< 1 Ahemfo 12 >
1 Rehoboam kɔɔ Sekem, ɛfiri sɛ, na Israelfoɔ nyinaa akɔ hɔ sɛ wɔrekɔsi no ɔhene.
౧రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు.
2 Ɛberɛ a Nebat babarima Yeroboam tee sɛ Salomo awuo no, ɔfiri Misraim baeɛ, ɛfiri sɛ ɔdwane firii ɔhene Salomo nsam kɔtenaa Misraim.
౨నెబాతు కొడుకు యరొబాము, సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు.
3 Enti, Israel mpanimfoɔ soma ma wɔkɔfaa Yeroboam, na Israel nnipadɔm no nyinaa kɔɔ Rehoboam nkyɛn, ne no kɔkasaeɛ sɛ,
౩ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు.
4 “Wʼagya hyɛɛ yɛn ma yɛyɛɛ adwumaden. Yɛsrɛ wo, te saa adwumaden ne apeatoɔ adesoa duruduru a wʼagya de soaa yɛn no so. Woyɛ saa a, yɛbɛsom wo nokorɛ mu.”
౪“మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని, మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”
5 Rehoboam buaa sɛ, “Momma me nnansa na menwene mo asɛm yi ho. Ɛno akyi, mommra mmɛgye me mmuaeɛ.” Enti, nnipa no sane kɔeɛ.
౫అందుకు రాజు “మీరు వెళ్లి మూడు రోజులైన తరువాత నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పగా ప్రజలు వెళ్లిపోయారు.
6 Na ɔhene Rehoboam ne ne mpanimfoɔ a wɔsom nʼagya Salomo ɛberɛ a ɔte ase no tuu asɛm no ho agyina. Ɔbisaa mpanimfoɔ no sɛ, “Moka asɛm no ho ɛdeɛn? Mmuaeɛ bɛn na memfa mma saa nnipa yi?”
౬అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?” అని వారిని అడిగాడు.
7 Wɔbuaa no sɛ, “Sɛ ɛnnɛ yi, wopɛ sɛ woyɛ ɔsomfoɔ ma saa nnipa yi, na woma wɔn mmuaeɛ pa a, ɛnneɛ, daa wɔbɛsom wo nokorɛ mu.”
౭వారు “ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు” అన్నారు.
8 Nanso Rehoboam amfa afotuo a mpanimfoɔ no tuu no no. Mmom, ɔkɔɔ nʼatipɛnfoɔ mmabunu bi a ɔne wɔn sii so a na wɔtu no fo no nkyɛn.
౮అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని
9 Ɔbisaa wɔn sɛ, “Mo nso mo adwene ne sɛn? Mmuaeɛ bɛn na memfa nkɔma nnipa a wɔpɛ sɛ mete adesoa a mʼagya de soaa wɔn no so?”
౯“మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?” అని ప్రశ్నించాడు.
10 Nʼatipɛnfoɔ mmabunu buaa no sɛ, “Ka kyerɛ wɔn a wɔnwiinwii no sɛ, ‘Me kɔkorɔbɛto mu pi sene mʼagya asene; sɛ modwene sɛ ɔhyɛɛ mo so dodo a, montwɛn na monhwɛ sɛdeɛ mɛyɛ.’
౧౦అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. “నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది.
11 Aane, mʼagya yɛɛ den wɔ mo so, na mɛyɛ aboro saa. Mʼagya kaa mo mpire a, me deɛ mede anyanyankyerɛ bɛkeka mo.”
౧౧మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
12 Nnansa akyi, Yeroboam ne nnipa no nyinaa sane baa sɛ wɔrebɛtie Rehoboam mmuaeɛ, sɛdeɛ ɔkaeɛ no.
౧౨“మూడో రోజు నా దగ్గరికి రండి” అని రాజు చెప్పినట్టు యరొబాము, ప్రజలంతా మూడో రోజు రెహబాము దగ్గరికి వచ్చారు.
