< Nnwom Mu Dwom 7 >
1 Wo nan ne mpaboa yɛ fɛ, Ɔdehye babea! Wʼanantu a wugyina so te sɛ abohemaa, odwumfo nsa ano adwuma.
౧(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి.
2 Wo funuma yɛ kuruwa a enni nsa a nsa pa wɔ mu bere biara. Wo sisi yɛ atoko a wɔaboa ano na sukooko atwa ho ahyia.
౨నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది. కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది.
3 Wo nufu te sɛ atwemma abien, atwemma nta.
౩నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.
4 Wo kɔn te sɛ asonse abantenten. Wʼaniwa aba te sɛ Hesbon ntade a ɛwɔ Bat Rabim pon nkyɛn. Wo hwene te sɛ Lebanon abantenten a ɛkyerɛ Damasko no.
౪నీ మెడ దంతగోపురంలా ఉంది. నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది.
5 Wo ti si so sɛ Karmel Bepɔw. Wo tinwi te sɛ adehyetam a wɔadi mu adwinni; wo tinwi atenten no kyere ɔhene dommum.
౫నీ తల కర్మెలు పర్వతంలా ఉంది. నీ జుట్టు ముదురు ఊదా రంగు. నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు.
6 Wo ho yɛ fɛ, ɔdɔ, wo ho yɛ anigye na ɛma ahomeka ara!
౬నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు!
7 Wo sibea te sɛ abɛ dua, na wo nufu te sɛ aduaba kasiaw.
౭నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు. నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి.
8 Mekae se, “Mɛforo abɛ dua no; na maso nʼaba mu.” Wo nufu nyɛ sɛ bobe kasiaw, na wo home mu hua nyɛ sɛ aprɛ.
౮“ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను. నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి.
9 Na wʼanom hua nyɛ sɛ bobesa papa. Ababaa: Ma bobesa no nkɔ me dɔfo hɔ tee, ɛnsen mfa nʼanofafa ne ne se no so brɛoo.
౯నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి.
10 Meyɛ me dɔfo de, na nʼapɛde ne me.
౧౦(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.
11 Bra, me dɔfo; ma yɛnkɔ akuraa, ma yɛnkɔda akuraa anadwo baako.
౧౧ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం.
12 Ma yɛnkɔ bobeturo mu ntɛm nkɔhwɛ sɛ bobe no agu nhwiren, sɛ nhwiren no apaapae, anaasɛ ntunkum no ayɛ frɔmfrɔm. Ɛhɔ na mede me dɔ bɛma wo.
౧౨పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో, వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద. అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను.
13 Adesaa yi ne hua, na akɔnnɔduan nyinaa begu yɛn pon ano, foforo ne dedaw, a mede asie ama wo, me dɔfo.
౧౩మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి. మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.