< 1 Samuel 31 >

1 Afei, Filistifoɔ no ko tiaa Israel. Israelfoɔ no dwanee wɔ wɔn anim, na wɔkunkumm pii wɔ Gilboa bepɔ so.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిష్తీయులు వారిని గిల్బోవ కొండ వరకూ వెంటాడి హతం చేస్తూ,
2 Filistifoɔ no kɔɔ Saulo ne ne mmammarima so, kunkumm wɔn mu baasa a ɛyɛ Yonatan, Abinadab ne Malki-Sua.
సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.
3 Ɔko no mu yɛɛ den wɔ baabi a na Saulo wɔ hɔ. Filistifoɔ agyantofoɔ no bɛn no, na wɔpiraa no kɛse pa ara.
యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి,
4 Saulo firi yea mu ka kyerɛɛ nʼakodeɛkurafoɔ no sɛ, “Twe wo akofena no, na fa wɔ me, na wɔn a wɔntwaa twetia no amfa wɔn akofena ammɛwɔ me, angu mʼanim ase.” Na nʼakodeɛkurafoɔ no suroo sɛ ɔbɛyɛ saa. Enti, Saulo twee ɔno ankasa akofena sinaa ne ho wɔ so.
“సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు.
5 Ɛberɛ a nʼakodeɛkurafoɔ no hunuu sɛ wawuo no, ɔno nso sinaa ne ho wɔ nʼankasa akofena no so, na ɔwu daa ne ho.
సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు.
6 Enti, Saulo ne ne mma mmarima baasa, nʼakodeɛkurafoɔ ne nʼakodɔm nyinaa totɔɔ saa ɛda no.
ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.
7 Ɛberɛ a Israelfoɔ a wɔwɔ Yesreel bɔnhwa no fa baabi ne Yordan agya no hunuu sɛ Israel akodɔm no adi nkoguo, na Saulo nso ne ne mmammarima no nso atotɔ no, wɔgyaa wɔn nkuro hɔ dwaneeɛ. Na Filistifoɔ no bɛtenaa hɔ.
లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు, అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు.
8 Adeɛ kyeeɛ a Filistifoɔ kɔyiyii atɔfoɔ no ho no, wɔhunuu Saulo ne ne mmammarima baasa no amu wɔ Gilboa bepɔ so.
తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,
9 Enti, wɔtwaa Saulo ti, yiyii nʼakodeɛ nyinaa. Afei, wɔbɔɔ Saulo wuo no dawuro wɔ wɔn abosomfie, ne ɔman no mu nyinaa.
అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకు తమ విగ్రహాల గుళ్లలో, ప్రజల్లో ఈ విజయ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నాలుగు దిక్కులకూ మనుషులను పంపారు.
10 Wɔde nʼakodeɛ no kɔguu Astoret asɔreeɛ so, na wɔkyekyeree nʼamu no fam kuropɔn Bet-San ɔfasuo ho.
౧౦వారు సౌలు ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు.
11 Na Yabes Gileadfoɔ tee deɛ Filistifoɔ ayɛ Saulo no,
౧౧ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని
12 wɔn akofoɔ twaa ɛkwan anadwo mu no nyinaa kɔɔ Bet-San kɔfaa Saulo ne ne mmammarima baasa no amu firii ɔfasuo no ho. Wɔde kɔɔ Yabes bɛhyee wɔn.
౧౨బలిష్టులందరు రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బేత్షాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు.
13 Afei, wɔfaa wɔn nnompe kɔkoraa no odum dua no ase wɔ Yabes, na wɔdii mmuada nnanson.
౧౩ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.

< 1 Samuel 31 >