< 4 Mose 8 >
1 Awurade ka kyerɛɛ Mose se,
౧తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
2 “Ka kyerɛ Aaron se, ‘Sɛ wosɔ akanea ason a ɛwɔ kaneadua no so no a, sɔ no sɛnea ɛbɛyɛ a, ɛbɛtow ne hann no akɔ kaneadua no nʼanim.’”
౨“నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.”
3 Aaron yɛɛ saa; ɔsɔɔ akanea no ma ɛtow hann kɔɔ kaneadua no anim, sɛnea Awurade hyɛɛ Mose no.
౩అహరోను అలాగే చేశాడు. మోషేకి యెహోవా ఆజ్ఞాపించినట్టే దీపాల కాంతి ఆ ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా వాటిని వెలిగించాడు.
4 Sɛnea Wosi yɛɛ kaneadua no ni: Sikakɔkɔɔ a wɔaboro na wɔde yɛ fii nʼase kosi ne soro. Wɔyɛɛ no sɛnea Awurade kyerɛɛ Mose sɛ wɔnyɛ no ara pɛ.
౪దాని అడుగు నుండి పైన పువ్వుల వరకూ ఆ దీప స్తంభాన్ని సాగగొట్టిన బంగారంతో చేశారు. దాన్ని ఎలా చేయాలో యెహోవా మోషేకి చూపించాడు.
5 Na Awurade ka kyerɛɛ Mose se,
౫యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
6 “Yi Lewifo no fi Israelfo no mu na tew wɔn ho.
౬“ఇశ్రాయేలు ప్రజల్లోనుండి లేవీ వారిని వేరు చెయ్యి. తరువాత వారిని పవిత్రం చెయ్యి.
7 Sɛ ɛbɛyɛ a wɔn ho ni yɛ eyi: Fa ahodwira nsu pete wɔn so. Ma wonyi wɔn ho nwi nyinaa, na wɔnhoro wɔn nneɛma nyinaa, na ama wɔn ho atew.
౭వారిని పవిత్రం చేయడానికి ఇలా చెయ్యి. పరిహారం కోసం వారిపై పవిత్రజలాన్ని చిలకరించు. వారిల్లో ప్రతి ఒక్కడూ మంగలి కత్తితో తన శరీరం పై ఉన్న జుట్టు అంతటినీ నున్నగా కత్తిరించుకుని, తన బట్టలు ఉతుక్కుని, తనను పవిత్రం చేసుకోవాలి.
8 Afei, ma wɔmfa nantwinini ba ne aduan afɔrebɔde a ɛyɛ asikresiam a wɔayam no muhumuhu a wɔde ngo afra a nantwinini ba baako ka ho a wɔde no bɛbɔ bɔne ho afɔre mmra.
౮తరువాత వారు ఒక కోడెదూడను, దాని నైవేద్య అర్పణగా నూనె కలిపిన సన్నని గోదుమ పిండినీ తీసుకు రావాలి. పాపాల కోసం చేసే బలిగా మరో కోడెని తీసుకు రావాలి.
9 Frɛ Israelfo no nyinaa hyia na fa Lewifo no bra Ahyiae Ntamadan no pon ano.
౯తరువాత నువ్వు వారిని సన్నిధి గుడారం ఎదుటకి తీసుకు రావాలి. ఇశ్రాయేలు సమాజాన్నంతా సమావేశ పరచాలి.
10 Ɛhɔ na mpanyimfo a wotuatua mmusuakuw no ano no de wɔn nsa begu wɔn so.
౧౦లేవీ వారిని యెహోవా నైన నా ఎదుట నిలబెట్టు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారిపైన తమ చేతులుంచాలి.
11 Ɛsɛ sɛ Aaron yɛ nsɛnkyerɛnne bi sɛ ɔde wɔn rema Awurade sɛ akyɛde a efi Israel manfo nyinaa nkyɛn, na asiesie Lewifo no ama wɔayɛ Awurade adwuma.
