< Hiob 42 >

1 Na Hiob buaa Awurade se,
అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు.
2 “Minim sɛ wutumi yɛ nneɛma nyinaa; obiara rentumi nsɛe wo nhyehyɛe.
నువ్వు సమస్త క్రియలను చేయగలవనీ నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదనీ నేనిప్పుడు తెలుసుకున్నాను.
3 Wubisa se, ‘Hena ni a onni nimdeɛ nso osiw mʼafotu ho kwan?’ Ampa ara mekaa nneɛma a mente ase no ho nsɛm, nneɛma a ɛyɛ nwonwa ma me.
“జ్ఞానం లేని మాటలతో ఆలోచనను నిరర్థకం చేసే వీడెవడు?” అలా వివేచన లేక ఏమీ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను.
4 “Wokae se, ‘Tie na menkasa; mebisa wo nsɛm na ɛsɛ sɛ woma me mmuae.’
నువ్వు అన్నావు. “నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను. దాన్ని నాకు తెలియజెప్పు.”
5 Mate wo nka pɛn, na mprempren de, mʼani ahu wo.
నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను.
6 Ɛno nti mibu me ho animtiaa na mete mfutuma ne nsõ mu de kyerɛ mʼahonu.”
కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని, ధూళిలో, బూడిదెలో, పడి పశ్చాత్తాపపడుతున్నాను.
7 Na Awurade kaa nsɛm yi kyerɛɛ Hiob wiei no, Awurade ka kyerɛɛ Temanni Elifas se, “Me bo afuw wo ne wo nnamfonom baanu no, efisɛ moanka me ho asɛm a ɛyɛ nokware sɛnea me somfo Hiob kae no.
యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడు ఎలీఫజుతో ఇలా చెప్పాడు. “నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపం నీ మీదా నీ ఇద్దరు స్నేహితుల మీదా మండుతున్నది.
8 Afei, momfa anantwi ason ne adwennini ason, na monkɔ me somfo Hiob nkyɛn, na monkɔbɔ ɔhyew afɔre mma mo ho. Me somfo Hiob bɛbɔ mpae ama mo, na metie ne mpaebɔ no na merenyɛ mo sɛnea ɛfata mo nkwaseasɛm no, nsɛm a moka faa me ho no nyɛ nokware sɛnea me somfo Hiob yɛe no.”
కాబట్టి ఏడు ఎద్దులను ఏడు పొట్టేళ్లను తీసుకుని, నా సేవకుడు యోబు దగ్గరికి పోయి మీ నిమిత్తం దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడు యోబు మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. మీ అవివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించకుండా నేను అతని ప్రార్థన మాత్రం అంగీకరిస్తాను. ఎందుకంటే నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలక లేదు.”
9 Enti Temanni Elifas ne Suhini Bildad ne Naamani Sofar yɛɛ sɛnea Awurade hyɛɛ wɔn no; na Awurade tiee Hiob mpaebɔ.
తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. యెహోవా వారి పక్షాన యోబును అంగీకరించాడు.
10 Hiob bɔɔ mpae maa ne nnamfonom akyi no, Awurade san yɛɛ no ɔdefo bio na ɔde nʼahode a na ɔwɔ kan no mmɔho abien maa no.
౧౦యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి దయచేశాడు. యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు.
11 Afei, ne nuabarimanom, ne nuabeanom nyinaa ne obiara a na onim no dedaw no baa ne fi ne no bedidii. Wɔkyekyee ne werɛ wɔ amanehunu a Awurade ma ɔkɔɔ mu no ho, na wɔn mu biara brɛɛ no dwetɛ ne sikakɔkɔɔ kaa.
౧౧అప్పుడు అతని అన్నదమ్ములు, అతని అక్క చెల్లెళ్ళు అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వారంతా వచ్చి, అతనితో కలిసి అతని ఇంట్లో భోజనాలు చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధలన్నిటి గూర్చి ఎంత కష్టాల పాలయ్యావు అంటూ అతని కోసం దుఃఖిస్తూ అతణ్ణి ఓదార్చారు. అంతేగాక ఒక్కొక్కడు ఒక వెండి నాణెం, బంగారు ఉంగరం అతనికి ఇచ్చారు.
12 Awurade hyiraa Hiob nkwa awiei sen ne mfiase. Onyaa nguan mpem dunan, yoma mpem asia, anantwinini mpamho apem ne mfurum abere apem.
౧౨యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, వెయ్యి జతల ఎడ్లు, వెయ్యి ఆడగాడిదలు ఉన్నాయి.
13 Bio onyaa mmabarima baason ne mmabea baasa.
౧౩అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు పుట్టారు.
14 Ɔtoo ne babea piesie no din Yemima, na nea odi so no Kesia na nea ɔto so abiɛsa no de Keren-Hapuk.
౧౪అతడు పెద్ద కూతురికి ఎమీమా అనీ రెండవ కూతురికి కెజీయా అనీ మూడవ కూతురికి కెరెన్ హపుక్ అనీ పేర్లు పెట్టాడు.
15 Asase no so nyinaa, na mmaa biara nni hɔ a wɔn ho yɛ fɛ sɛ Hiob mmabea no, na wɔn agya de wɔn kaa wɔn nuabarimanom no ho maa wɔn agyapade.
౧౫ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత లావణ్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వాలు ఇచ్చాడు.
16 Eyi akyi no, Hiob dii mfirihyia ɔha aduanan; ohuu ne mma ne ne nenanom awo ntoatoaso anan.
౧౬ఆ పైన యోబు నూట నలభై సంవత్సరాలు బతికి, తన కొడుకులను, మనవళ్ళను నాలుగు తరాల వరకూ చూశాడు.
17 Afei owui a na wabɔ akwakoraa pa ara.
౧౭తరువాత యోబు కాలం నిండిన వృద్ధుడై తనువు చాలించాడు.

< Hiob 42 >