< 1 Ahemfo 2 >
1 Dawid rebɛwuo no, ɔde adwuma hyɛɛ Salomo nsa sɛ:
౧దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు,
2 “Merekɔ baabi a ɛsɛ sɛ da bi ɔteasefoɔ biara kɔ, enti yɛ den na kyerɛ wo mmaninyɛ,
౨“మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు.
3 na yɛ deɛ Awurade, wo Onyankopɔn, hwehwɛ sɛ woyɛ, nante nʼakwan mu, na di ne mmara ne nʼahyɛdeɛ so sɛdeɛ wɔatwerɛ wɔ Mose mmara no mu no, sɛdeɛ ɛbɛyɛ a, wobɛkɔ so wɔ biribiara a wobɛyɛ mu ne baabiara a wobɛkɔ nso.
౩నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు.
4 Sɛ woyɛ yei a na Awurade bɛdi ne bɔ a ɔhyɛɛ me no so sɛ, ‘Sɛ wʼasefoɔ hwɛ wɔn asetena, na wɔfiri wɔn akoma ne wɔn kra nyinaa mu nante nokorɛ mu wɔ mʼanim a, wɔn mu baako bɛtena Israel ahennwa no so.’
౪అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.
5 “Wonim sɛ Seruia babarima Yoab kumm mʼakodɔm asahene baanu no a ɛyɛ Ner babarima Abner ne Yeter babarima Amasa no. Ɔkunkumm wɔn, hwiee wɔn mogya guiɛ asomdwoeɛ berɛ mu a ɛnyɛ ɔko berɛ mu, na ɔde wɔn mogya kekaa nʼabɔwomu a ɛbɔ nʼasene mu ne ne mpaboa a ɛhyɛ ne nan so.
౫అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు.
6 Wo ne no nni, na mma no mmfa ne ti dwono nkɔ damena mu asomdwoeɛ mu. (Sheol )
౬అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనియ్యవద్దు. (Sheol )
7 “Na yɛ Barsilai a ɔfiri Gilead no mmammarima adɔeɛ, na ma wɔnka wɔn a wɔdidi wɔ wo didipono so no ho. Ɛberɛ a medwane firii wo nuabarima Absalom ho no, wɔyɛɛ me adɔeɛ.
౭నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయ చూపి, నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు.
8 “Kae Gera Benyaminni a ɔfiri Bahurim no babarima Simei. Ɔdomee me dendeenden, da a meredwane akɔ Mahanaim no. Na ɔbɛhyiaa me wɔ Yordan no, mede Awurade edin kaa ntam sɛ, Merenkum no.
౮ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను.
9 Nanso, ntam no mma ɔnni bem. Woyɛ ɔnyansafoɔ na wobɛhunu ɛkwan a wobɛfa so aka ne mogya agu.” (Sheol )
౯అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.” (Sheol )
10 Na Dawid wuiɛ, na wɔsiee no wɔ Dawid kurom.
౧౦ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు.
11 Ɔdii ɔhene wɔ Israel mfeɛ aduanan a ne nkyerɛmu ne sɛ, ɔdii Hebron so mfeɛ nson ɛnna Yerusalem nso, ɔdii adeɛ mfeɛ aduasa mmiɛnsa.
౧౧దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు.
12 Enti, Salomo tenaa nʼagya Dawid ahennwa so, na nʼadedie ase timiiɛ yie.
౧౨అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది.
13 Na Hagit babarima Adoniya kɔɔ Salomo ne maame Batseba nkyɛn. Batseba bisaa no sɛ, “Wobaa no asomdwoeɛ so anaa?” Ɔbuaa no sɛ, “Ɛyɛ asomdwoeɛ so.”
౧౩అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది. అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి,
14 Na ɔka kaa ho sɛ, “Mepɛ sɛ woyɛ me adɔeɛ bi.” Na Batseba bisaa sɛ, “Adɔeɛ bɛn.”
౧౪తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు. ఆమె “ఏమిటో చెప్పు” అంది.
