< Yesaia 30 >

1 “Munnue mmofra asoɔdenfo,” sɛɛ na Awurade se, “Wɔn a wɔde nhyehyɛe a emfi me yɛ adwuma, na wɔyɛ apam a emfi me honhom mu, na wɔboaboa bɔne ano;
“తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.
2 wɔn a wɔkɔ Misraim a wommisa me ansa; wɔhwehwɛ mmoa a ɛyɛ bammɔ fi Farao nkyɛn, wɔkɔ Misraim kɔhwehwɛ hintabea.
వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. కానీ నా సలహా కోసం చూడరు. ఫరో సంరక్షణ కోసం పాకులాడుతున్నారు. ఐగుప్తు నీడలో ఆశ్రయం కోసం ఆరాటపడుతున్నారు.
3 Nanso Farao bammɔ bɛyɛ animguase ama mo, Misraim nwini de ahohora bɛbrɛ mo.
కాబట్టి ఫరో సంరక్షణ మీకు అవమానంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో ఆశ్రయం మీకు సిగ్గుగా ఉంటుంది.
4 Ɛwɔ mu, wɔwɔ adwumayɛfo wɔ Soan na wɔn ananmusifo adu Hanes de,
ఇశ్రాయేలు ప్రజల అధిపతులు సోయనులో ఉన్నారు. వాళ్ళ రాయబారులు హానేసులో ప్రవేశించారు.
5 nanso wɔn nyinaa anim begu ase nnipa bi a wɔn so nni wɔn mfaso nti, wɔmmfa mmoa anaa mfaso mma, na mmom animguase ne ahohora.”
కానీ వాళ్లకి సహాయం చేసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండకపోవడం చూసి వాళ్లందరూ సిగ్గుపడి పోతారు. ఉన్నవాళ్ళు సహాయంగానూ, మద్దతుగానూ ఉండకపోగా సిగ్గుగానూ అవమానంగానూ ఉంటారు.”
6 Adehunu a ɛfa Negeb mmoa ho: wɔfa ahokyere ne ahohiahia asase so, nea gyata ne gyatabere, nhurutoa ne awɔ a wɔn ho yɛ hare wɔ, ananmusifo no de wɔn ahonyade soa mfurum ne wɔn ademude wɔ yoma afu so, de kɔ saa ɔman a ne so nni mfaso no so,
దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.
7 de kɔ Misraim a ne mmoa so nni mfaso, enti mefrɛ no Rahab nea Onsi Hwee.
ఎందుకంటే ఐగుప్తు చేసే సహాయం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేను దానికి పనీ పాటా లేకుండా కూర్చునే రాహాబు. అనే పేరు పెడుతున్నా.
8 Kɔ afei, kyerɛw wɔ kyerɛwpon so ma wɔn, kurukyerɛw wɔ nhoma mmobɔwee so sɛnea nna a ɛreba no mu no ɛbɛyɛ adansede a ɛbɛtena hɔ afebɔɔ.
భవిష్యత్తులో సాక్ష్యంగా దీన్ని భద్రపరచడం కోసం నువ్వు వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఒక రాతి పలకపై దీన్ని చెక్కి గ్రంథంలో రాసి ఉంచు.
9 Saa nnipa yi yɛ atuatewfo, mma asisifo, mma a wɔmpɛ sɛ wotie Awurade nkyerɛkyerɛ.
వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు.
10 Wɔka kyerɛ adehufo se, “Munhu mo ani so ade bio!” ne adiyifo no nso se, “Monnka anisoadehu a ɛyɛ nokware no nkyerɛ yɛn bio! Monka abodwosɛm nkyerɛ yɛn, monhyɛ nnaadaa nkɔm.
౧౦దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి.
11 Mumfi saa ɔtempɔn yi so, momman mfi saa ɔkwan yi ho na munnyae Israel Kronkronni a mode no haw yɛn yi!”
౧౧మా దారికి అడ్డం రావద్దు. మా మార్గం నుండి తొలగి పొండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తవద్దు” అని అంటారు.
