< Yeremia 24 >

1 Babiloniahene Nebukadnessar faa Yudahene Yehoiakyin a ɔyɛ Yehoiakim babarima, nʼadwumayɛfo, nʼadwumfo ne nʼatomfo a wɔwɔ Yuda fii Yerusalem kɔɔ nnommum mu wɔ Babilonia no akyi no, Awurade kyerɛɛ me borɔdɔma nkɛntɛn abien a wɔde asisi Awurade asɔredan no anim.
బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.
2 Kɛntɛn baako mu borɔdɔma no yɛ papa te sɛ nea ɛbere ntɛm; borɔdɔma a ɛwɔ kɛntɛn a ɛka ho no mu no nye sɛ wodi mpo.
ఒక గంపలో మగ్గిన అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరు పళ్ళు ఉన్నాయి.
3 Na Awurade bisaa me se, “Dɛn na wuhu, Yeremia?” Mibuae se, “Borɔdɔma, nea eye pa ara, ne nea enye mma sɛ wodi mpo.”
“యిర్మీయా! నువ్వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను ఆడిగాడు. అందుకు నేను “అంజూరు పళ్ళు. మంచివి చాలా బాగున్నాన్నాయి. చెడ్డవి బాగా కుళ్ళిపోయాయి. తినడానికి పనికి రావు.” అన్నాను.
4 Na Awurade asɛm baa me nkyɛn se,
అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
5 “Sɛɛ na Awurade, Israel Nyankopɔn se: ‘Borɔdɔma papa no gyina hɔ ma atukɔfo a wofi Yuda, wɔn a mitwaa wɔn asu kɔɔ Babilonia asase so no.
“ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలం నుంచి నేను కల్దీయుల దేశానికి పంపించాను. వాళ్ళను ఈ మంచి అంజూరు పళ్ళలాగా ఎంచుతాను.
6 Mɛma mʼani aku wɔn ho, ama wɔn yiyedi, na mɛsan de wɔn aba ha bio. Mesiesie wɔn na merensɛe wɔn. Medua wɔn, na merentu wɔn ase.
వాళ్లకు మేలు కలగడానికి నేను వాళ్ళ మీద దృష్టి పెడతాను. ఈ దేశానికి వాళ్ళను మళ్ళీ తీసుకువస్తాను. నేను వాళ్ళను పడగొట్టకుండా కడతాను. పెళ్లగించకుండా నాటుతాను.
7 Mɛma wɔn koma a wɔde behu me sɛ, me ne Awurade. Wɔbɛyɛ me nkurɔfo, na mɛyɛ wɔn Nyankopɔn, efisɛ wɔde wɔn koma nyinaa bɛsan aba me nkyɛn.
నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”
8 “‘Nanso te sɛ borɔdɔma a enye no, nea enye sɛnea wodi mpo no,’ nea Awurade se ni, ‘saa ara na mɛyɛ Yudahene Sedekia, nʼadwumayɛfo ne Yerusalem nkae no, sɛ wɔte asase yi so anaa wɔte Misraim.
“యూదా రాజు సిద్కియానూ అతని అధికారులనూ దేశంలో మిగిలిన వాళ్ళనూ ఐగుప్తు దేశంలో నివసించే వాళ్ళనూ బాగా చెడిపోయి తినడానికి పనికిరాని ఆ కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలాగా ఉంచుతానని యెహోవా చెబుతున్నాడు.
9 Mɛma wɔn ayɛ akyide ne mfomsode ama ahenni a ɛwɔ asase so nyinaa, wɔbɛyɛ ahohora na wɔabɔ wɔn din bɔne, wɔbɛyɛ akyiwade ne mmusu baabiara a mɛpam wɔn akɔ.
వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.
10 Mɛsoma afoa, ɔkɔm ne ɔyaredɔm akɔ wɔn so kosi sɛ wɔbɛsɛe wɔn koraa afi asase a mede maa wɔn ne wɔn agyanom no so.’”
౧౦నేను వారికీ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనమయ్యే వరకూ నేను కత్తినీ కరువునూ అంటు వ్యాధుల్నీ వాళ్లలోకి పంపుతాను.”

< Yeremia 24 >