< Yosua 6 >

1 Wɔtotoo Yeriko apon mu papee, efisɛ na wosuro Israelfo no. Wɔamma obiara kwan ma wankɔ mu anaa wamfi adi.
ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.
2 Awurade ka kyerɛɛ Yosua se, “Mede Yeriko, ɛhɔ hene ne ɛhɔ akofo nyinaa ahyɛ wo nsa.
అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను.
3 Ma wo nsraadɔm no nyinaa mmɔ nsra ntwa kuropɔn no ho nhyia pɛnkoro da biara nnansia.
మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి.
4 Asɔfo baason a wokurakura adwennini mmɛn abɛn bedi Adaka no anim. Da a ɛto so ason no, ɛsɛ sɛ mobɔ nsra twa kuropɔn no ho mpɛn ason, a asɔfo no rehyɛn mmɛn no.
అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి.
5 Sɛ mote sɛ asɔfo no hyɛn mmɛn no denneennen ma ɛkyɛ a, nnipa no nyinaa mmɔ nnye so. Afei kuropɔn no afasu nyinaa bedwiriw agu fam, na nnipa no betumi atow ahyɛ kuropɔn no so.”
మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు.
6 Na Yosua frɛɛ asɔfo no ka kyerɛɛ wɔn se, “Momfa Apam Adaka no na mo mu baason nni anim a wokurakura mmɛn.”
నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు.
7 Enti, ɔhyɛɛ nnipa no se, “Mommɔ nsra mfa kuropɔn no ho na wɔn a wokurakura akode no bedi Awurade adaka no anim.”
తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు.
8 Yosua kasa kyerɛɛ nnipa no wiei no, asɔfo baason a wokurakura mmɛn no fii ase bɔɔ nsra wɔ Awurade anim a wɔrehyɛn mmɛn no. Na asɔfo a wɔso Awurade Apam Adaka no dii wɔn akyi.
యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది.
9 Wɔn a wokurakura akode no bi bɔɔ nsra wɔ asɔfo no a wɔrehyɛn mmɛn no anim, na bi nso bɔɔ nsra wɔ asɔfo a wɔso Adaka no akyi, bere a asɔfo no gu so rehyɛn mmɛn no.
యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు.
10 Yosua hyɛe se, “Monnteɛ mu na monnkasa mpo. Mommma asɛm biara mfi mo anum, kosi sɛ mɛka akyerɛ mo se monteɛ mu na moateɛ mu.”
౧౦యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు.
11 Enti, da no, wɔsoaa Awurade Adaka no twaa kuropɔn no ho pɛnkoro. Na afei obiara san kɔɔ atenae hɔ kɔhomee anadwo no.
౧౧ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు.
12 Ade kyee no Yosua sɔree anɔpahema, na asɔfo no soaa Awurade Adaka no bio.
౧౨యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు.
13 Asɔfo baason a wokurakura adwennimmɛn mmɛn no bɔɔ nsra wɔ Awurade Adaka no anim, a wɔrehyɛn wɔn mmɛn. Wɔn a wokurakura akode no bi nso bɔɔ nsra wɔ asɔfo a wokurakura mmɛn no anim ne Awurade Adaka no akyi. Saa bere no nyinaa na asɔfo no rehyɛn wɔn mmɛn no.
౧౩ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు.
14 Da a ɛto so abien no, wɔbɔɔ nsra twaa kuropɔn no ho pɛnkoro, na wɔsan kɔɔ atenae hɔ. Wɔkɔɔ so yɛɛ saa ara nnansia.
౧౪ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.
15 Da a ɛto so ason no, Israelfo no sɔree anɔpahema, bɔɔ nsra twaa kuropɔn no ho hyiae, sɛnea wɔayɛ dedaw no. Nanso, saa bere yi de, wɔbɔɔ nsra twaa kuropɔn no ho mpɛn ason.
౧౫ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు.
16 Ne mpɛn ason so no, bere a asɔfo no hyɛn wɔn mmɛn denneennen ma ɛkyɛe no, Yosua hyɛɛ ɔmanfo no se, “Monteɛteɛ mu! Na Awurade de kuropɔn no ama mo!
౧౬ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”
17 Kuropɔn no ne emu nneɛma no, ɛsɛ sɛ mosɛe ne nyinaa sɛ afɔrebɔde ma Awurade. Oguamanfo Rahab ne ne fifo nko na ɛsɛ sɛ wogyaw wɔn, efisɛ ɔbɔɔ akwansrafo no ho ban.
౧౭“ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు.
18 Mommmfa nneɛma a ɛsɛ sɛ wɔsɛe no no mu biara, sɛ mofa a, mo ankasa na wɔbɛsɛe mo korakora na mode ɔhaw bɛbrɛ Israel nyinaa.
౧౮శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు.
19 Biribiara a wɔde dwetɛ, sikakɔkɔɔ, kɔbere mfrafrae anaa dade ayɛ no yɛ kronkron ma Awurade, enti ɛsɛ sɛ wɔde ba nʼadekorabea hɔ.”
౧౯వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.”
20 Bere a nnipa no tee mmɛn no nnyigyei no, wɔteɛteɛɛ mu denneennen sɛnea wobetumi. Prɛko pɛ Yeriko afasu no dwiriw guu fam maa Israelfo no fi afanan nyinaa tow hyɛɛ kuropɔn no so na wɔfae.
౨౦యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.
21 Wɔsɛee biribiara a ɛwɔ kuropɔn no mu pasaa, mmarima ne mmea, mmofra ne mpanyin, anantwi, nguan, mfurum ne biribiara.
౨౧వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు.
22 Afei, Yosua ka kyerɛɛ akwansrafo baanu no se, “Munni mo bɔhyɛ no so. Monkɔ oguamanfo no fi na monkɔfa no ne nʼabusuafo nyinaa mmra.”
౨౨అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు.
23 Mmerante no kɔfaa Rahab, nʼagya, ne na, ne nuabarimanom ne abusuafo a na wɔwɔ ne nkyɛn no nyinaa bae. Wɔde abusuafo no nyinaa kosiee baabi a ɔhaw biara nni hɔ na ɛbɛn Israelfo atenae.
౨౩వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు.
24 Afei, Israelfo no hyew kuropɔn no ne emu nneɛma nyinaa. Nneɛma a wɔanhyew no yɛ nea wɔde dwetɛ, sikakɔkɔɔ, kɔbere mfrafrae anaa dade ayɛ. Wɔde ne nyinaa kosiee Awurade fi adekoradan mu.
౨౪తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్నవాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు.
25 Enti, Yosua amfa ne nsa anka oguamanfo Rahab ne nʼabusuafo a na wɔka ne ho wɔ fie no, efisɛ ɔde akwansrafo a Yosua somaa wɔn Yeriko no siei. Enti ɔte Israelfo mu besi nnɛ.
౨౫రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది.
26 Saa bere no, Yosua kaa saa nnome nsɛm yi: “Awurade nnome mmra obiara a ɔyɛ nʼadwene sɛ ɔbɛkyekyere Yeriko kuropɔn no bio. “Ɔde nʼabakan na ebefi ase, na ɔde nʼakumaa na ebesisi ano apon.”
౨౬అప్పుడు యెహోషువ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి వారికిలా ఆజ్ఞాపించాడు “ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేసిన వాడి పెద్దకొడుకు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టినపుడు వాడి చిన్నకొడుకు మరణిస్తాడు.”
27 Na Awurade kaa Yosua ho na ne din hyetaa asase no so nyinaa.
౨౭యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.

< Yosua 6 >