< Yeremia 11 >
1 Asɛm a efi Awurade hɔ baa Yeremia nkyɛn ni:
౧యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
2 “Tie apam yi mu nhyehyɛe na ka kyerɛ Yudafo ne wɔn a wɔtete Yerusalem.
౨“మీరు ఈ నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు.
3 Ka kyerɛ wɔn se, sɛɛ na Awurade, Israel Nyankopɔn se: ‘Nnome nka onipa a onni apam yi mu nhyehyɛe so,
౩ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు.
4 nea mehyɛ maa mo agyanom bere a miyii wɔn fii Misraim, fononoo a wɔnan dade wɔ mu no.’ Mekae se, ‘Monyɛ osetie mma me na monyɛ biribiara a mehyɛ mo, na mobɛyɛ me nkurɔfo na mayɛ mo Nyankopɔn.
౪ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, ‘నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.’”
5 Na afei mɛma ntam a mekaa mo agyanom se, mɛma wɔn asase a nufusu ne ɛwo sen wɔ so no aba mu,’ asase a mote so nnɛ yi.” Mibuae se, “Amen, Awurade.”
౫అందుకు నేను “యెహోవా, అలాగే జరుగు గాక” అన్నాను.
6 Awurade ka kyerɛɛ me se, “Bɔ saa asɛm yi ho dawuru wɔ Yuda nkurow ne Yerusalem mmɔnten so se: ‘Muntie apam yi ho nhyehyɛe na munni so.
౬యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలు ప్రకటించు. ‘మీరు ఈ నిబంధన మాటలు విని వాటిని పాటించండి.’
7 Efi bere a miyii mo agyanom fii Misraim besi nnɛ yi, mebɔɔ wɔn kɔkɔ bere biara se, “Monyɛ osetie mma me.”
౭ఐగుప్తులో నుండి మీ పూర్వికులను రప్పించిన రోజు మొదలుకుని నేటివరకూ వారితో ‘నా మాట వినండి’ అని నేను గట్టిగా, ఖండితంగా చెబుతూ వచ్చాను.
8 Nanso wɔantie na wɔamfa no asɛm; na mmom, wodii asoɔden a efi wɔn koma bɔne mu no akyi. Ɛno nti memaa nnome a efi apam a mahyɛ wɔn sɛ wonni so na wɔanni so no mu no baa wɔn so.’”
౮అయినా వారు తమ దుష్టహృదయంతో, మూర్ఖులై నడుచుకుంటూ నామాట వినలేదు. ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవమని చెప్పినా వారు వినలేదు కాబట్టి నేను ఆ నిబంధనలోని శాపాలన్నిటినీ వారి మీదికి రప్పిస్తాను.”
9 Na afei Awurade ka kyerɛɛ me se, “Atuatew apam bi wɔ Yudafo ne wɔn a wɔtete Yerusalem no ntam.
౯యెహోవా నాతో ఇలా చెప్పాడు. “యూదా ప్రజల్లో, యెరూషలేము నివాసుల్లో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది.
10 Wɔasan kɔ wɔn agyanom a wɔampɛ sɛ wotie mʼasɛm no bɔne ho. Wɔadi anyame foforo akyi akɔsom wɔn. Yerusalem fifo ne Yuda fifo abu apam a me ne wɔn agyanom yɛe no so.
౧౦అదేమంటే, ఇశ్రాయేలు, యూదా వంశస్థులు నా మాటలు వినని తమ పూర్వీకుల దోషాలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. వారు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటిని అనుసరిస్తూ వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను భంగం చేశారు.”
11 Ɛno nti nea Awurade se ni: ‘Mede amanehunu a wɔrentumi nguan mfi mu bɛba wɔn so. Ɛwɔ mu sɛ, wosu frɛ me de, nanso merennye wɔn so.
౧౧కాబట్టి యెహోవా చెప్పేదేమంటే “వారు తప్పించుకోలేని విపత్తును వారి మీదికి రప్పిస్తాను, వారు నన్ను ఎంత వేడుకున్నా నేను వినను.
12 Yuda nkurow ne Yerusalemfo bɛkɔ akosu afrɛ anyame a wɔhyew nnuhuam ma wɔn no, nanso sɛ amanehunu ba a wɔrentumi mmoa wɔn koraa.
