankopɔn bɛto ɔsoro mu ogya na ewiem nneɛma anane na ayera wɔ ogyaframa mu no.
౧౨దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి
13 Nanso, yɛtwɛn deɛ Onyankopɔn ahyɛ yɛn ho bɔ no, ɔsoro foforɔ ne asase foforɔ a ɛhɔ na tenenee bɛtena.
౧౩అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
14 Enti, anuanom, mogu so retwɛn da no yi, mommɔ mmɔden sɛ mobɛyɛ kronn a mfomsoɔ biara nni mo ho wɔ Onyankopɔn anim na mo ne no atena wɔ asomdwoeɛ mu.
౧౪కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
15 Monkae nhunu sɛ Awurade wɔ boasetɔ ɛfiri sɛ ɔpɛ sɛ obiara nya nkwagyeɛ. Ɛno na yɛn nua Paulo nam nyansa a Onyankopɔn de maa no no so twerɛɛ mo no.
౧౫మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు.
16 Saa ɛkwan korɔ no ara so na ɔfa twerɛɛ ne nkrataa no na saa nsɛm yi ara so nso na ɔgyina twerɛeɛ. Nsɛm bi a ɛyɛ den wɔ ne nkrataa no mu no, wɔn a wɔnnim na wɔnnyɛ den no ntumi nkyerɛ aseɛ yie. Saa ara na wɔyɛ Atwerɛsɛm a aka no de ɔsɛeɛ ba wɔn so.
౧౬అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
17 Nanso anuanom, mo deɛ monim yei dada. Monwɛn na wɔn a wɔnni mmara so annaadaa mo amfiri beaeɛ pa.
౧౭కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
18 Monyini wɔ yɛn Awurade ne Agyenkwa Yesu Kristo adom ne nimdeɛ mu. Ɔno na animuonyam nka no seesei ne daa. Amen. (aiōn )
౧౮మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్. (aiōn )