13 Ɔhene no buaa nnipa no abufuo so. Wamfa mpanimfoɔ no afotuo no;
౧౩అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి, యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు.
14 ɔfaa mmabunu no afotuo. Ɔka kyerɛɛ nnipa no sɛ, “Mʼagya yɛɛ den wɔ mo so, na mɛyɛ aboro saa. Mʼagya hwee mo mpire na me deɛ mede anyanyankyerɛ bɛkeka mo.”
౧౪“మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
15 Enti, ɔhene no antie nnipa no adesrɛ. Sɛdeɛ nneɛma mu daneeɛ no nyinaa firi Awurade, ɛfiri sɛ, ɛmaa asɛm a Awurade nam Ahiya a ɔfiri Silo so ka kyerɛɛ Nebat babarima Yeroboam no baa mu.
౧౫ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు.
16 Ɛberɛ a Israel nyinaa hunuu sɛ ɔhene anyɛ wɔn abisadeɛ amma wɔn no, wɔteateaam sɛ, “Yɛne Dawid nni hwee yɛ! Yɛne Yisai babarima no nni hwee yɛ! Israel, momma yɛnkɔ yɛn nkyi! Dawid, hwɛ wʼankasa wo fie so!” Enti, Israelfoɔ no sane kɔɔ wɔn fie.
౧౬కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
17 Na Rehoboam toaa so dii Israelfoɔ a wɔtenaa Yuda nkuro so no nyinaa so ɔhene.
౧౭అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు.
18 Na ɔhene Rehoboam somaa Adoram a na ɔtua adwumayɛfoɔ ano no sɛ ɔnkɔhwɛ, na asomdwoeɛ mmra, nanso Israel nyinaa sii no aboɔ, kumm no. Ɛberɛ a ɔhene Rehoboam tee saa asɛm yi no, ntɛm ara, ɔhuri tenaa ne teaseɛnam mu, dwane kɔɔ Yerusalem.
౧౮తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు.
19 Israel mmusuakuo a wɔwɔ atifi fam no ampene sɛ Dawid aseni bɛdi wɔn so, de bɛsi ɛnnɛ.
౧౯ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు.
20 Ɛberɛ a Israelfoɔ tee sɛ Yeroboam firi Misraim asane aba no, wɔyɛɛ nhyiamu, sii no ɔhene wɔ Israel nyinaa so. Enti, Yuda abusuakuo no nko ara na wɔkaeɛ, somm Dawid fie nokorɛ mu.
౨౦యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు.
21 Ɛberɛ a Rehoboam duruu Yerusalem no, ɔboaboaa Yuda ne Benyamin akodɔm ano. Ɔyii akofoɔ mpem ɔha ne aduɔwɔtwe, sɛ wɔrekɔko atia Israel akodɔm, na wɔafa ahemman no adi so.
౨౧రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1, 80,000 మందిని సమకూర్చాడు.
22 Nanso, Onyankopɔn ka kyerɛɛ Semaia, Onyankopɔn onipa no sɛ,
౨౨కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు.
23 “Ka kyerɛ Salomo babarima Rehoboam, Yudahene ne nnipa a wɔfiri Yuda ne Benyamin sɛ,
౨౩“నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు,
24 ‘Sɛdeɛ Awurade seɛ nie, Mo ne mo nuanom Israelfoɔ nntwa mo ho nko. Monsane nkɔ mo akyi, na deɛ asi no nyinaa firi me!’” Enti, wɔtiee Awurade asɛm no, sane kɔɔ wɔn fie sɛdeɛ Awurade hyɛeɛ no.
౨౪యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.” కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.
25 Yeroboam kyekyeree Sekem kuro wɔ Efraim bepɔ asase so, ma ɛbɛyɛɛ ne kuropɔn. Akyire yi, ɔkɔkyekyeree kuro Penuel.
౨౫తరువాత యరొబాము ఎఫ్రాయిము కొండప్రాంతంలో షెకెము అనే పట్టణాన్ని కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడ నుంచి వెళ్లి పెనూయేలును కట్టించాడు.