15 Adoniya kaa sɛ, “Sɛdeɛ wonim no, na ahemman no yɛ me dea. Na Israel nyinaa hwɛ me kwan sɛ wɔn ɔhene. Nanso, nneɛma sesaeɛ, na ahemman no kɔɔ me nuabarima nkyɛn, ɛfiri sɛ, Awurade pɛ no saa.
౧౫అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది.
16 Seesei, adeɛ baako na mepɛ sɛ mebisa wo. Mfa nkame me.” Ɔkaa sɛ, “Wotumi bisa me.”
౧౬ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు.
17 Na ɔtoaa so sɛ, “Kɔbisa ɔhene Salomo ma me, na ɔremfa dekodeɛ no nkame wo. Bisa no na ɔmfa Abisag Sunamni no mma me sɛ me yere.”
౧౭ఆమె “చెప్పు” అంది. అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.
18 Na Batseba buaa sɛ, “Ɛyɛ, mɛka ho asɛm akyerɛ ɔhene ama wo.”
౧౮బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.
19 Enti Batseba kɔɔ ɔhene Salomo nkyɛn sɛ ɔrekɔkasa ama Adoniya. Ɔhene no sɔree sɛ ɔrebɛhyia no, bɔɔ ne mu ase ansa na ɔretena nʼahennwa so. Na ɔhyɛɛ sɛ wɔmfa adwa mmrɛ ɔhene maame, na ɔtenaa ɔhene nifa so.
౧౯బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.
20 Ɔka kyerɛɛ ɔhene sɛ, “Mewɔ adeɛ ketewaa bi bisa wo, na mfa nkame me.” Ɔhene no buaa no sɛ, “Bisa me, me maame. Meyɛ ama wo.”
౨౦ఆమె అతనితో “నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు” అంది. రాజు “అమ్మా, చెప్పు. నీ మాట కాదనను” అన్నాడు.
21 Enti, ɔkaa sɛ, “Ma wɔmfa Sunamni Abisag mma wo nuabarima Adoniya awadeɛ.”
౨౧అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.
22 Ɔhene Salomo bisaa ne maame sɛ, “Adɛn enti na wopɛ sɛ Adoniya ware Sunamni Abisag? Ɛnneɛ, sɛ wobɛbisa ahemman nso ama no. Wonim sɛ ɔyɛ me nua panin na ɔsɔfoɔ Abiatar ne Seruia babarima Yoab nso boa no!”
౨౨అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.
23 Na ɔhene Salomo de Awurade edin kaa ntam sɛ, “Sɛ Adoniya amfa ne nkwa antwa saa abisadeɛ yi so a, Onyankopɔn ne me nni no denden so pa ara.
౨౩అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. “యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక.
24 Na seesei deɛ, mmerɛ dodoɔ a Awurade te ase yi, ɔno a watim mʼase wɔ mʼagya Dawid ahennwa so, na wabɔ me fie ahennie mu nnidisoɔ atenaseɛ ama me, sɛdeɛ ɔhyɛɛ me bɔ no, Adoniya deɛ, twa ara na ɛtwa sɛ ɔwu ɛnnɛ yi ara.”
౨౪నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు” అన్నాడు.
25 Enti, Salomo hyɛɛ Yehoiada babarima Benaia sɛ ɔnkum no, na ɔkumm Adoniya.
౨౫అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతణ్ణి చంపాడు.
26 Na ɔhene no ka kyerɛɛ ɔsɔfoɔ Abiatar sɛ, “Sane kɔ wo kurom Anatot. Wofata sɛ wowuo, nanso merenku wo seesei, ɛfiri sɛ, wosoaa Awurade Otumfoɔ Adaka no maa mʼagya, na wo ne no nyinaa na mohunuu amane wɔ nʼabɛbrɛsɛ nyinaa mu.”
౨౬తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో “అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు మరణానికి పాత్రుడివయ్యావు గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి, నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈ రోజు నిన్ను చంపను” అని చెప్పాడు.
