< Sakaria 10 >
1 Mummisa Awurade hɔ nsu asusowbere mu; ɛyɛ Awurade na ɔyɛ osu ne mu ahum. Ɔma osu tɔ ma nnipa nyinaa, ne nnɔbae nso ma obiara.
౧కడవరి వాన కాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఆకాశంలో మెరుపులు పుట్టేలా చేసేవాడు యెహోవాయే. ఆయన ప్రతి ఒక్కరి పొలంలో పంటలు పెరిగేలా సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడు.
2 Ahoni no ka nnaadaasɛm, nkɔmhyɛfo nya anisoadehu a ɛyɛ atoro; wɔde nkontomposɛm kyerɛ dae ase, wɔma awerɛkyekye kwa. Enti nnipa no nenam te sɛ nguan a wonni ɔhwɛfo na wɔhyɛ wɔn so.
౨గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.
3 “Me bo afuw nguanhwɛfo no yiye, na mɛtwe ntuanofo no aso. Na Asafo Awurade bɛhwɛ ne nguankuw a wɔyɛ Yudafi no, na wayɛ wɔn sɛ anuonyam pɔnkɔ wɔ ɔsa mu.
౩“కాపరులపై నా కోపాగ్ని మండుతున్నది. మందలో మేకలను నేను శిక్షిస్తాను” అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు. ఆయన తన మందయైన యూదా ప్రజలను దర్శించి వాళ్ళను తన యుద్ధాశ్వాలుగా మలుచుకుంటాడు.
4 Tweatibo befi Yuda mu, na ntamadan pɛe befi ne mu, ɔsa mu tadua befi Yuda mu, na sodifo nyinaa nso saa ara.
౪ఆ వంశంలో నుంచి మూలరాయి పుడుతుంది. గుడారపు మేకు, యుద్ధ ధనుస్సు వారి నుండి పుడతాయి. యుద్ధ నేర్పు గలవాడు వారిలో నుండి పుడతాడు.
5 Wɔbɛbɔ mu ayɛ sɛ dɔmmarima a wotiatia mmorɔn so dontori mu wɔ ɔko mu. Esiane sɛ Awurade ka wɔn ho no nti, wɔbɛko na wɔadi apɔnkɔsotefo no so.
౫వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.
6 “Mɛhyɛ Yudafi den na magye Yosefi no nkwa. Mede wɔn besi wɔn dedaw mu efisɛ me yam hyehye me wɔ wɔn ho. Wɔbɛyɛ te sɛ nea mempoo wɔn mpo, na mene Awurade wɔn Nyankopɔn, na megye wɔn so.
౬నేను యూదా ప్రజలను బలపరుస్తాను. యోసేపు సంతానానికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇస్తాను. నేను వారిపట్ల కనికరం చూపుతాను. నేను వారి ప్రార్థన ఆలకిస్తాను కనుక నేను వాళ్ళను నిరాకరించిన విషయం మరచిపోతారు. నేను వారి దేవుడనైన యెహోవాను,
7 Efraimfo bɛyɛ sɛ dɔmmarima, wɔn ani begye te sɛ nea wɔanom nsa. Wɔn mma behu na wɔn ani begye; wobedi ahurusi wɔ wɔn koma mu wɔ Awurade mu.
౭ఎఫ్రాయిము ప్రజలు మహా బలవంతులు అవుతారు. ద్రాక్షారసం తాగిన వాళ్ళు సంతోషం పొందినట్టు వాళ్ళు తమ హృదయాల్లో ఆనందిస్తారు. అది చూసిన వారి సంతానం ఆనందపడతారు. వాళ్ళు యెహోవా చేసిన దాన్నిబట్టి హృదయపూర్వకంగా సంతోషిస్తారు.
8 Mɛto nsa afrɛ wɔn aboaboa wɔn ano. Ampa ara megye wɔn bio; wɔbɛdɔɔso sɛ kan no.
౮నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు.
9 Ɛwɔ mu, mɛhwete wɔn mu akɔ aman so, nanso wɔbɛkae me wɔ akyirikyiri nsase so. Wɔne wɔn mma bɛtena nkwa mu, na wɔbɛsan aba.
౯నేను వాళ్ళను ఇతర దేశాలకు చెదరగొట్టినప్పటికీ వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసికొంటారు. వారూ, వారి సంతానం సజీవులుగా తిరిగి చేరుకుంటారు.
10 Mede wɔn befi Misraim aba mɛboa wɔn ano afi Asiria. Mede wɔn bɛba Gilead ne Lebanon, na wɔrensen hɔ.
౧౦నేను వాళ్ళను ఐగుప్తు దేశం నుండి తిరిగి తీసుకు వస్తాను. అష్షూరు దేశం నుండి వాళ్ళను సమకూరుస్తాను. గిలాదు, లెబానోను దేశాల్లో ఎక్కడా స్థలం చాలనంత విస్తారమైన జనాంగాన్ని తోడుకుని వస్తాను.
11 Wɔbɛfa ɔhaw ne abɛbrɛsɛ po mu, nanso wobedi po asorɔkye a ehuru no so. Nil mu nsu nyinaa bɛyow. Asiria ahomaso nso wɔbɛbrɛ no ase na Misraim ahempema betwa mu akɔ.
౧౧వాళ్ళు దుఃఖసముద్రం దాటవలసి వచ్చినప్పుడు సముద్రపు అలలు అణగారి పోతాయి. నైలునదిలోని లోతైన స్థలాలను ఆయన ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరీయుల గర్వం అణిగి పోతుంది, ఐగుప్తీయుల నుండి రాజరికం తొలిగి పోతుంది.
12 Mɛhyɛ wɔn den wɔ Awurade mu na ne din mu na wɔbɛnantew,” sɛnea Awurade se ni.
౧౨నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.