26 Yeroboam dwenee ho dinn, see nʼakomam sɛ, “Sɛ manhwɛ yie a, ahemman no bɛsane akɔ Dawid fiefoɔ adedifoɔ nsam.
౨౬యరొబాము ఇలా అనుకున్నాడు. “ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి ఎక్కి వెళ్తే వారి హృదయం యూదారాజు రెహబాము అనే తమ యజమాని వైపుకు తిరుగుతుంది.
27 Na sɛ wɔkɔ Yerusalem, kɔbɔ afɔdeɛ wɔ Awurade Asɔredan mu nso a, wɔbɛsom Yudahene Rehoboam. Ɛba saa a, wɔbɛkum me, de ɔno mmom asi wɔn so ɔhene.”
౨౭అప్పుడు వారు నన్ను చంపి మళ్ళీ యూదా రాజు రెహబాము పక్షం చేరతారు. రాజ్యం మళ్ళీ దావీదు సంతానం వారిది అవుతుంది”
28 Enti, ɔtiee deɛ nʼafotufoɔ ka, na ɔyɛɛ sikakɔkɔɔ anantwie mma mmienu. Ɔka kyerɛɛ nnipa no sɛ, “Ɛyɛ ɔbrɛ bebree sɛ mobɛforo akɔ Yerusalem akɔsom. Ɛno enti, Israel, yeinom ne anyame a wɔyii mo firii Misraim!”
౨౮యరొబాము తన హృదయంలో ఇలా ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించాడు. అతడు ప్రజలను పిలిచి “యెరూషలేము వెళ్ళడం మీకు చాలా కష్టం.
29 Ɔde nantwie mma ahoni yi sisii Israel anafoɔ ne atifi, wɔ Bet-El ne Dan.
౨౯ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే” అని చెప్పి, ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు.
30 Yei bɛyɛɛ bɔne kɛseɛ, ɛfiri sɛ, nnipa no somm ahoni no, a na mpo wɔtwa ɛkwan kɔ Dan.
౩౦కాబట్టి ఈ పని దోషం అయింది. ఈ రెంటిలో ఒకదాన్ని పూజించడానికి ప్రజలు దాను వరకూ వెళ్ళసాగారు.
31 Yeroboam sisii abosonnan wɔ nkokoɔ so, na ɔpaa asɔfoɔ firii nnipa no mu a na wɔmfiri Lewi asɔfoɔ abusua mu.
౩౧అతడు ఉన్నత స్థలాల్లో మందిరాలను ఏర్పరచాడు. లేవీయులు కాని సాధారణమైన వారు కొందరిని యాజకులుగా నియమించాడు.
32 Yeroboam hyehyɛɛ nyamesom dapɔnna wɔ Bet-El a na wɔdi saa nna no Bul bosome (bɛyɛ Ahinime) mu a na ɛte sɛ Yuda Dwanekɔbea Afahyɛ no ara. Bet-El hɔ na ɔno ankasa bɔɔ afɔdeɛ maa anantwie mma ahoni a wayɛ no. Na Bet-El hɔ ara nso, na ɔpaa asɔfoɔ, maa abosomfie a ɔsisiiɛ no.
౩౨యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు.
33 Na ɔno ankasa yii da bi too hɔ, Bul bosome (bɛyɛ Ɔsannaa) mfimfini mu hɔ, na Yeroboam kɔbɔɔ afɔdeɛ wɔ afɔrebukyia so wɔ Bet-El. Ɔhyɛɛ anyamesom afahyɛ ase maa Israel, na ɔforo kɔɔ afɔrebukyia no so kɔhyee aduhwam.
౩౩ఈ విధంగా తన మనస్సులో అనుకున్న దాన్ని బట్టి అతడు ఎనిమిదవ నెల, పదిహేనవ రోజు బేతేలులో తాను చేయించిన బలిపీఠం సమీపించాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి, ధూపం వేయడానికి తానే బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు.