< Nahum 2 >

1 Ɔtamfo reba wo so, Ninewe bɔ aban no ho ban, wɛn ɔkwan no, bɔ wo ho so na boa wʼahoɔden nyinaa ano!
నీనెవే పట్టణమా, నాశనకారుడు నీ మీదికి వస్తున్నాడు. నీ కోటలకు, దారుల వెంబడి కాపలా ఉంచుకో. నడుం బిగించుకుని తీవ్రంగా ఎదిరించు.
2 Awurade de Yakob anuonyam bɛsan ama no te sɛ Israel de no, ɛwɔ mu sɛ, asɛefo no ama ada mpan na wɔasɛe ne bobe mfuw.
దోపిడీ దారులు యాకోబు సంతతి వారిని దోచుకున్నా వాళ్ళ ద్రాక్ష తోటలను నరికివేసినా ఇశ్రాయేలీయుల వైభవం వలే యెహోవా యాకోబు సంతతి వారికి పూర్వ వైభవం తిరిగి కల్పిస్తాడు.
3 Asraafo no nkatabo yɛ kɔkɔɔ; akofo no hyehyɛ ɔkɔben akotade. Nnade a wɔde yɛɛ nteaseɛnam no twa yerɛw yerɛw sɛ da a wɔyɛɛ no; mpeaw a wɔapema wɔ nnua so no rehim.
ఆయన శూరుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. పరాక్రమశాలురు ఎర్రని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు, వ్యూహాలు పన్నే రోజున ఆయన సైన్యం, రథాలు మెరుగు పెట్టిన ఉక్కులాగా మెరిసిపోతున్నాయి. సరళవృక్షం కలపతో చేసిన ఈటెలను వీరులు అటూ ఇటూ ఊపుతున్నారు.
4 Nteaseɛnam no twiw fa mmɔnten so, na wodi akɔneaba. Wɔte sɛ ogyatɛn a ɛredɛw; wɔbɔ yerɛdɛ te sɛ anyinam.
వీధుల్లో రథాలు అతి వేగంగా పరుగులు పెడుతున్నాయి. రాజ వీధుల్లో రథాలు ఒక దానిపై ఒకటి పడేంత వేగంగా పరుగెత్తుతున్నాయి, అవి దివిటీల్లాగా కనిపిస్తున్నాయి. మెరుపుల్లాగా వేగంగా వెళ్తున్నాయి.
5 Ɔfrɛfrɛɛ nʼakofo a wodi mu, nanso wohintihintiw wɔ ɔkwan mu. Wɔde mmirika kɔ kuropɔn no afasu ho; na wɔyɛ wɔn nkataanim krado.
మిమ్మల్ని ముక్కలుచెక్కలు చేసే వాడు తన పరాక్రమశాలురను పిలిపిస్తున్నాడు. వాళ్ళు రహదారుల్లో పరుగులు పెడుతూ తొట్రుపడతారు. ప్రాకారం దగ్గరికి పరుగెత్తి వచ్చి దాడి చేసే వారి భద్రత కోసం ఏర్పాట్లు చేస్తారు.
6 Wobuebue asubɔnten apon no, na ahemfi no dwiriw gu fam.
నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది.
7 Wɔhyɛ mmaraden sɛ wɔmfa kuropɔn no nnommum na wɔmfa wɔn nkɔ. Ne mfenaa de wɔn nsa gu wɔn koko so su te sɛ mmorɔnoma.
రాణిని నగ్నంగా చేసి ఈడ్చుకుపోతున్నారు. ఆమె దాసీలు గువ్వల్లాగా మూలుగుతున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారు.
8 Ninewe te sɛ ɔtare a mu nsu resen kɔ. Wɔteɛ mu se, “Munnyina hɔ! Munnyina hɔ!” Nanso, obiara ansan nʼakyi.
నీనెవె పట్టణం నిర్మాణమైనప్పటి నుండి నీటికొలనులాగా ఉంది. ఆ పట్టణ ప్రజలు పారిపోతున్నారు. ఆగండి, ఆగండి అని పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూసేవాడు ఒక్కడు కూడా లేడు.
9 Momfom dwetɛ no! Momfom sikakɔkɔɔ no! Ahonyade a ɛwɔ adekoradan mu nyinaa! Na ahonyade no dɔɔso.
అది లెక్కలేనన్ని వివిధ విచిత్ర ఆభరణాలతో నిండి ఉంది. వెండి కొల్లగొట్టండి, బంగారం కొల్లగొట్టండి.
10 Wɔabɔ Ninewe korɔn, wɔayɛ no pasaa! Koma botow, na nkotodwe wosowosow, nnipa ho popo na wɔn anim hoa.
౧౦అది ఏమీ లేకుండా ఖాళీగా, పాడుబడిపోతుంది. ప్రజల గుండెలు నీరైపోతున్నాయి. వాళ్ళ మోకాళ్లు వణకుతున్నాయి, అందరిలో వేదన ఉంది. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి.
11 Mprempren he na gyata buw no wɔ, faako a wɔma wɔn mma aduan no, faako a gyatanini ne gyatabere kɔe na wɔn mma nso kɔ a wonsuro?
౧౧సింహాల గుహ ఏమయింది? సింహపు పిల్లల మేత మేసే స్థలం ఏమయింది? ఎవరి భయం లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరిగిన స్థలం ఏమయింది?
12 Gyata akum nea ɛbɛmee ne mma. Wabobɔ hanam ama gyatabere no. Ɔde nea wakum ahyɛ ne bon ma na ɔde hanam ahyɛ nʼatu amaama.
౧౨తన పిల్లలకు కావలసినంత తిండి సమకూరుస్తూ, ఆడ సింహాలకు కావలసినంత ఎర కడుపారా నింపుతూ, తన గుహలను, నివాసాలను వేటాడి తెచ్చిన మాంసంతో నింపిన సింహం ఏమైయింది?
13 “Me ne wo nka,” sɛnea Asafo Awurade se ni, “Mɛhyew wo nteaseɛnam na adan wusiw na afoa bekunkum wo gyatamma. Merennyaw wo hanam biara wɔ asase so. Wɔrente wʼasomafo no nne bio.”
౧౩సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు, నేను నీకు విరోధిని. నీ రథాలను వాటి పొగ పైకి ఎగబ్రాకేలా కాల్చివేస్తాను. సింహం పిల్లలు నీ కత్తి వేటుకు గురౌతాయి. నీకు ఏమీ దొరకకుండా నీకు చెందినదంతా భూమిలో నుండి తీసివేస్తాను. నీ వార్తాహరుల స్వరం ఇకపై వినబడకుండా చేస్తాను.

< Nahum 2 >