౧౧లేవీ వారిని అహరోను నా ఎదుట సమర్పించాలి. ఇశ్రాయేలు ప్రజల తరపున వారిని కదలిక అర్పణగా నా ఎదుట కదిలించాలి. లేవీ వారు నాకు సేవ చేయడానికి అతడు ఈ విధంగా చేయాలి.
12 “Afei, Lewifo mpanyimfo no de wɔn nsa begu nantwimma no apampam na wɔde wɔn ama Awurade. Wɔde ɔbaako bɛbɔ bɔne ho afɔre na wɔde ɔbaako nso abɔ ɔhyew afɔre de ayɛ mpata ama Lewifo no.
౧౨లేవీ వారు ఆ కోడెదూడల తలలపై తమ చేతులుంచాలి. లేవీ వారి కోసం పరిహారం చేయడానికి పాపం కోసం అర్పణగా ఒక ఎద్దునూ దహనబలిగా మరొక ఎద్దునూ నువ్వు నాకు అర్పించాలి.
13 Afei, wɔde Lewifo no bɛma Aaron ne ne mma te sɛnea wɔde afɔrebɔde biara fa asɔfo so de ma Awurade no.”
౧౩వారిని అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా హాజరు పరచి నాకు కదలిక అర్పణగా నా ఎదుట నిలబెట్టాలి.
14 Mobɛfa saa kwan yi so ayi Lewifo no afi Israelfo no mu ama me, na wɔayɛ me dea.
౧౪ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు ప్రజల నుండి లేవీ వారిని వేరు చేయాలి. లేవీ వంశం వారు నాకు చెందిన వారుగా ఉంటారు.
15 “Sɛ motew wɔn ho na mofa saa kwan yi so de wɔn ma me a, afei, wobedi ahyɛmfiri wɔ Ahyiae Ntamadan no mu, adi wɔn dwuma.
౧౫ఇదంతా అయ్యాక లేవీ వారు సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళాలి. నువ్వు వారిని పవిత్ర పరచాలి. వారిని నాకు కదలిక అర్పణ గా నా ఎదుట వారిని ఎత్తి పట్టుకోవాలి.
16 Israelfo mu nyinaa, wɔn na wɔyɛ me nkurɔfo, na magye wɔn ato mu asi Israelfo mmakan nyinaa anan, Israelni bea biara abakan barima.
౧౬ఇలా తప్పకుండా చెయ్యి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లోనుండి వీరు సంపూర్ణంగా నా వారు. ఇశ్రాయేలు సంతానంలో గర్భం నుండి బయటకు వచ్చే ప్రతి మొదటి మగ పసికందు స్థానాన్ని వీరు తీసుకుంటారు. లేవీ వారిని నేను తీసుకున్నాను.
17 Israel abakan biara yɛ me de; nnipa ne mmoa nyinaa. Bere a mikunkum Misraimfo mmakan nyinaa no ara na mefaa wɔn de wɔn yɛɛ me nkurɔfo.
౧౭ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి మొదటి సంతానం నాదే. ఇది మనుషులకీ, పశువులకీ వర్తిస్తుంది. ఈజిప్టులో మొదటి సంతానాన్ని నేను సంహరించినప్పుడు వీరిని నాకోసం ప్రత్యేకించుకున్నాను.
18 Mafa Lewifo no asi Israelfo mmakan nyinaa anan mu.
౧౮మొదటి సంతానానికి బదులుగా నేను ఇశ్రాయేలు ప్రజల్లో నుండి లేవీ వారిని తీసుకున్నాను.
19 Na mede Lewifo no bɛkyɛ Aaron ne ne mmabarima. Lewifo no na wɔbɛyɛ Ahyiae Ntamadan no mu nnwuma kronkron a anka ɛsɛ sɛ Israelfo no na wɔyɛ, na wɔn na wɔbɛbɔ afɔre ama nkurɔfo de ayɛ mpata ama wɔn sɛnea sɛ Israelfo no kɔ kronkronbea hɔ a ɔyaredɔm biara renka wɔn.”
