< Hiob 21 >

1 Na Hiob buae se,
అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.
2 Muntie me nsɛm no yiye. Momma eyi nyɛ awerɛkyekye a mode ma me.
మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు.
3 Munnya ntoboase mma me bere a merekasa, na sɛ mekasa wie a, monkɔ so nni fɛw.
నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో.
4 “Minwiinwii hyɛ onipa ana? Adɛn nti na ɛsɛ sɛ minya ntoboase?
నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆత్రుత చెందకూడదు?
5 Monhwɛ me, na mo ho nnwiriw mo; momfa mo nsa nkata mo ano.
మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి.
6 Sɛ midwen eyi ho a, mebɔ hu; na me ho popo.
ఈ విషయాలను గురించి తలుచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది.
7 Adɛn nti na amumɔyɛfo tena nkwa mu? Wonyin kyɛ na wɔkɔ so di tumi.
భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు?
8 Wohu wɔn mma a atwa wɔn ho ahyia no nkɔso, wohu wɔn nenanom.
వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి.
9 Ɔhaw nni wɔn afi mu, na ehu nni hɔ; Onyankopɔn asotwe mma wɔn so.
వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమం ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది.
10 Wɔn anantwinini nnyɛ asaadwe; na wɔn anantwibere nwo a wɔmpɔn.
౧౦వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు.
11 Wɔka wɔn mma bɔ mu te sɛ nguankuw; na emu mmotafowa no huruhuruw.
౧౧వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు.
12 Wɔto nnwom wɔ akasae ne sanku so; na wɔde atɛntɛbɛn nnyigyei gye wɔn ani.
౧౨వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు.
13 Wodi yiye wɔn nkwanna mu na wɔkɔ ɔdae mu asomdwoe mu. (Sheol h7585)
౧౩వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. (Sheol h7585)
14 Nanso wɔka kyerɛ Onyankopɔn se, ‘Fi yɛn so! Yɛmpɛ sɛ yehu wʼakwan.
౧౪వాళ్ళు “నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం” అని దేవునితో చెబుతారు.
15 Hena ne otumfo no a ɛsɛ sɛ yɛsom no? Sɛ yɛbɔ no mpae a mfaso bɛn na yebenya?’
౧౫“మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటి వాడు? మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగే దేమిటి?” అని వాళ్ళు అడుగుతారు.
16 Nanso wɔn nkɔso no nni wɔn nsam, enti metwe me ho fi amumɔyɛfo afotu ho.
౧౬వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక.
17 “Nanso mpɛn ahe na wodum amumɔyɛfo kanea? Mpɛn ahe na amanehunu ba wɔn so, nea Onyankopɔn fi nʼabufuw mu de ba no?
౧౭భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదికి విపత్తులు రావడం చాలా అరుదు గదా.
18 Mpɛn ahe na wɔyɛ sɛ sare wɔ mframa ano, te sɛ ntɛtɛ a mframaden bi apra wɔn?
౧౮ఆయన వాళ్ళపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం, వాళ్ళను తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా.
19 Wɔka se, ‘Onyankopɔn kora onipa asotwe so de twɛn ne mma.’ Ɛsɛ sɛ ɔtwe onipa no ankasa aso ma ohu.
౧౯“వాళ్ళ పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు” అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి.
20 Ma ɔno ankasa ani nhu ne sɛe; ma Otumfo abufuwhyew no nka nʼani.
౨౦తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి.
21 Dɛn na ɛfa wɔn ho fa wɔn abusuafo a woagyaw wɔn akyi no ho bere a asram a wɔatwa ama no aba awiei no?
౨౧వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి, చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది?
22 “Obi betumi akyerɛ Onyankopɔn nyansa, wɔ bere a obu atitiriw mpo atɛn?
౨౨దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా.
23 Obi wu wɔ bere a ɔwɔ ahoɔden ne ho tɔ no na nʼaso mu adwo no,
౨౩ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు.
24 na ne nipadua ayɛ frɔmfrɔm, na hon ahyɛ ne nnompe ma.
౨౪అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి.
25 Ɔfoforo nso de ɔkra mu yawdi wu, a wanka asetena pa anhwɛ da.
౨౫మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు.
26 Wosie wɔn nyinaa wɔ mfutuma koro mu, ma asunson nnunu wɔn nyinaa.
౨౬ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి.
27 “Mahu mo adwene, ɔkwan a mobɛfa so afom me.
౨౭నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను.
28 Moka se, ‘Onipa kɛse no fi wɔ he, ntamadan a omumɔyɛfo no tenaa mu no?’
౨౮“ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?” అని మీరు అడుగుతున్నారు గదా.
29 So mummmisaa wɔn a wotu kwan no asɛm da? Wɔn amanneɛbɔ mu nsɛm ho nhiaa mo
౨౯దేశంలో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా?
30 sɛ onipa bɔne nya ne ti didi mu amanehunu da, na wogye wɔn abufuwhyew da no ana?
౩౦ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు.
31 Hena na ɔde ne suban si nʼanim? Hena na otua no nea wayɛ so ka?
౩౧వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు?
32 Wɔsoa no kɔ ɔda mu, na wɔwɛn nʼaboda.
౩౨వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది.
33 Obon mu dɔte yɛ no dɛ; nnipa nyinaa di nʼakyi, na dɔm a wontumi nkan wɔn di nʼanim.
౩౩పళ్ళెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్ళనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంతమంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు.
34 “Enti ɛbɛyɛ dɛn na mode mo nsɛnhunu bɛkyekye me werɛ? Mo mmuae nyɛ hwee sɛ atoro!”
౩౪మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు?

< Hiob 21 >