< 4 Mose 32 >
1 Na Ruben ne Gad mmusuakuw no wɔ nyɛmmoa pii, enti wuhuu sɛ Yaser ne Gilead nsase no beye ama wɔn nguan ne anantwi no.
౧రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.
2 Enti wɔkɔɔ Mose ne ɔsɔfo Eleasar ne nnipa no ntuanofo no nkyɛn kɔka kyerɛɛ wɔn se,
౨వారు మోషేతో, యాజకుడు ఎలియాజరుతో సమాజ నాయకులతో
3 “Atarot, Dibon, Yaser, Nimra, Hesbon, Eleale, Sebam, Nebo ne Beon yɛ
౩“అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,
4 nsase a Awurade ako, agye ama Israelfo na eye ma yɛn nguan ne yɛn anantwi.
౪అంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోవా జయించిన దేశం పశువుల మందలకు అనువైంది. మీ సేవకులైన మాకు మందలు ఉన్నాయి.
5 Sɛ yɛanya adom wɔ mo anim a, yɛsrɛ mo momfa saa asase yi mma yɛn sɛ yɛn kyɛfa na munnyae Asubɔnten Yordan agya nohɔ a mopɛ sɛ mode ma yɛn no.”
౫కాబట్టి మా మీద మీకు దయ కలిగితే, మమ్మల్ని యొర్దాను నది దాటించవద్దు. మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి” అన్నారు.
6 Mose nso bisaa Rubenfo ne Gadfo no se, “Mokyerɛ sɛ, mopɛ sɛ motena ha bere a mo nuanom atwa mu rekɔko?
౬అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. “మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?
7 Adɛn nti na mopɛ sɛ mubu Israelfo no aba mu ma wɔsan sɛ wɔrenkɔ asase a Awurade de ama wɔn no so no?
౭యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశానికి వెళ్ళకుండా మీరు వారి హృదయాలను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు?
8 Ade koro yi ara na mo agyanom yɛe. Mesomaa wɔn fii Kades-Barnea sɛ wɔnkɔsra asase no.
౮ఆ దేశాన్ని చూసి రావడానికి కాదేషు బర్నేయలో నేను మీ తండ్రులను పంపినప్పుడు వారు కూడా ఇలాగే చేశారు కదా.
9 Wowiee nsra no na wofi Eskol subon mu bae no, wobuu nnipa no aba mu sɛ wɔnnkɔ asase a Awurade de ama wɔn no so.
౯వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి ఆ దేశాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపరిచారు కాబట్టి యెహోవా తమకిచ్చిన దేశంలో ప్రవేశించలేకపోయారు.
10 Da no Awurade abufuw sɔree na ɔkaa saa ntam yi:
౧౦ఆ రోజు యెహోవా కోపం తెచ్చుకున్నాడు.
11 ‘Esiane sɛ wɔamfi wɔn koma nyinaa mu anni mʼakyi nti wɔn mu biara nni hɔ a bere a wɔrefi Misraim no a na wadi mfe aduonu anaa nea ɛboro saa a no behu asase a mehyɛɛ Abraham, Isak ne Yakob ho bɔ no,
౧౧ఇరవై సంవత్సరాలకు మించి, ఐగుప్తుదేశం నుండి వచ్చిన మనుషుల్లో యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన కెనెజీయుడు, యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప
12 ɔbaako mpo nni hɔ, gye Kenesini Yefune babarima Kaleb ne Nun babarima Yosua, efisɛ wɔde wɔn koma nyinaa dii Awurade akyi, hyɛɛ nnipa nkuran sɛ wɔnkɔ Bɔhyɛ Asase no so.’
౧౨మరి ఎవ్వడూ పూర్ణమనస్సుతో నన్ను అనుసరించలేదు కాబట్టి నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని మరి ఎవరూ చూడనే చూడరు, అని శపథం చేశాడు.
13 Awurade maa yekyinkyin sare no so hɔ mfirihyia aduanan kosii sɛ saa awo ntoatoaso amumɔyɛfo no nyinaa wuwui.
౧౩అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవడం వల్ల ఆయన దృష్ఠికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకూ వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు.
14 “Nanso monhwɛ, abɔnefo, moregyina mo agyanom anan mu ama Awurade bo afuw Israel nea ɛkyɛn so.
౧౪ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు మరింత కోపం పుట్టించేలా ఆ పాపుల పిల్లలైన మీరు వారి స్థానంలో బయలుదేరారు.