27 Enti, Salomo worɔɔ Abiatar atadeɛ sɛ ɔsɔfoɔ, nam so dii mmara a Awurade hyɛɛ wɔ Silo fa Eli asefoɔ ho no so.
౨౭తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండాా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబికులను గురించి షిలోహులో చెప్పిన మాట నెరవేరింది.
28 Ɛwom, ahyɛaseɛ no na ɔnni Absalom akyi, nanso Yoab de ne ho kɔdɔm Adoniya adɔnyɛ no. Ɛberɛ a Yoab tee Adoniya wuo no, ɔtuu mmirika kɔɔ Awurade ntomadan kronkron no mu, na ɔkɔsosɔɔ mmɛn a ɛtuatua afɔrebukyia no ho no mu.
౨౮యోవాబు అబ్షాలోమును సమర్ధించక పోయినా, అదోనీయాను సమర్ధించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారం లోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.
29 Ɛberɛ a ɔhene Salomo tee asɛm yi, ɔsomaa Yehoiada babarima Benaia sɛ ɔnkɔkum no.
౨౯యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోనురాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి “నీవు వెళ్లి అతని మీద పడి చంపు” అని ఆజ్ఞాపించాడు.
30 Na Benaia kɔɔ Awurade ntomadan kronkron no mu kɔka kyerɛɛ Yoab sɛ, “Ɔhene se firi adi.” Nanso, Yoab buaa sɛ, “Dabi, mɛwu wɔ ha.” Enti, Benaia sane kɔɔ ɔhene no nkyɛn kɔkaa asɛm a Yoab aka no kyerɛɛ no.
౩౦బెనాయా యెహోవా గుడారానికి వచ్చి “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని యోవాబుతో చెప్పాడు. అతడు “రాను, నేనిక్కడే చనిపోతాను” అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరకి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు.
31 Ɔhene no tee asɛm a Yoab kaeɛ no, ɔka kyerɛɛ Benaia sɛ, “Yɛ deɛ ɔkaeɛ no. Ku no wɔ afɔrebukyia no ho, na sie no. Yei bɛyi adwenemherɛ mogyahwieguo ho afɔdie afiri me ne mʼagya fiefoɔ so.
౩౧అందుకు రాజు ఇలా అన్నాడు. “అతడు నీతో చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతణ్ణి చంపి పాతిపెట్టి, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండీ, నా తండ్రి కుటుంబం నుండీ తొలగిపోయేలా చెయ్యి.
32 Na Awurade bɛtua no kum a ɔkumm mmarima ateneneefoɔ amapa baanu a na wɔyɛ sene no no so ka. Na mʼagya nnim Ner babarima Abner a na ɔyɛ Israel akodɔm sahene ne Yeter babarima Amasa a na ɔno nso yɛ Yuda akodɔm sahene no wuo ho hwee.
౩౨నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు.
33 Yoab ne nʼasefoɔ deɛ, saa awudie ahodoɔ yi ho afɔdie ntena wɔn so, na Awurade mma Dawid ne nʼasefoɔ ne nʼahennwa asomdwoeɛ afebɔɔ!”
౩౩అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.”
34 Enti, Yehoiada babarima Benaia sane kɔɔ ntomadan kronkron no mu, kɔkumm Yoab, na wɔsiee Yoab wɔ ne kurom wiram baabi.
౩౪కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతణ్ణి చంపాడు. అతణ్ణి అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు.
35 Na ɔhene no yii Yehoiada babarima Benaia sɛ ɔnsi Yoab anan sɛ ɔsafohene. Na ɔyii ɔsɔfoɔ Sadok de no sii Abiatar anan.
౩౫రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడుగా నియమించాడు.
36 Ɔhene no soma ma wɔkɔfrɛɛ Simei ka kyerɛɛ no sɛ, “Si efie wɔ Yerusalem ha na tena mu. Nanso, mfiri kuro no mu nkɔ baabiara.
