< Hiob 14 >
1 “Nnipa a ɔbea awo wɔn nna yɛ tiaa bi na ɔhaw ahyɛ mu mma.
౧స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు.
2 Ɔfefɛw te sɛ nhwiren na etwintwam; ɔte sɛ sunsuma a ɛretwa mu akɔ, ɔntena hɔ nkyɛ.
౨అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు.
3 Woma wʼani kɔ saa onipa yi so? Wode no bɛba wʼanim abebu no atɛn ana?
౩అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా?
4 Hena na obetumi ayi nea ɛyɛ kronkron afi fi mu? Obiara nni hɔ.
౪అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు.
5 Woahyehyɛ onipa nkwa nna; woahyɛ nʼasram dodow ato hɔ na woahyɛ no bere a ɔrentumi ntra.
౫మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు.
6 Enti yi wʼani fi ne so na ɔnyɛ nea ɔpɛ, kosi sɛ obewie nʼadwuma sɛ ɔpaani.
౬అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు.
7 “Dua mpo anidaso wɔ hɔ ma no: Sɛ wotwa a, ɛbɛfefɛw bio, na ne mman foforo no rempenpan.
౭చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది.
8 Ne ntin betumi anyin akyɛ asase mu na ne dunsin nso awu wɔ dɔte mu,
౮నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది.
9 nanso, onya nsu a ɛfefɛw, na eyiyi mman sɛ dua a wɔatɛw.
౯అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది.
10 Nanso sɛ nnipa wu a wɔde no hyɛ fam; ɔhome nea etwa to a, na afei onni hɔ bio.
౧౦అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు?
11 Sɛnea nsu tu yera wɔ po mu no, anaa sɛnea suka mu yowee no,
౧౧సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.
12 saa ara na onipa tɔ fam na ɔnsɔre bio; enkosi sɛ ɔsoro betwa mu no, nnipa rensɔre na wɔrennyan wɔn mfi wɔn nna mu.
౧౨ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు.
13 “Sɛ anka wode me besie ɔda mu de me ahintaw kosi sɛ wʼabufuw betwa mu! Sɛ anka wobɛhyɛ me bere na afei woakae me! (Sheol )
౧౩నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. (Sheol )
14 Sɛ onipa wu a ɔbɛba nkwa mu bio ana? Mʼaperedi nna mu nyinaa mɛtwɛn akosi sɛ me foforoyɛ bɛba.
౧౪మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను.
15 Wobɛfrɛ na megye wo so; wʼani begyina abɔde a wo nsa ayɛ.
౧౫అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు.
16 Afei wobɛkan mʼanammɔntu na worenni me bɔne akyi.
౧౬అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి.
17 Wɔbɛsɔ me bɔne ano wɔ kotoku mu, na woakata mʼamumɔyɛ so.
౧౭నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు.
18 “Nanso sɛnea mmepɔw so hohoro na ɛpompono na ɔbotan nso twe fi ne sibea no,
౧౮కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి.
19 sɛnea nsu yiyi abo ho na osuhweam twe dɔte kɔ no saa ara na wosɛe onipa anidaso.
౧౯నీళ్ళు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు.
20 Wutintim ne so prɛko pɛ, na otwa mu kɔ; wosakra ne nipasu na wugya no kwan.
౨౦నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు.
21 Sɛ wɔhyɛ ne mmabarima anuonyam a, onnim; na sɛ wɔbrɛ wɔn ase a, onhu.
౨౧ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు.
22 Ɔno ara were mu yaw na ɔtee na ɔno ara ne ho na ogyam.”
౨౨తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు.