< Nnwom 4 >
1 Dawid dwom. Sɛ misu frɛ wo a, gye me so, me trenee Nyankopɔn. Ma me ɔhome wɔ mʼahohia mu; hu me mmɔbɔ na tie me mpaebɔ.
౧ప్రధాన సంగీతకారుని కోసం, తీగవాయిద్యాలతో. దావీదు కీర్తన. నా నీతిన్యాయాలకు ఆధారమైన దేవా, నేను విజ్ఞప్తి చేసినప్పుడు నాకు జవాబివ్వు. ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత ఇవ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు.
2 Enkosi da bɛn na mobɛdan mʼanuonyam ahohora? Enkosi da bɛn na mobɛdɔ nneɛma hunu na moadi ahoni ahuhuw akyi?
౨మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు? (సెలా)
3 Hu sɛ Awurade ayi nea ɔwɔ nyamesu ama ne ho; Awurade betie, sɛ misu mefrɛ no a.
౩యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకుంటాడని తెలుసుకోండి. నేను యెహోవాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు.
4 Sɛ mo bo fuw a, monnyɛ bɔne; sɛ modeda mo mpa so a, monyɛ komm na monhwehwɛ mo koma mu.
౪భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడక మీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి. (సెలా)
5 Mommɔ afɔre a ɛfata na momfa mo werɛ nhyɛ Awurade mu.
౫నీతి సంబంధమైన బలులు అర్పించి యెహోవాలో నమ్మకం ఉంచండి.
6 Nnipa bebree bisa se: “Hena na ɔde yiyeyɛ bɛbrɛ yɛn?” Awurade, ma wʼanim hann no nhyerɛn yɛn so.
౬మాకు ఏదైనా క్షేమం కలిగించేది ఎవరు? అని అనేకమంది అంటారు. యెహోవా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశించు.
7 Fa anigye mmoroso hyɛ me koma ma bere a wɔn aburow ne nsa foforo abu so no.
౭ధాన్యం, కొత్త ద్రాక్షారసం పుష్కలంగా ఉన్న వారి ఆనందం కన్నా అధికమైన ఆనందం నువ్వు నా హృదయానికి ఇచ్చావు.
8 Mɛtɔ hɔ, na mada asomdwoe mu, efisɛ wo nko ara, Awurade, na woma metena dwoodwoo. Wɔde ma dwonkyerɛfo sɛ wɔmfa atɛntɛbɛn nto.
౮యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.