< Nnwom 65 >

1 Wɔde ma dwonkyerɛfo. Dawid dwom. Yɛn Nyankopɔn, ayeyi retwɛn wo wɔ Sion, na yebedi yɛn bɔ a yɛahyɛ wo no so.
ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది.
2 Wo a woyɛ mpaebɔ tiefo, wo nkyɛn na nnipa nyinaa bɛba.
ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.
3 Bere a yɛn bɔne menee yɛn no, wo na wode yɛn mmarato kyɛɛ yɛn.
మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు.
4 Nhyira nka wɔn a wuyi wɔn ma wɔbɛn wo sɛ wɔntena wʼadiwo hɔ! Nneɛma pa a ɛwɔ wo fi ahyɛ yɛn ma, nea ɛwɔ wʼasɔredan kronkron mu no.
నీ ఆవరణల్లో నివసించడానికి నీవు ఎంపిక చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం అనే నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపొందుతాము.
5 Wode trenee nnwuma a ɛyɛ nwonwa ma yɛn mmuae, Onyankopɔn, yɛn agyenkwa, asase so mmaa nyinaa anidaso ne po so akyirikyiri nso.
మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతాల్లో, దూర సముద్రం మీద ఉన్న వారికందరికీ నీవే ఆశ్రయం. నీతిని బట్టి అద్భుతమైన క్రియల ద్వారా నువ్వు మాకు జవాబిస్తావు.
6 Wonam wo tumi so yɛɛ mmepɔw de daa wʼahoɔden adi.
బలాన్నే నడికట్టుగా కట్టుకుని నీ శక్తితో పర్వతాలను స్థిరపరచింది నువ్వే.
7 Wudwudwoo po asorɔkye ano, asorɔkye no mmobɔwee, ne amanaman no hooyɛ.
నువ్వే సముద్రాల హోరునూ వాటి అలల ఘోషనూ శాంతింపజేసేవాడివి. ప్రజల అల్లరిని అణిచేవాడివి.
8 Wɔn a wɔte akyirikyiri no suro wʼanwonwade; faako a ade kye, nea anwummere yera, wofrɛ ahurusi nnwom wɔ hɔ.
నీ క్రియలు జాడలను చూసి ఈ భూమి అంచుల్లో నివసించే ప్రజలు భయపడతారు. తూర్పు పడమరలు సంతోషించేలా చేసేది నువ్వే.
9 Wohwɛ asase no gugu so nsu; woma no yɛ asase pa ma ɛboro so. Wode nsu hyɛ Onyankopɔn nsuwansuwa ma sɛnea ɛbɛma nnipa no aduan, efisɛ saa ne nea woahyɛ.
నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.
10 Wofɔw nea woafuntum hɔ no fɔkyee na wokaa nkɔmoa no kataa so; wode nsu petee so ma no yɛɛ bɛtɛɛ na wuhyiraa so afifide.
౧౦దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.
11 Wode nnɔbae bebree wiee afe no, na wo nteaseɛnam yɛɛ ma buu so.
౧౧సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.
12 Sare so nwura dɔɔso na anigye baa nkoko so.
౧౨అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.
13 Nguankuw ahyɛ adidibea hɔ ma na awi akata aku no so; wɔbɔ ose, to ahosɛpɛw dwom.
౧౩గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.

< Nnwom 65 >