౧౯వారిని అహరోనుకీ అతని కొడుకులకీ ఒక బహుమానంగా ఇచ్చాను. సన్నిధి గుడారంలో ఇశ్రాయేలు ప్రజల కోసం పనిచేయడానికి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలాన్ని సమీపించినప్పుడు వాళ్లకి ఎలాంటి తెగులు హాని చేయకుండా వారి కోసం పరిహారం చేయడానికి నేను వీరిని నియమించాను.”
20 Mose ne Aaron ne Israelfo no nyinaa faa ɔkwan a Awurade kyerɛɛ Mose no so pɛpɛɛpɛ de Lewifo no maa Awurade.
౨౦అప్పుడు మోషే, అహరోనూ, ఇశ్రాయేలు సమాజమంతా అలాగే చేశారు. లేవీ వారి విషయంలో యెహోవా మోషేకి ఆదేశించింది అంతా అమలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు లేవీ వాళ్లకి ఇదంతా చేశారు.
21 Lewifo no dwiraa wɔn ho, horoo wɔn nneɛma. Na Aaron de wɔn hyɛɛ Awurade nsa sɛ ohim afɔre na ɔyɛɛ wɔn ho mpata adwuma de tew wɔn ho.
౨౧లేవీ వారు తమ బట్టలు ఉతుక్కుని పవిత్రం అయ్యారు. వారిని పవిత్రం చేయడానికి అహరోను వారిని యెహోవా ఎదుట సమర్పించి వారి కోసం పరిహారం చేశాడు.
22 Ɛno akyi no, Lewifo no kɔyɛɛ adwuma wɔ Ahyiae Ntamadan no mu a na Aaron ne ne mmabarima no hwɛ wɔn so Wɔyɛɛ biribiara sɛnea Awurade hyɛɛ Mose sɛ wɔnyɛ no.
౨౨తరువాత లేవీ వారు అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా సన్నిధి గుడారంలో తమ సేవ చేయడానికి వెళ్ళారు. లేవీ వారిని గురించి యెహోవా మోషేకి ఆదేశించిన దాని ప్రకారం ఇది జరిగింది. లేవీ వాళ్లకందరికీ ఇలాగే జరిగించారు.
23 Awurade ka kyerɛɛ Mose se,
౨౩యెహోవా తిరిగి మోషేతో మాట్లాడాడు.
24 “Eyi kɔ ma Lewifo no: Sɛ Lewini barima biara di mfe aduonu anum a, ma no nsom wɔ Ahyiae Ntamadan mu,
౨౪“ఇరవై ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న లేవీ వాళ్లందరికీ ఇలాగే చేయాలి. వారు సన్నిధి గుడారంలో సేవ చేయడం కోసం చేరాలి.
25 na sɛ wodi mfe aduonum a, ɛsɛ sɛ wɔapɔn fi adwuma mu a wɔnnyɛ adwuma bio.
౨౫అయితే వాళ్లకి యాభై ఏళ్ళు వచ్చాక ఈ విధంగా చేసే సేవ నుండి విరమించాలి. వారు అక్కడితో ఆగిపోవాలి.
26 Sɛ wɔpɔn a, wotumi adi dwuma wɔ Ahyiae Ntamadan mu hɔ de boa wɔn nuanom, mmom wɔn ankasa de, ɛnsɛ sɛ wɔhyɛ da yɛ adwuma. Eyi ne ɔkwan a momfa so mma Lewifo no adwuma nyɛ.”
౨౬సన్నిధి గుడారంలో పని చేసే తమ సోదరులకు వారు సహాయం చేయవచ్చు గానీ సేవ నుండి మానుకోవాలి. ఈ విషయాలన్నిటిలో నువ్వు వాళ్లకి మార్గ దర్శనం చేయాలి.”