15 Sɛ mosan fi nʼakyi a, ɔbɛsan agyaw ne nnipa no nyinaa wɔ sare so hɔ na wɔn sɛe no befi mo.”
౧౫మీరు ఆయన్ని అనుసరించకుండా వెనక్కి తగ్గిపోతే ఆయన ఈ ప్రజలందరినీ ఈ అడవిలోనే నిలిపివేస్తాడు. ఆ విధంగా మీరు ఈ ప్రజలందరి నాశనానికి కారకులౌతారు.”
16 Wɔteɛɛ mu se, “Ɛnte saa koraa! Yɛbɛyɛ yɛn nguannan na yɛakyekyere nkurow akɛse ama yɛn mmea ne mmofra.
౧౬అందుకు వారు అతనితో “మేము ఇక్కడ మా పశువుల కోసం దొడ్లూ, మా పిల్లల కోసం ఊరులూ కట్టుకుంటాం.
17 Na yɛn ankasa de akode bɛhyehyɛ yɛn ho adi Israelfo a wɔaka no anim akosi sɛ yɛde wɔn bɛba asomdwoe mu ama wɔabɛfa wɔn agyapade. Na nea edi kan no, ɛsɛ sɛ yɛkyekye nkurow a yebegye afasu afa ho ama yɛn nkurɔfo atena mu na ɛhɔfo no ankɔtow anhyɛ wɔn so.
౧౭ఇశ్రాయేలు ప్రజలను వారివారి స్థలాలకు చేర్చే వరకూ మేము యుద్ధానికి సిద్ధపడి వారి ముందు సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ ప్రాంత ప్రజల భయం వలన ప్రాకారాలున్న ఊర్లలో నివసించాలి.
18 Sɛ Israelfo no nyinaa nsa nkaa wɔn agyapade no a, yɛrensan mma yɛn afi mu.
౧౮ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడూ తన తన వారసత్వాన్ని పొందేవరకూ మా ఇళ్ళకు తిరిగి రాము.
19 Yɛne wɔn renkyɛ Yordan agya hɔ asase biara, efisɛ yɛanya yɛn agyapade no wɔ Yordan apuei fam hɔ.”
౧౯తూర్పున యొర్దాను ఇవతల మాకు వారసత్వం దొరికింది కాబట్టి ఇక యొర్దాను అవతల వారితో వారసత్వం అడగం” అన్నారు.
20 Mose kae se, “Sɛ mobɛyɛ sɛnea moaka no, sɛ mobɛhyehyɛ mo ho wɔ Awurade anim ama ɔko,
౨౦అప్పుడు మోషే వారితో “మీరు మీ మాట మీద నిలబడి యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి యెహోవా తన ఎదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టే వరకూ
21 na mode mo asraafo no atwa Yordan kosi sɛ Awurade bɛpam nʼatamfo no,
౨౧యెహోవా సన్నిధిలో మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళి
22 na sɛ asase no ho asɛm dwo brɛoo wɔ Awurade anim a, ɛno de mutumi san ba. Ɛba saa a, na ɛkyerɛ sɛ, moayɛ mo asɛde ama Awurade ne Israelfo nyinaa. Na asase a ɛda apuei no nso, Awurade de bɛma mo.
౨౨ఆ దేశాన్ని జయించిన తరవాత మీరు తిరిగి రావచ్చు. మీరు యెహోవా దృష్టికీ ఇశ్రాయేలీయుల దృష్టికీ నిర్దోషులుగా ఉంటారు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిలో మీకు వారసత్వం అవుతుంది.
23 “Sɛ moanni asɛm a moaka no so a, na moayɛ bɔne atia Awurade, munhu sɛ, ɛho asotwe bɛba mo so.
౨౩మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.
24 Monkɔ so nkyekyere nkurow mma mo fifo na monyɛ nguannan mma mo nguan na munni asɛm a mokae no nyinaa so.”
౨౪మీరు మీ పిల్లల కోసం ఊర్లను, మీ పశువుల కోసం దొడ్లను కట్టుకుని మీరు చెప్పిన ప్రకారం చేయండి అన్నాడు.”
25 Ruben ne Gad nkurɔfo no kae se, “Yebedi wʼahyɛde no so pɛpɛɛpɛ.
౨౫అందుకు గాదీయులు, రూబేనీయులు మోషేతో “మా యజమానివి నువ్వు ఆజ్ఞాపించినట్టు నీ సేవకులైన మేము చేస్తాం.
26 Yɛn mma, yɛn yerenom, yɛn nguan ne yɛn anantwi bɛtena Gilead nkuropɔn mu.
౨౬మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు.
27 Nanso yɛn a wɔakyere yɛn sɛ asraafo no bɛko ama Awurade sɛnea woaka no.”
౨౭నీ సేవకులైన మేము, అంటే మా సైన్యంలో ప్రతి యోధుడు మా యజమానివి నువ్వు చెప్పినట్టు యెహోవా సన్నిధిలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తాము” అన్నారు.
