< 2 Berɛsosɛm 20 >
1 Yei akyi no, Moabfoɔ, Amonfoɔ ne Maonfoɔ asraafoɔ bi tuu Yehosafat so sa.
౧ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు.
2 Abɔfoɔ bɛka kyerɛɛ Yehosafat sɛ, “Akodɔm bebree firi Nkyene Po no akyi wɔ Edom rebɛko atia wo. Wɔaduru Hasason-Tamar” (En-Gedi din baako ne no).
౨అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.
3 Yehosafat tee saa asɛm yi, ne ho yeraa no enti, ɔbisaa Awurade akwankyerɛ. Ɔhyɛɛ sɛ obiara a ɔwɔ Yuda no nni abuada.
౩అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు.
4 Na nnipa a wɔwɔ Yuda nkuro nyinaa so baa Yerusalem, bɛhwehwɛɛ Awurade.
౪యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.
5 Na Yehosafat sɔre gyinaa Yudafoɔ ne Yerusalemfoɔ anim wɔ Awurade Asɔredan no adihɔ foforɔ hɔ.
౫యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి,
6 Ɔbɔɔ mpaeɛ sɛ, “Ao Awurade, yɛn agyanom Onyankopɔn, wo nko ne Onyankopɔn a wote soro. Wo na wodi ahennie a ɛwɔ asase nyinaa so. Woyɛ otumfoɔ ne ɔkɛseɛ a obiara ntumi ne wo nni asie.
౬“మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు.
7 Ao yɛn Onyankopɔn, ɛberɛ a wo nkurɔfoɔ bɛduruiɛ no, woampam wɔn a na wɔte asase yi so no anaa? Na woamfa saa asase yi amma wʼadamfo Abraham asefoɔ afebɔɔ anaa?
౭నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.”
8 Wo nkurɔfoɔ tenaa ha sii saa Asɔredan yi maa wo.
౮“వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే
9 Wɔkaa sɛ, ‘Sɛ ɔhaw bi te sɛ ɔko, yadeɛ anaa ɛkɔm bi to yɛn a, yɛbɛtumi aba wʼanim wɔ saa Asɔredan yi mu, baabi a wɔahyɛ wo din animuonyam no. Yɛbɛtumi asu afrɛ wo sɛ, gye yɛn nkwa, na wobɛtie yɛn, agye yɛn.’
౯నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా.
10 “Na afei, hwɛ deɛ Amonfoɔ, Moabfoɔ ne Seir akodɔm reyɛ. Woamma yɛn agyanom anni saa aman no so nkonim wɔ ɛberɛ a Israel firii Misraim no, na mmom, wɔfaa wɔn ho a wɔansɛe wɔn.
౧౦ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు.
11 Afei, hwɛ sɛdeɛ wɔretua yɛn so ka. Wɔaba sɛ, wɔrebɛtu yɛn afiri wʼasase a wode maa yɛn sɛ agyapadeɛ no so.
౧౧మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి.
12 Ao yɛn Onyankopɔn, worensi wɔn ano? Yɛnni ahoɔden sɛ akodɔm kɛseɛ yi a wɔpɛ sɛ wɔbɛto hyɛ yɛn so yi. Yɛnhunu deɛ yɛnyɛ, na yɛhwɛ ɛkwan sɛ wobɛboa yɛn.”
౧౨మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు.
13 Ɛberɛ a Yuda mmarima nyinaa ne wɔn nkɔkoaa, wɔn yerenom ne wɔn mma gyina Awurade anim no,
౧౩యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.
14 Awurade Honhom baa mmarima a wɔgyinagyina hɔ no mu baako so. Na ne din de Yahasiel a ɔyɛ Sakaria babarima a ɔno nso yɛ Benaia babarima, na ɔno nso yɛ Yeiel babarima, na ɔno nso yɛ Lewini Matania, a ɔyɛ Asaf aseni no babarima.
౧౪అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు,
15 Ɔkaa sɛ, “Ɔhene Yehosafat, tie! Mo Yudafoɔ ne Yerusalemfoɔ nyinaa, montie! Sɛdeɛ Awurade seɛ nie: Monnsuro. Mommma akodɔm kɛseɛ nntu mo akoma, ɛfiri sɛ, ɔko no nnyɛ mo dea, na ɛyɛ Onyankopɔn dea.
౧౫“యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.
16 Ɔkyena, montu ntene nkɔ wɔn so. Mobɛhunu sɛ wɔfiri Sis aforoeɛ a ɛwɔ bɔnhwa no fa a ɛpue Yeruel ɛserɛ no so hɔ reba.
౧౬రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు.
17 Na ɛho nhia mpo sɛ mobɛko. Monnyinagyina mo afa, monyɛ dinn na monhwɛ Awurade nkonimdie. Ɔka mo ho, Yuda ne Yerusalem manfoɔ. Monnsuro, na mommma mo akoma nntu. Ɔkyena, monkɔ hɔ, na Awurade ka mo ho.”
౧౭ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”
18 Na ɔhene Yehosafat sii ne tiri ase, na Yuda ne Yerusalem manfoɔ no nyinaa nso yɛɛ saa, de somm Awurade.
౧౮అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు.
19 Na Lewifoɔ a wɔfiri Kohat ne Kora mmusua mu sɔre gyinaeɛ teaam denden sɔree Awurade, Israel Onyankopɔn.
౧౯కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.
