< Yesaia 54 >
1 “To nnwom, obonin, wo a wonwoo da; pae mu to nnwom, teɛ mu di ahurusi, wo a awo nkaa wo da; efisɛ ɔbea a wannya awo da no mma dɔɔso sen nea ɔwɔ kunu,” Awurade na ose.
౧“గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు.
2 “Trɛw wo ntamadan no mu; twe wo ntamadan ntwamu no mu, nnyae yɛ; toa wo ntampehama no so, bobɔ wo nnyinaso no so ma entim yiye.
౨నీ డేరా పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. నీ తాళ్ళు పొడుగు చెయ్యి. నీ మేకులు దిగ్గొట్టు.
3 Efisɛ wobɛtrɛw akɔ nifa ne benkum; wʼasefo begye aman afa na wɔatena wɔn nkuropɔn amamfo so.
౩ఎందుకంటే నువ్వు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.
4 “Nsuro; wʼanim rengu ase. Nsuro aniwu; wɔremmrɛ wo ase. Wo werɛ befi wo mmabun mu aniwu na wo kunayɛ mu ahohora nso worenkae bio.
౪భయపడవద్దు. నువ్వు సిగ్గు పడనక్కరలేదు. నీకు అవమానం కలగదు. అధైర్య పడవద్దు. చిన్నతనంలోని నీ అవమానాన్నీ సిగ్గునూ మరచిపోతావు. నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకం చేసుకోవు.
5 Na wo Bɔfo yɛ wo kunu Asafo Awurade ne ne din, Israel Kronkronni no yɛ wo Gyefo. Wɔfrɛ no asase nyinaa so Nyankopɔn.
౫నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు.
6 Awurade bɛsan afrɛ wo te sɛ ɔyere a woagyaa no na odi yaw wɔ ne koma mu, ɔyere a ɔwaree mmabaabere mu na wogyaa no mpofirim,” wo Nyankopɔn na ose.
౬భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు.
7 “Migyaw wo bere tiaa bi mu, nanso mifi ayamhyehye a mu dɔ mu bɛsan de wo aba.
౭కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను.
8 Abufuw mmoroso mu, mede mʼani hintaw wo mmere tiaa bi, nanso mʼayamye a ɛnsa da nti, mehu wo mmɔbɔ,” nea Awurade, wo Gyefo se ni.
౮కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.
9 “Eyi te sɛ Noa mmere so a mekaa ntam se meremma nsuyiri nkata asase ani bio. Enti afei maka ntam se meremma me bo mfuw wo bio, na merenka wʼanim bio.
౯“ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను.
10 Sɛ mmepɔw wosow, na nkoko tutu a, me dɔ a ɛnsa da a mewɔ ma wo no renhinhim na mʼasomdwoe apam no rentwa mu,” sɛɛ na Awurade a ɔwɔ ahummɔbɔ ma mo no se.
౧౦పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.
11 “Kuropɔn a ahum abubu wo na wɔnkyekyee wo werɛ ɛ, mede abo anintɔnka besiesie wo, na mede aboɔdemmo bibiri ayɛ wo fapem.
౧౧బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.
12 Mede bogyabo bɛto wʼabantifi afasu, na mede abohemaa a ɛhyerɛn ayɛ wʼapon, na mede aboɔdemmo ayɛ wʼafasu nyinaa.
౧౨కెంపులతో నీ కోట బురుజులను, మెరిసే రాళ్ళతో నీ గుమ్మాలను, విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను.
13 Awurade bɛkyerɛkyerɛ wo mmabarima nyinaa, na wo mma asomdwoe bɛdɔɔso.
౧౩యెహోవా నీ పిల్లలందరికీ బోధిస్తాడు. నీ పిల్లలకు పరిపూర్ణమైన నెమ్మది ఉంటుంది.
14 Wubetim wɔ trenee mu: Wo ne nhyɛsotraso ntam kwan bɛware worensuro biribiara. Ahupoo bɛkɔ akyirikyiri, na ɛremmɛn wo.
౧౪నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు.
15 Sɛ obi tow hyɛ wo so a, na emfi me; na nea ɔtow hyɛ wo so no de ne ho bɛma wo.
౧౫ఎవరైనా చిక్కు తెస్తే, అది నా వలన కాదు. చిక్కు తెచ్చే వారెవరైనా ఓడిపోతారు.
16 “Hwɛ, ɛyɛ me na mebɔɔ ɔtomfo a ofita nnyansramma mu ma ɛdɛw na ɔde ahoɔden bɔ akode a ɛfata ne dwumadi. Na ɛyɛ me na mabɔ ɔsɛefo sɛ ɔmmɛsɛe ade;
౧౬ఇదిగో విను! నిప్పులు ఊదే కమ్మరిని నేనే చేశాను. అతడు అక్కడ ఆయుధాలను చేస్తాడు. నాశనం చేయడానికి నాశనం చేసేవాణ్ణి చేసింది నేనే.
17 akode biara a wɔabɔ atia wo no rennyina na tɛkrɛma biara a ɛbɛbɔ wo sobo no wobɛbɔ agu. Eyi ne Awurade nkoa agyapade, ne wɔn bembu a efi me,” Awurade na ose.
౧౭నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.