< 1 Samuel 27 >
1 Na Dawid dwenee ho sɛ, “Ɛda bi, mɛtɔ wɔ Saulo nsa ano. Na deɛ mɛyɛ a ɛbɛyɛ pa ara ne sɛ, mɛdwane akɔ Filistifoɔ nkyɛn. Ɛba saa a, Saulo bɛgyae mʼakyi die na mɛnya banbɔ.”
౧తరువాత దావీదు “నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు” అని మనసులో అనుకుని
2 Na Dawid ne mmarima ahansia tutu kɔtenaa Gat kɔhyɛɛ Maok babarima ɔhene Akis ase.
౨లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు.
3 Na Dawid de ne yerenom baanu a wɔyɛ Ahinoam a ɔfiri Yesreel ne Abigail a ɔfiri Karmel a na ɔyɛ Nabal kunabaa no kɔeɛ.
౩దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.
4 Saulo tee sɛ Dawid adwane kɔ Gat no, wanni nʼakyi anhwehwɛ no bio.
౪దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు.
5 Na Dawid ka kyerɛɛ Akis sɛ, “Sɛ ɛrenha wo a, ma yɛn baabi wɔ nkuro no bi so na yɛnkɔtena hɔ sene sɛ yɛbɛtena ahenkuro yi mu.”
౫దావీదు “రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు” అని ఆకీషును అడిగితే,
6 Enti, Akis de Siklag kuro maa no, (na ɛfiri saa ɛda no, ɛhɔ abɛyɛ Yuda ahemfo atenaeɛ de bɛsi ɛnnɛ),
౬ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకూ సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.
7 na wɔtenaa Filistifoɔ no mu afe ne abosome ɛnan.
౭దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.
8 Afei, Dawid ne ne dɔm kɔto hyɛɛ Gesurfoɔ, Girsifoɔ ne Amalekfoɔ so. Saa nnipa yi na na kane no, wɔtete asase a ɛtene kɔ Sur a ɛwɔ Misraim ɛkwan so no.
౮తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.
9 Dawid annya onipa baako anikann wɔ nkura a ɔkɔto hyɛɛ wɔn so no mu. Ɔfaa nnwan, anantwie, mfunumu, nyoma ne ntadeɛ nyinaa ansa na ɔsane akɔ Akis nkyɛn.
౯దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు.
10 Akis bisaa Dawid sɛ, “Ɛhe na ɛnnɛ mofom nneɛma kɔduruiɛ?” Dawid buaa sɛ, “Yɛkɔɔ Yuda anafoɔ fam, kɔto hyɛɛ Yerahmeelfoɔ ne Kenifoɔ so.”
౧౦అప్పుడు ఆకీషు “ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?” అని దావీదును అడిగితే, దావీదు “యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము” అన్నాడు.
11 Dawid kumm wɔn nyinaa. Wannya obiara a ɔbɛtumi aba Gat abɛkyerɛ faako a ɔkɔeɛ. Saa adeɛ yi kɔɔ so ara wɔ ɛberɛ a na Dawid te Filistifoɔ mu no.
౧౧ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు.
12 Akis gyee Dawid diiɛ, na ɔdwenee ne tirim sɛ, “Saa ɛberɛ yi deɛ, Israelfoɔ bɛkyiri no kɔkɔɔkɔ. Ɛsɛ sɛ ɔtena ha, na ɔsom me afebɔɔ.”
౧౨ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు” అనుకున్నాడు.