20 Adeɛ kyee nʼanɔpahema no, Yuda akodɔm no kɔɔ Tekoa ɛserɛ so. Ɛberɛ a wɔrekɔ no, Yehosafat gyina kaa sɛ, “Montie me, mo Yudafoɔ ne Yerusalemfoɔ nyinaa. Monnye Awurade, mo Onyankopɔn, nni na mobɛtumi agyina pintinn. Monnye nʼadiyifoɔ no nni, na mobɛdi nkonim.”
౨౦వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు.
21 Ɔhene no ne nnipa no ntuanofoɔ dii nkutaho wieeɛ no, ɔyii nnwomtofoɔ bi sɛ wɔnni akodɔm no anim, nto dwom mma Awurade, nkamfo no wɔ nʼanimuonyam kronkron no enti. Ɛdwom no mu nsɛm nie: “Monna Awurade ase na nʼadɔeɛ wɔ hɔ daa!”
౨౧అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.
22 Ɛberɛ a wɔpagyaa ayɛyi dwom no, Awurade maa Amon, Moab ne bepɔ Seir asraafoɔ no twaa wɔn ho koeɛ.
౨౨వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు.
23 Moab ne Amon asraafoɔ no danee wɔn ani kyerɛɛ wɔn adɔmfoɔ a wɔfiri bepɔ Seir so no, kunkumm wɔn nyinaa. Wɔwiee Seir asraafoɔ no, wɔtwaa wɔn ho koeɛ.
౨౩అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
24 Na Yuda akodɔm no duruu baabi a wɔgyina a wɔhunu ɛserɛ no so no, wɔhunuu sɛ afunu gugu fam kɔ akyiri. Atamfoɔ no mu baako mpo antumi annwane.
౨౪యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు.
25 Ɔhene Yehosafat ne nʼakodɔm kɔtasee asadeɛ. Wɔnyaa adwumayɛ nneɛma, ntadeɛ ne nneɛma a ɛsom bo a wɔntumi nsoa. Na asadeɛ no dɔɔso enti wɔde nnansa na ɛtasee ne nyinaa.
౨౫యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది.
26 Nnanan so no, wɔboaa wɔn ho ano wɔ Nhyira Bɔnhwa mu. Wɔtoo bɔnhwa no din saa da no, ɛfiri sɛ, ɛhɔ na nnipa no kamfoo Awurade, daa no ase. Wɔda so frɛ no Nhyira Bɔnhwa ɛnnɛ yi.
౨౬నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.
27 Afei, Yehosafat dii wɔn anim ne wɔn sane kɔɔ Yerusalem anigyeɛ so sɛ, Awurade ama wɔadi wɔn atamfoɔ so nkonim.
౨౭ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు.
28 Wɔbɔɔ mmɛnta, asankuten ne ntotorobɛnto tuu nten kɔhyɛnee Yerusalem na wɔkɔɔ Awurade Asɔredan no mu.
౨౮వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.
29 Ɛberɛ a ahennie a atwa hɔ ahyia no tee sɛ Awurade no ankasa ako atia Israel atamfoɔ no, Awurade ho suro baa wɔn so.
౨౯ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు.
30 Na ɛmaa asomdwoeɛ baa Yehosafat ahennie mu, ɛfiri sɛ, ne Onyankopɔn maa no ahomegyeɛ wɔ afanan nyinaa.
౩౦ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
31 Na Yehosafat dii ɔhene wɔ Yuda asase so. Ɛberɛ a ɔdii ɔhene no, na wadi mfeɛ aduasa enum. Ɔtenaa Yerusalem dii ɔhene mfeɛ aduonu enum. Na ne maame din de Asuba a ɔyɛ Silhi babaa.
౩౧యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.
32 Na Yehosafat yɛ ɔhene a ɔyɛ. Ɔyɛɛ deɛ nʼagya Asa yɛeɛ. Ɔyɛɛ deɛ ɛsɔ Awurade ani.
౩౨అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.
33 Nanso, nʼahennie mu no, wammubu abosonsomfoɔ asɔreeɛ no, na ɔmanfoɔ no nso amfa wɔn akoma nyinaa amma wɔn agyanom Onyankopɔn no.
౩౩అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు.
34 Yehosafat ahennie ho nsɛm nkaeɛ, firi ahyɛaseɛ kɔsi awieeɛ no, wɔatwerɛ agu Hanani babarima Yehu nwoma a wɔde aka Israel Ahemfo nwoma no ho.
౩౪యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.
35 Nanso, ɛrekɔ nʼasetena awieeɛ no, ɔhene Yehosafat ne Israelhene Ahasia a ne tirim yɛ den no kaa wɔn ho bɔɔ mu.
౩౫ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు.
36 Wɔyɛɛ ɛpo so adwadie ahyɛn bebree wɔ Esion-Geber hyɛngyinabea.
౩౬తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు.
37 Na Dodafahu babarima Elieser a ɔfiri Maresa hyɛɛ nkɔm, de tiaa Yehosafat. Ɔkaa sɛ, “Esiane sɛ wo ne ɔhene Ahasia ayɛ baako enti, Awurade bɛsɛe wʼadwuma.” Enti, ahyɛn no bobɔeɛ a wɔantumi amfa ankɔdi dwa.
౩౭అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.