28 Enti Mose penee so ka kyerɛɛ Eleasar, Yosua ne mpanyimfo a wotuatua Israel mmusuakuw ano no se,
౨౮కాబట్టి మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడు యెహోషువకు, ఇశ్రాయేలు గోత్రాల్లో పూర్వీకుల వంశాల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు,
29 “Sɛ Gad ne Ruben abusuakuw mu mmarima nyinaa a wɔakyere wɔn ayɛ wɔn asraafo sɛ wɔnkɔko mma Awurade no ne me kɔ Yordan na sɛ wɔkɔko di nkonim wɔ hɔ a, momfa Gilead asase no mma wɔn;
౨౯“గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్దపడి మీతో కూడా యొర్దాను అవతలికి వస్తే, ఆ దేశాన్ని మీరు జయించిన తరవాత మీరు గిలాదు దేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
30 na sɛ wɔankɔ a, ɛno de, wɔmpene so mfa nsase a mowɔ wɔ Kanaan asase so no bi.”
౩౦కాని వారు యుద్ధానికి సిద్ధపడి మీతో కలిసి అవతలకి రాకపోతే వారు కనాను దేశంలో మీ మధ్యనే వారసత్వం పొందుతారు”
31 Gad ne Ruben abusuafo kaa bio se, “Wo nkoa bedi Awurade asɛm so;
౩౧దానికి గాదీయులు, రూబేనీయులు “యెహోవా నీ సేవకులైన మాతో చెప్పినట్టే చేస్తాం.
32 yɛde akode bɛhyehyɛ yɛn ho adi Awurade akyi akɔ Kanaan, nanso yɛn ara yɛn asase bɛda Yordan fa ha.”
౩౨మేము యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం” అని జవాబిచ్చారు.
33 Enti Mose ma wɔde Amorihene Sihon ne Basanhene Og nsasetam ne wɔn nkurow akɛse maa Gad, Ruben ne Yosef babarima Manase mmusuakuw.
౩౩అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.
34 Gad nkurɔfo na wɔkyekyeree saa nkurow yi: Dibon, Atarot, Aroer.
౩౪గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను,
35 Atrot-Sofan, Yaser Yogbeha,
౩౫యాజెరు, యొగ్బెహ, బేత్నిమ్రా, బేత్హారాను
36 Bet-Nimra ne Betharan. Na ɛyɛ nkurow a nguan wɔ mu yiye.
౩౬అనే ఊళ్ళలో ప్రాకారాలు, పశువుల దొడ్లు కట్టుకున్నారు.
37 Ruben mmabarima na wɔkyekyeree saa nkurow a edidi so yi: Hesbon, Eleale ne Kiriataim,
౩౭రూబేనీయులు హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నెబో, బయల్మెయోను,
38 Nebo, Baal-Meon a akyiri no wɔsesaa wɔn din, ne Sibma. Wɔtotoo nkurow a wɔsan kyekyee no din.
౩౮షిబ్మా అనే ఊళ్లు కట్టి, వాటికి కొత్త పేర్లు పెట్టారు.
39 Makir asefo a wofi Manase abusuakuw mu kɔɔ Gilead kɔko dii hɔ so pam Amorifo a saa bere no na wɔte hɔ no nyinaa.
౩౯మనష్షే సంతానం అయిన మాకీరీయులు గిలాదుపై దండెత్తి దాన్ని ఆక్రమించి దానిలోని అమోరీయులను వెళ్లగొట్టారు.
40 Enti Mose de Gilead maa Makirfo a wɔyɛ Manase asefo no, ma wɔtenaa hɔ.
౪౦మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.
41 Manase abusuakuw mu nnipa foforo bi a wofi Yair nso tenatenaa Gilead nkurow bebree so, sesaa beae a wɔwɔ hɔ no din frɛɛ hɔ Hafrotyair.
౪౧అతని సంతానం అక్కడ నివసించింది. మనష్షే కొడుకు యాయీరు వెళ్లి అక్కడి గ్రామాలను ఆక్రమించి వాటికి యాయీరు గ్రామాలు అని పేరు పెట్టాడు.
42 Ɔbarima bi a ne din de Noba dii asraafo bi anim de wɔn kɔɔ Kenat ne ne nkuraase kɔbɔɔ wɔn atenae wɔ hɔ enti ɔde ne din Noba too saa beae hɔ.
౪౨నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామాలను ఆక్రమించి దానికి నోబహు అని తన పేరు పెట్టాడు.