< Adiyisɛm 5 >
1 Mihuu sɛ nea ɔte ahengua so no kura nhoma bi wɔ ne nsa nifa mu. Na wɔakyerɛw akyi ne anim nyinaa a wɔde nsɔwano ason asosɔw ano.
౧అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనకా లోపలా రాసి ఉంది.
2 Mihuu ɔbɔfo hoɔdenfo bi a ɔde nne kɛse kae se, “Hena na ɔfata sɛ ɔtew nsɔwano no na obue nhoma no mu?”
౨బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను.
3 Nanso wɔannya obiara a ɔwɔ ɔsoro anaa asase so anaa asase ase a otumi buee nhoma no mu hwɛɛ mu.
౩కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.
4 Misui yiye, efisɛ wɔannya obiara a ɔfata sɛ obue nhoma no mu na ɔhwɛ mu.
౪ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
5 Afei ɔpanyin baako ka kyerɛɛ me se, “Nsu. Hwɛ! Gyata a ofi Yuda abusuakuw mu a ɔyɛ Dawid aseni adi nkonim, na obetumi atetew nsɔwano ason no na wabue nhoma no mu.”
౫అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు.
6 Afei mihuu Oguamma bi sɛ ogyina ahengua no mfimfini a ateasefo baanan no ne mpanyimfo no atwa ne ho ahyia. Wɔhwɛ a na Oguamma no sɛ nea wɔakum no. Na ɔwɔ mmɛn ason ne aniwa ason a egyina hɔ ma Onyankopɔn ahonhom ason no a wɔasoma wɔn aba wiase no.
౬సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.
7 Oguamma no kogyee nhoma no fii nea ɔte ahengua so no nsa nifa mu.
౭గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.
8 Ɔyɛɛ saa no, ateasefo baanan no ne mpanyimfo aduonu anan no butubutuw Oguamma no anim. Na wɔn mu biara kura sanku ne sika ayowa a aduhuam ayɛ no ma a ɛyɛ ahotefo mpae.
౮ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.
9 Wɔtoo dwom foforo se, “Wofata sɛ wofa nhoma no na wotew ne nsɔwano no. Efisɛ wokum wo, na ɛnam wo wu so ma wɔtɔɔ nnipa fii aman ne mmusuakuw ne nkurɔfo ne kasa nyinaa mu maa Onyankopɔn.
౯ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు.
10 Wɔayɛ wɔn asɔfo ahemman sɛ wɔnsom yɛn Nyankopɔn na wobedi asase so hene.”
౧౦మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.
11 Bio mehwɛe, na metee abɔfo mpempem nka. Na wɔatwa ahengua no ne ateasefo baanan no ne mpanyimfo no ho ahyia
౧౧ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది.
12 reto dwom dennen se, “Oguamma a wokum no no fata sɛ ogye tumi, ahonya, nyansa ne ahoɔden ne nidi ne anuonyam ne nkamfo!”
౧౨వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.
13 Na metee sɛ abɔde a wɔwɔ ɔsoro, asase so, asase ase ne abɔde biara a ɛwɔ po mu ne abɔde biara a ɛwɔ wiase nyinaa reto dwom se, “Nhyira ne nidi ne anuonyam ne tumi, nka nea ɔte ahengua no so ne Oguamma no, (aiōn )
౧౩అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను. (aiōn )
14 Abɔde anan no gyee so se, “Amen!” Na mpanyimfo no butubutuw hɔ somee.
౧౪ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.