< Mika 6 >

1 Muntie asɛm a Awurade reka: “Monsɔre na mommɔ mo nkuro wɔ mmepɔw no anim; momma nkoko nte nea mowɔ ka.
యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. నీ స్వరం కొండలు వినాలి.
2 “Na afei, mmepɔw, muntie Awurade sobo; tie, asase nnyinaso a ɛwɔ hɔ daa. Na Awurade wɔ asɛm a etia ne nkurɔfo; ɔrebɔ Israel sobo.
పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.
3 “Me nkurɔfo, dɛn na mayɛ mo? Mede adesoa bi asoa mo? Mummua me!
నా ప్రజలారా, నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి.
4 Miyii mo fii Misraim migyee mo fii nkoasom asase so. Mesomaa Mose bedii mo anim, Aaron ne Miriam nso.
ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.
5 Me nkurɔfo, monkae afotu a Moabhene Balak mae ne mmuae a Beor babarima Balaam mae. Monkae mo kwan a mutu fii Sitim kɔɔ Gilgal, na munhu Awurade akwantrenee.”
నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి.
6 Dɛn na memfa mmra Awurade anim mmɛkotow ɔsorosoro Onyankopɔn no? Memfa nantwimma a wadi afe mmɛbɔ ɔhyew afɔre wɔ nʼanim ana?
యెహోవాకు నేనేం తీసుకురాను? మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?
7 Awurade ani bɛsɔ adwennini mpempem ne ngodua mu ngo asuten mpem du ana? Memfa mʼabakan mmɔ me bɔne ho afɔre, anaa me yafunumma, me kra bɔne nti?
వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా? నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?
8 Ɔde nea eye akyerɛ wo, Ao onipa. Na dɛn na Awurade hwehwɛ afi wo hɔ? Yɛ adetrenee ne mmɔborɔhunu, na wo ne wo Nyankopɔn nnantew ahobrɛase mu.
మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. ఆయన నిన్ను కోరేదేంటంటే, న్యాయంగా ప్రవర్తించు. కనికరాన్ని ప్రేమించు. వినయంగా నీ దేవునితో నడువు.
9 Muntie! Awurade refrɛ kuropɔn no, Wo din suro yɛ nyansahu, “Muntie abaa no ne nea Ɔmaa no tumi no.
వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. “బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి.
10 Mo amumɔyɛfo, menkɔ so mma me werɛ mfi mo ahonya a monam asisi so apɛ, ne nkontompo susukoraa a ɛde nnome ba no ana?
౧౦దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.
11 Minnyae onipa a okura nsania a wɔamia mu, ne asisi nkaribo na ɔmfa ne ho nni ana?
౧౧తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?
12 Adefo a wɔwɔ mo mu no di akakabensɛm; mo nkurɔfo no yɛ atorofo na wɔn tɛkrɛma ka nnaadaasɛm.
౧౨ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. అక్కడి ప్రజలు అబద్దికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.
13 Ɛno nti, mafi ase resɛe mo, Mo bɔne ahorow nti, mɛsɛe mo.
౧౩కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను. నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.
14 Mubedidi, nanso moremmee; ɔkɔm bɛkɔ so ade mo. Mobɛboaboa ano, nanso ɛrenkosi hwee, efisɛ mede nea moakora no bɛma afoa.
౧౪నువ్వు తింటావు కానీ తృప్తి పడవు. నీలోపల వెలితిగానే ఉంటుంది. నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు. నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను.
15 Mubedua nanso morentwa. Mubekyi ngodua mu ngo, nanso morensra bi, mubetiatia bobe so, nanso morennom nsa a mubenya afi mu no bi.
౧౫నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు కానీ ఆ నూనె పూసుకోవు. ద్రాక్షపళ్ళను తొక్కుతావు కానీ ద్రాక్షారసం తాగవు.
16 Moadi Omri mmara so. Moayɛ nea wɔyɛɛ wɔ Ahab fi. Moasua wɔn nneyɛe no bi, ɛno nti mɛma ɔsɛe aba mo so. Wɔbɛserew mo nkurɔfo; na amanaman bebu mo animtiaa.”
౧౬ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు. అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు. వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను. దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”

< Mika 6 >