< Sakaria 14 >
1 Awurade da bi reba a, wɔbɛkyɛ mo asade wɔ mo mu.
౧ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు.
2 Mɛboaboa aman no nyinaa ano abɛko atia Yerusalem; wɔbɛko afa kuropɔn no, wobewia afi mu nneɛma, na wɔato mmea no mmonnaa. Wɔbɛfa kuropɔn no mu nnipa no mu fa akɔ nnommum mu, nanso nkae no bɛka kuropɔn no mu.
౨ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.
3 Afei, Awurade bɛkɔ akɔko atia saa aman no, sɛnea ɔko, ɔkoda no.
౩అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
4 Saa da no, ɔde nʼanammɔn besisi Ngo Bepɔw a ɛwɔ Yerusalem apuei fam no so, na Ngo Bepɔw no mu bɛpae abien afi apuei fam akosi atɔe fam na ayɛ obon kɛse. Ɛbɛma bepɔw no fa akɔ atifi fam, na fa nso akɔ anafo fam.
౪ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.
5 Mubeguan afa me bon no mu, efisɛ ekosi Asel. Mubeguan, sɛnea moyɛɛ no bere a asase wosow wɔ Yudahene Usia bere so no. Afei, Awurade, me Nyankopɔn, bɛba a ahotefo nyinaa ka ne ho.
౫కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.
6 Saa da no, hann, awɔw ne sukyerɛmma remma.
౬ఆ రోజున వెలుగు ఉండదు. ప్రకాశించేవన్నీ మసకబారిపోతాయి.
7 Ɛbɛyɛ da sononko a enni awia anaa anadwo, da a Awurade na onim. Onwini bedwo no na hann wɔ hɔ.
౭అది యెహోవాకు మాత్రమే తెలిసిన రోజు. ఆ రోజు పగలూ కాదు, రాత్రీ కాదు. సాయంత్రం సమయంలో వెలుగు ఉంటుంది.
8 Saa da no, nkwa nsu bɛteɛ afi Yerusalem, fa bɛkɔ apuei po mu, na fa akɔ atɔe po mu, ahohurubere ne awɔwbere mu.
౮ఆ రోజున జల ప్రవాహాలు యెరూషలేము నుండి ప్రవహిస్తాయి. వాటిలో సగం తూర్పు సముద్రంలోకి, సగం పడమర సముద్రంలోకి ప్రవహిస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో కూడా అలాగే జరుగుతుంది.
9 Awurade bedi hene wɔ asase nyinaa so. Saa da no, Awurade bɛyɛ baako na ne din nso ayɛ baako pɛ.
౯ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
10 Asase a efi Geba kosi Rimon a ɛda Yerusalem anafo fam nyinaa bɛyɛ sɛ Araba. Nanso wɔbɛma Yerusalem so; efi Benyamin Pon kosi Ɔpon A Edi Kan de kɔ Ntwea so Pon, afei efi Hananel Abantenten kosi adehye nsakyiamoa nyinaa, na ɛbɛtena ne sibea.
౧౦అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది.
11 Nnipa bɛtena mu, na wɔrensɛe no bio. Yerusalem benya asomdwoe.
౧౧ప్రజలు దానిలో నివసిస్తారు. ఇకపై శాపం వారి పైకి రాదు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసిస్తారు.
12 Eyi ne ɔyaredɔm a Awurade de bɛbɔ aman a wɔko tiaa Yerusalem no. Wɔn honam bɛporɔw bere a wogyina wɔn anan so, Wɔn aniwa nkesua bɛporɔw wɔ wɔn ntokuru mu, na wɔn tɛkrɛma bɛporɔw wɔ wɔn anom.
౧౨యెహోవా యెరూషలేముపై దండెత్తి యుద్ధం చేసిన ప్రజలపై తెగుళ్లు రప్పించి వాళ్ళను హింసిస్తాడు. ఆ ప్రజలు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్లిపోతాయి. వారి కళ్ళు వాటి కుహరాల్లోనే కుళ్లిపోతాయి. వారి నాలుకలు వారి నోళ్లలోనే కుళ్లిపోతాయి.