౧౨యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు తాము ఎవరికైతే ధూపం వేస్తూ పూజిస్తున్నారో ఆ దేవుళ్ళకు విన్నవించుకుంటారుగానీ వారి ఆపదలో అవి వారిని ఏమాత్రం కాపాడలేవు.
13 Wo Yuda, wowɔ anyame a wɔn dodow bɛyɛ sɛ wo nkurow; na afɔremuka a moasisi sɛ mobɛhyew nnuhuam wɔ so ama animguase nyame Baal no dɔɔso sɛ Yerusalem mmɔnten.’
౧౩యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు.
14 “Mmɔ mpae mma saa nnipa yi, nni mma wɔn na nsrɛ mma wɔn, efisɛ, sɛ wosu frɛ me wɔ wɔn amanehunu mu a merennye wɔn so.
౧౪కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా అంగలార్చవద్దు, వేడుకోవద్దు. వారు తమ విపత్తులో నాకు మొర పెట్టినపుడు నేను వినను.
15 “Dɛn na me dɔfo reyɛ wɔ mʼasɔredan mu bere a ɔne bebree hyehyɛ nsɛmmɔnedi ho? Ahodwira nam betumi abɔ wo asotwe agu ana? Sɛ woyɛ wʼamumɔyɛsɛm a na wʼani agye.”
౧౫దుష్ట తలంపులు కలిగిన నా ప్రియమైన ప్రజలకు నా మందిరంతో పనేంటి? బలుల కోసం నువ్వు మొక్కుకుని తెచ్చిన ప్రతిష్ఠితమైన మాంసం భుజించడం వలన నీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు చెడు జరిగించి సంతోషించావు.
16 Awurade, frɛ wo ngodua a enyin frɔmfrɔm a ɛsow aba a ɛyɛ fɛ. Nanso ɔde ahum kɛse bi nteɛmu bɛto mu gya, na ne mman bebubu.
౧౬గతంలో యెహోవా నిన్ను, ‘ఫలభరితమైన పచ్చని ఒలీవ చెట్టు’ అని పిలిచాడు. అయితే ఆయన గొప్ప తుఫాను శబ్దంలా వినిపించే మంట రగిలించాడు. దాని కొమ్మలు విరిగిపోతాయి.
17 Asafo Awurade a oduaa wo no ahyɛ amanehunu ho nkɔm wɔ wo ho, efisɛ Israel fifo ne Yuda fifo ayɛ bɔne ahyɛ me abufuw sɛ wɔhyew nnuhuam ma Baal.
౧౭ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.”
18 Esiane sɛ Awurade yii pɔw a wabɔ kyerɛɛ me no nti, mihui, efisɛ saa bere no ɔde nea wɔreyɛ no kyerɛɛ me.
౧౮దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు.
19 Meyɛɛ sɛ oguamma a odwo a wɔde no rekɔ akokum no; amma mʼadwene mu sɛ wɔabɔ wɔn tirim pɔw atia me sɛ, “Momma yɛnsɛe dua no ne nʼaba no; momma yentwa no mfi ateasefo asase so, sɛnea wɔnnkae ne din bio.”
౧౯అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు.
20 Nanso wo, Asafo Awurade, wo a wubu atɛntrenee na wosɔ koma ne adwene hwɛ, ma minhu wʼaweretɔ wɔ wɔn so, na wo nsam na mede me nsɛm nyinaa hyɛ.
౨౦సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు. యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను.
21 Ɛno nti nea Awurade ka fa Anatot mmarima a wɔrehwehwɛ wo akum wo na wɔka se, “Nhyɛ nkɔm wɔ Awurade din mu anyɛ saa a, wubewu wɔ yɛn nsa ano,”
౨౧“నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
22 Ɛno nti, nea Asafo Awurade se ni: “Mɛtwe wɔn aso. Wɔn mmerante bewuwu afoa ano, na ɔkɔm bekunkum wɔn mmabarima ne mmabea.
౨౨“నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు.
23 Wɔrennya wɔn nkae biara mpo, efisɛ mede amanehunu bɛba Anatotfo so wɔ wɔn asotwe afe mu.”
౨౩వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.”