< Nnwom 64 >
1 Dawid dwom. Me Nyankopɔn, tie me, bere a mereka me haw; bɔ me kra ho ban fi ɔtamfo ahunahuna ho.
౧ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.
2 Fa me sie fi amumɔyɛfo agyinatu ho, ne nnebɔneyɛfo pɔwbɔ ho.
౨దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.
3 Wɔsew wɔn tɛkrɛma sɛ afoa na wɔde atirimɔden nsɛm sɔn sɛ mmɛmma werɛmfo.
౩ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.
4 Wofi ahintawee mu, tow bɔ onipa a ne ho nni asɛm; wɔtow bɔ no mpofirim a wonsuro.
౪నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.
5 Wɔhyehyɛ wɔn ho wɔn ho nkuran wɔ wɔn amumɔyɛ nhyehyɛe ho, wɔka sɛnea wobesum wɔn mfiri asie; wɔka se, “Hena na obehu yɛn?”
౫వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.
6 Wɔbɔ ntɛnkyew ho pɔw na wɔka se, “Yɛayɛ nhyehyɛe a ɛso nni koraa!” Ampa ara onipa koma ne nʼadwene yɛ anifere.
౬వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి.
7 Nanso Onyankopɔn bɛto bɛmma abɔ wɔn; na wɔbɛhwe fam prɛko pɛ.
౭దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.
8 Ɔbɛdan wɔn ankasa tɛkrɛma atia wɔn na ɔde wɔn aba ɔsɛe mu; na wɔn a wobehu wɔn nyinaa de animka bɛbɔ wɔn ti nko.
౮వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.
9 Adesamma nyinaa besuro; wɔbɛpae mu aka Onyankopɔn nnwuma na wɔasusuw nea wayɛ ho.
౯మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.
10 Ma atreneefo nni ahurusi wɔ Awurade mu na wɔmpɛ guankɔbea wɔ no mu; ma wɔn a wɔn koma mu tew nyinaa nyi no ayɛ! Wɔde ma dwonkyerɛfo.
౧౦నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.