13 Saa da no, Awurade bɛma nnipa abɔ huboa, na wobetwa wɔn ho ako.
౧౩ఆ రోజున యెహోవా వారి మధ్య భయంకరమైన అయోమయం పుట్టిస్తాడు. వాళ్ళంతా ఒకరికొకరు శత్రువులై ఒకరినొకరు చంపుకుంటారు.
14 Yuda nso bɛko wɔ Yerusalem. Wɔbɛfa aman a atwa ahyia hɔ no nyinaa ahonyade a ɛyɛ sikakɔkɔɔ, dwetɛ ne adurade bebree.
౧౪యూదా ప్రజలు యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న ఇతర దేశాల ప్రజలందరి నుండి బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు కొల్లసొమ్ముగా దోచుకుంటారు.
15 Saa ɔyaredɔm koro yi ara bɛka apɔnkɔ, mfurumpɔnkɔ, yoma, mfurum ne mmoa a aka a wɔwɔ atamfo nsra mu nyinaa.
౧౫అదే విధంగా గుర్రాల మీదా, కంచర గాడిదల మీదా, ఒంటెల మీదా, గాడిదల మీదా, మందలో ఉన్న పశువులన్నిటి మీదా తెగుళ్లు వచ్చి పడతాయి.
16 Afei wɔn a wɔbɛka wɔ aman a wɔko tiaa Yerusalem no nyinaa bɛkɔ akɔsom Ɔhene no, Asafo Awurade no afe biara, na wɔadi Asese Afahyɛ no.
౧౬యెరూషలేము మీదికి వచ్చిన ఇతర దేశాల ప్రజల్లో నాశనం కాకుండా మిగిలిన వారందరూ సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికీ, పర్ణశాల పండగ ఆచరించడానికీ ఏటేటా యెరూషలేముకు వస్తారు.
17 Sɛ wiase mu nnipa bi ankɔ Yerusalem ankɔsom Ɔhene no, Asafo Awurade no a, osu rentɔ mma wɔn.
౧౭లోకంలో ఉన్న అన్య జాతుల ప్రజల్లో ఎవరైనా సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికి యెరూషలేముకు రాని పక్షంలో వారి ప్రాంతాల్లో వాన కురవదు.
18 Sɛ Misraimfo ankɔ hɔ ankɔhyɛ fa no bi a, osu rentɔ mma wɔn. Awurade de ɔyaredɔm a ɔma ɛba aman a wɔnnkɔ Asese Afahyɛ no so no bɛbɔ wɔn.
౧౮ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు.
19 Eyi bɛyɛ asotwe ama Misraim ne aman a wɔnnkɔ Asese Afahyɛ no nyinaa.
౧౯ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.
20 Saa da no, wobekurukyerɛw asɛm a ɛka se: KRONKRON MA Awurade wɔ nnɔnnɔmma a ɛsensɛn apɔnkɔ kɔn mu ho, na nkuku a wɔde noa aduan wɔ Awurade fi no bɛyɛ sɛ nkuruwa kronkron a esisi afɔremuka anim.
౨౦ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు.
21 Kuku biara a ɛwɔ Yerusalem ne Yuda bɛyɛ nea wɔatew ho ama Asafo Awurade, na wɔn a wɔba bɛbɔ afɔre nyinaa bɛfa nkuku yi bi anoa mu. Na saa da no, wɔrenhu Kanaanni wɔ Asafo Awurade fi bio.
౨౧యెరూషలేములో, యూదా దేశంలో ఉన్న పాత్రలన్నీ సేనల ప్రభువు యెహోవాకు ప్రతిష్టితమౌతాయి. బలి అర్పించినవారు వధించిన దానిలో కావలసినదాన్ని తీసుకుని వంట చేసుకుంటారు. ఆ కాలంలో కనాను జాతివాడు ఎవ్వడూ సేనల ప్రభువు యెహోవా మందిరంలో కనిపించడు.