< 1 Berɛsosɛm 13 >

1 Dawid ne ne mpanimfoɔ a nʼasraafoɔ asahene ne mmapɔmma nyinaa ka ho, tuu agyina.
దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో,
2 Na ɔkasa kyerɛɛ Israelfoɔ a wɔahyia hɔ no nyinaa sɛ, “Sɛ mopene so na sɛ ɛyɛ Awurade yɛn Onyankopɔn pɛ a, momma yɛnto nkra nkɔma Israelfoɔ a wɔwɔ ɔman no afanan nyinaa a asɔfoɔ ne Lewifoɔ a wɔwɔ nkuro so ne adidibea ka ho. Momma yɛnto nsa mfrɛ wɔn, na wɔmmɛka yɛn ho.
“ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి,
3 Ɛberɛ aduru sɛ yɛsane de yɛn Onyankopɔn Apam Adaka no ba, ɛfiri sɛ, Saulo ahennie ɛberɛ so no, yɛampɛ anhwɛ.”
మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు” అన్నాడు.
4 Badwa no penee saa asɛm yi so ɛfiri sɛ, wɔhunuu sɛ, wɔyɛ saa a, ɛyɛ.
ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.
5 Enti, Dawid frɛɛ nnipa a wɔwɔ Israel nyinaa, ɛfiri ɔman no tire kɔsi tire, sɛ wɔmmɛka ne ho na wɔmfa Onyankopɔn Apam Adaka no mfiri Kiriat-Yearim mmra.
దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు.
6 Afei, Dawid ne Israelfoɔ no nyinaa kɔɔ Baala a na wɔfrɛ no Kiriat-Yearim a ɛwɔ Yuda no sɛ wɔrekɔfa Onyankopɔn Apam Adaka a wɔde ahyɛ Kerubim ntam na Awurade din da so no aba.
కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.
7 Wɔde Onyankopɔn Apam Adaka no sii teaseɛnam foforɔ so de firii Abinadab fie a Usa ne Ahio rekyerɛ ɛkwan.
వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు.
8 Dawid ne Israelfoɔ nyinaa firii wɔn ahoɔden mu too nnwom, bɔɔ mmɛn ahodoɔ a ebi yɛ asankuo, mmɛnta, mpintin, nnawuro ne ntotorobɛnto dii ahurisie wɔ Onyankopɔn anim.
దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
9 Nanso wɔduruu Nakon ayuporobea no, anantwie no anan totoeɛ maa Usa tenee ne nsa sɛ ɔretene Apam Adaka no.
వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు
10 Ɛhɔ na Awurade abufuo sɔre tiaa Usa maa ɔwuiɛ ɛfiri sɛ, ɔde ne nsa aka Apam Adaka no. Enti Usa wuu wɔ Onyankopɔn anim hɔ ara.
౧౦యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు.
11 Dawid bo fuiɛ, ɛfiri sɛ Awurade abufuo atia Usa. Ɔtoo beaeɛ hɔ edin Peres-Usa a wɔda so frɛ hɔ saa de bɛsi ɛnnɛ.
౧౧యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు.
12 Afei, na Dawid suro Onyankopɔn, na ɔbisaa sɛ, “Ɛbɛyɛ dɛn na matumi de Onyankopɔn Apam Adaka yi aba abɛhwɛ so?”
౧౨ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి “దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?” అన్నాడు.
13 Enti, Dawid yɛɛ nʼadwene sɛ ɔnna mfa Apam Adaka no nkɔ Dawid kuro no mu. Mmom, ɔde kɔɔ Gatni, Obed-Edom fie wɔ Gat.
౧౩కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు.
14 Onyankopɔn Apam Adaka no sii Obed-Edom abusuafoɔ nkyɛn abosome mmiɛnsa. Na Awurade hyiraa no ne ne fiefoɔ nyinaa.
౧౪దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.

< 1 Berɛsosɛm 13 >