< Hiob 16 >

1 Afei Hiob buae se,
అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు,
2 “Mate nsɛm bebree a ɛte sɛ eyinom; na mo nyinaa moyɛ ogyamserewfo!
“ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు.
3 So mo kasa tenten no remma awiei ana? Dɛn na ɛhaw mo nti a mugu so regye akyinnye yi?
నువ్వు చెబుతున్న గాలిమాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది?
4 Anka me nso metumi akasa sɛ mo, sɛ mo na mowɔ me tebea yi mu a, anka metumi akeka nsɛm a ɛyɛ dɛ atia mo na mabu mo animtiaa.
నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి.
5 Nanso anka mɛhyɛ mo den; anka awerɛkyekye nsɛm a ebefi mʼanom no bɛma mo ahotɔ.
అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి.
6 “Nanso sɛ mekasa a ɔyaw a mete no remmrɛ ase; na sɛ mankasa nso a, ɛrennyae.
ఇప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడినా దుఃఖం తీరదు, అలాగని మౌనంగా ఉన్నా నాకెలాంటి ఉపశమనం కలగదు.
7 Onyankopɔn, ampa ara woama mabrɛ woasɛe me fi pasaa.
దేవుడు నాకు ఆయాసం కలగజేశాడు. దేవా, నా బంధువర్గమంతటినీ నువ్వు నాశనం చేశావు.
8 Woakyekyere me, ama abɛyɛ adansedi; me so tew ara na ɛtew na edi adanse tia me.
నా శరీరమంతా బక్కచిక్కిపోయింది. క్షీణించిపోయి, మడతలు పడిన నా చర్మం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది.
9 Onyankopɔn tow hyɛ me so tetew me wɔ nʼabufuw mu na ɔtwɛre ne se gu me so; nea ɔne me anya no pɔkyere nʼani hwɛ me.
ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు.
10 Nnipa bue wɔn ano di me ho fɛw; wɔbɔ me sotɔre de bu me animtiaa na wɔka wɔn ho bɔ mu de tia me.
౧౦మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టులాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు.
11 Onyankopɔn de me ama abɔnefo watow me ato amumɔyɛfo nsam.
౧౧దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనంలో నన్ను బంధించి ఉంచాడు.
12 Na biribiara kɔ yiye ma me, nanso ɔdwerɛw me; osoo me kɔn mu, tow me hwee hɔ. Ɔde me asi nʼani so;
౧౨నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకుని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకుని వేధిస్తున్నాడు.
13 nʼagyantowfo atwa me ho ahyia, ohwirew mʼasaabo mu a wanhu me mmɔbɔ maa me bɔnwoma petee fam.
౧౩ఆయన వేసే బాణాలు నా దేహమంతా గుచ్చుకుంటున్నాయి. ఆయన నా మూత్రపిండాలను పొడిచివేశాడు. జాలి, దయ లేకుండా నన్ను వేధిస్తున్నాడు. నాలోని పైత్యరసాన్ని నేలపై కక్కించాడు.
14 Ɔba me so bere biara; na ɔtow hyɛ me so sɛ ɔkofo.
౧౪దెబ్బ మీద దెబ్బ వేసి నన్ను విరగగొడుతున్నాడు. యుద్ధ వీరుని వలే పరుగెత్తుకుంటూ వచ్చి నా మీద పడ్డాడు.
15 “Mapam atweaatam akata me were so na masie mʼanintɔn wɔ mfutuma mu.
౧౫నా చర్మానికి గోనెపట్ట కప్పుకుని కూర్చున్నాను. నా దేహమంతా బూడిద పోసుకుని మురికి చేసుకున్నాను.
16 Agyaadwotwa ama mʼani ayɛ kɔɔ; sunsuma kabii atwa mʼani ho ahyia,
౧౬నేను ఎవ్వరికీ కీడు తలపెట్టలేదు. నేను చేసే ప్రార్థన పరిశుద్ధం.
17 nanso me nsa nyɛɛ basabasayɛ biara na me mpaebɔ yɛ kann.
౧౭ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది.
18 “Asase, nkata me mogya so; na mma me sufrɛ to ntwa da!
౧౮భూమీ, ఒలుకుతున్న నా రక్తాన్ని కనబడనియ్యి. నేను పెడుతున్న మొరలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి.
19 Mprempren mpo, me danseni wɔ ɔsoro; me kamafo wɔ soro hɔ.
౧౯ఇప్పటికీ నా తరుపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు.
20 Me dimafo yɛ mʼadamfo bere a mʼaniwa tew nisu gu Onyankopɔn so yi;
౨౦నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
21 ogyina onipa anan mu di ma no wɔ Onyankopɔn anim sɛnea obi di ma nʼadamfo no.
౨౧ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమిలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి.
22 “Mfe kakraa bi akyi ansa na metu kwan akɔ koransan.
౨౨ఇంకా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత నేను తిరిగిరాని దారిలో వెళ్ళిపోతాను.

< Hiob 16 >