౩౬తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు. “నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటకి ఎక్కడికీ వెళ్లకుండా అందులోనే నివసించు.
37 Na da a wobɛtwa Kidron bɔnhwa no, wobɛwu; na wo mogya bɛgu wʼankasa wo tiri so.”
౩౭నీవు ఏ రోజైతే బయటికి వచ్చి, కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు కచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి.”
38 Na Simei buaa sɛ, “Wʼatemmuo no yɛ kronn. Biribiara a me wura ɔhene bɛhyɛ sɛ menyɛ no, mɛyɛ.” Enti, Simei tenaa Yerusalem kyɛree yie.
౩౮అప్పుడు షిమీ “మీరు చెప్పింది మంచిదే. నా యజమాని, రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయిన నేను చేస్తాను” అని రాజుతో చెప్పాడు. షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు.
39 Na mfeɛ mmiɛnsa akyi no, Simei asomfoɔ baanu dwane kɔɔ Gathene Akis, Maaka babarima nkyɛn. Ɛberɛ a Simei hunuu baabi a wɔwɔ no,
౩౯అయితే మూడు సంవత్సరాల తరవాత షిమీ పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడు ఆకీషు అనే గాతు రాజు దగ్గరకి చేరారు. అప్పుడు “నీ మనుషులు గాతులో ఉన్నారు” అని షిమీకి వార్త వచ్చింది.
40 ɔhyehyɛɛ nʼafunumu, kɔɔ Gat, kɔhwehwɛɛ wɔn. Ɔhunuu wɔn no, ɔde wɔn sane baa Yerusalem.
౪౦షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరకి వెళ్ళి, అక్కడి నుండి తన పనివారిని తీసుకువచ్చాడు.
41 Salomo tee sɛ Simei afiri Yerusalem akɔ Gat asane aba.
౪౧షిమీ యెరూషలేమును విడిచి గాతుకు వెళ్ళి వచ్చాడని సొలొమోనుకు తెలిసింది.
42 Enti, wɔsoma ma wɔkɔfrɛɛ Simei baeɛ, na ɔbisaa no sɛ, “Mamma woanka ntam Awurade edin mu sɛ, worenkɔ baabiara, na sɛ anyɛ saa a, wobɛwu? Na wobuaa sɛ, ‘Atemmuo no yɛ kronkron; na mɛdi asɛm a woaka no so.’
౪౨రాజు షిమీని పిలిపించి అతనితో “నీవు ఏ రోజున బయలుదేరి బయటికి వెళ్తావో యెహోవా తోడు, ఆ రోజు నీవు కచ్చితంగా చచ్చిపోతావు అని నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించి, నీచేత ప్రమాణం చేయించాను గదా? పైగా, ‘మీరు చెప్పిందే మంచిది’ అని నీవు కూడా ఒప్పుకున్నావు.
43 Na adɛn enti na woanni wo ntanka no so amma Awurade, na woantie me nhyɛ?”
౪౩కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణాన్ని, నేను నీకిచ్చిన ఆజ్ఞను నీవెందుకు పాటించలేదు?” అని అడిగాడు.
44 Na ɔhene no ka kaa ho sɛ, “Akyinnyeɛ biara nni ho sɛ wokae amumuyɛ a woyɛɛ mʼagya, ɔhene Dawid. Awurade bɛtwe wʼaso wɔ ho.
౪౪“నీవు నా తండ్రి దావీదుకు చేసిన కీడంతా నీకు బాగానే తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పిస్తాడు.
45 Na medeɛ, mɛnya Awurade nhyira, na daa Dawid aseni atena ahennwa no so.”
౪౫అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సన్నిధిలో చిరకాలం సుస్థిరమౌతుంది” అని షిమీతో చెప్పి
46 Na ɔhene no nhyɛ so, Yehoiada babarima Benaia faa Simei de no firii adi kɔkumm no. Enti ahemman no timiiɛ wɔ Salomo nsam.
౪౬రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. ఈ విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది.