< Sakaria 12 >

1 Nkɔmhyɛ: Eyi ne Awurade asɛm a ɛfa Israel ho. Awurade a ɔtrɛw ɔsoro mu, nea ɔto asase fapem, nea ɔyɛ honhom a ɔte onipa mu asɛm ni:
ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా.
2 “Merebɛyɛ Yerusalem kuruwa a ɛbɛma aman a atwa ne ho ahyia no atɔ ntintan. Wɔbɛtow ahyɛ Yuda ne Yerusalem so.
ఆయన చెబుతున్నది ఏమిటంటే “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న సమస్త ప్రజలందరికీ మత్తు కలిగించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును, యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు.
3 Saa da no a wiase aman nyinaa aboa wɔn ho ano retia no no, mɛma Yerusalem ayɛ ɔbotantim ama aman no nyinaa. Wɔn a wɔbɛpɛ sɛ wopirew no no nyinaa bepirapira wɔn ho.
భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.”
4 Saa da no, mɛma ɔpɔnkɔ biara abɔ huboa, na mɛma ne sotefo nso abɔ dam,” sɛnea Awurade se ni. “Mebue mʼani ahwɛ Yudafi, na mefurafura aman ahorow no apɔnkɔ ani.
ఇదే యెహోవా వాక్కు. “ఆ దినాన నేను గుర్రాలన్నిటికీ బెదురు, గుర్రపు రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదావారి విషయం శ్రద్ధ చూపించి, ఇతర ప్రజల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను.”
5 Na Yuda mmusua bɛka wɔ wɔn koma mu se, ‘Yerusalemfo yɛ ahoɔdenfo, efisɛ Asafo Awurade yɛ wɔn Nyankopɔn.’
అప్పుడు యెరూషలేములోని అధికారులు, నివాసులు “దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన మాకు తోడుగా ఉన్నాడు” అని తమ మనస్సుల్లో చెప్పుకుంటారు.
6 “Saa da no, mɛyɛ Yuda mmusua sɛ ogya asanka a ɛhyɛ nnyina mu, te sɛ ogyatɛn a ɛredɛw wɔ nwura a wɔaboa ano mu. Wɔbɛhyew nnipa a wɔatwa wɔn ho ahyia nyinaa wɔ benkum ne nifa, nanso hwee renka Yerusalem wɔ faako a ɔwɔ.
ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.
7 “Awurade bɛbɔ Yuda atenae ho ban kan, sɛnea Dawidfi ne wɔn a wɔte Yerusalem anuonyam renkyɛn Yudafo anuonyam.
మొదటగా యెహోవా యూదావారి నివాసాలను రక్షిస్తాడు. దావీదు వంశంవారు, యెరూషలేము ప్రజలు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా ఆయన ఇలా చేస్తాడు.
8 Saa da no, Awurade bɛbɔ wɔn a wɔte Yerusalem ho ban, nea ɔyɛ mmerɛw koraa wɔ wɔn mu no bɛyɛ sɛ Dawid. Na Dawid asefo bɛyɛ sɛ Onyankopɔn, te sɛ Awurade Bɔfo a odi wɔn anim.
ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు.
9 Saa da no, mefi ase asɛe aman a wɔko tia Yerusalem nyinaa.
ఆ కాలంలో యెరూషలేము మీదికి దండెత్తే ఇతర దేశాల ప్రజలందరినీ నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
10 “Mehwie adom ne nkotosrɛ honhom agu Dawidfi ne wɔn a wɔte Yerusalem so. Wɔbɛhwɛ me a wɔahwirew me, na wɔatwa adwo ama no te sɛ obi a ɔretwa adwo wɔ ɔba koro ho, na wɔasu yayaayaw te sɛ obi a ɔresu ne ba barima piesie.
౧౦అప్పుడు దావీదు వంశీయుల మీదా యెరూషలేములో నివసించే ప్రజల మీదా కరుణ కలిగించే ఆత్మ కోసం విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను వారు కళ్లారా చూస్తారు. ఒకడు తన ఏకైక కుమారుడు మరణిస్తే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుడు మరణిస్తే ఒకడు విలపించినట్టు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు.
11 Saa da no agyaadwotwa a ɛwɔ Yerusalem no ano bɛyɛ den te sɛ Hadad-Rimon agyaadwotwa wɔ Megido asasetam so.
౧౧మెగిద్దో మైదానంలో హదదిమ్మోను దగ్గర జరిగిన విలాపం వలె ఆ రోజున యెరూషలేములో మహా విలాపం జరుగుతుంది.
12 Asase no sofo nyinaa bedi awerɛhow, abusua biara ne wɔn yerenom; Dawid abusua ne wɔn yerenom, Natan abusua ne wɔn yerenom,
౧౨దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
13 Lewi abusua ne wɔn yerenom, Simei abusua ne wɔn yerenom,
౧౩లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
14 ne mmusua a aka no nyinaa ne wɔn yerenom.
౧౪మిగిలిన అన్ని వంశాలవారు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.

< Sakaria 12 >