12 Enti sɛɛ na Israel Ɔkronkronni no se: “Esiane sɛ moapo saa nkra yi, na mode mo ho ato nhyɛso ne nnaadaa so nti,
౧౨కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలా చెప్తున్నాడు. మీరు ఈ మాటని తిరస్కరించి అణచివేతనూ, మోసాన్నీ నమ్ముకున్నారు. వాటి పైనే ఆధారపడ్డారు.
13 saa bɔne yi bɛyɛ sɛ ɔfasu tenten bi a ahyɛ kam na akyea na ebu mpofirim, ama mo.
౧౩కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.
14 Ebebubu nketenkete ayɛ sɛ kuku. Ɛbɛyam pasaa a, sin koraa renka a wobetumi de asɔ gya afi muka mu anaa wɔde bɛsaw nsu afi ahina mu.”
౧౪కుమ్మరి చేసిన మట్టి కుండ పగిలినట్టు ఆయన దాన్ని పగలగొడతాడు. దాన్ని ఆయన విడిచి పెట్టడు. దాని ముక్కల్లో ఒక్క పెంకు కూడా పొయ్యిలో నుండి నిప్పు కణికలను తీయడానికి గానీ కుండలో నుండి నీళ్ళుతోడటానికి గానీ పనికి రాదు.
15 Sɛɛ na Otumfo Awurade, Israel Kronkronni no se: “Ahonu mu ne ntoboase mu na mo nkwagye wɔ kommyɛ ne ahotoso mu na mo ahoɔden wɔ, nanso, morennya mu biara.
౧౫ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.
16 Mokaa se, ‘Dabi da, yɛbɛtena apɔnkɔ so aguan.’ Enti mubeguan! Mokaa se, ‘yɛbɛtena apɔnkɔ a wɔn ho yɛ hare so akɔ.’ Enti wɔn a wɔtaa mo no ho bɛyɛ hare!
౧౬“అలా కాదు. మేం గుర్రాలెక్కి పారిపోతాం” అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు. ఇంకా “వేగంగా పరుగుతీసే గుర్రాలపై స్వారీ చేస్తాం” అన్నారు. కాబట్టి మిమ్మల్ని తరిమే వాళ్ళు ఇంకా వేగంగా వస్తారు.
17 Apem beguan ɔbaako ho hu nti; baanum ho hu nti mo nyinaa beguan akɔ, akosi sɛ wobegyaw mo te sɛ frankaa dua a esi bepɔw atifi, te sɛ frankaa a esi koko so.”
౧౭మీలో మిగిలి ఉన్న వాళ్ళు ఏదో పర్వతంపై ఒక జెండా కర్రగానో, లేదా ఏదో కొండపై జెండా గానో మిగిలే దాకా మీరు ఒక్కడికి భయపడి వెయ్యి మంది పారిపోతారు. ఐదుగురి భయం చేత మీరంతా పారిపోతారు.
18 Nanso Awurade pɛ sɛ ɔdom mo; ɔma ne ho so, kyerɛ wo nʼahummɔbɔ. Efisɛ Awurade yɛ ɔtreneeni Nyankopɔn. Nhyira ne wɔn a wɔtwɛn no nyinaa!
౧౮అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.
19 Sionfo a mote Yerusalem, morentwa adwo bio. Sɛ musu frɛ no hwehwɛ mmoa a, ɔbɛdom mo! Sɛ ɔte a obegye mo so prɛko pɛ.
౧౯ఎందుకంటే యెరూషలేములోనే సీయోనులోనే ఒక జనం నివాసముంటారు. వాళ్లికపై ఏడవరు. నీ రోదన ధ్వనికి ఆయన కచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు.
20 Ɛwɔ mu, Awurade brɛ mo amanehunu sɛ aduan ne ɔhaw sɛ nsu de, nanso, afei mubehu Awurade, mo kyerɛkyerɛfo no bio, na ɔbɛkyerɛ mo kwan.
౨౦యెహోవా నీకు వైరాన్ని ఆహారంగా, వేదనను పానీయంగా ఇచ్చాడు. అయినా నీ బోధకులు నీకు ఇక మరుగై ఉండరు. నీకు ఉపదేశం చేసే వాళ్ళని నువ్వు చూస్తావు.
21 Sɛ mofa nifa anaa benkum a, mobɛte nne bi wɔ mo akyi a ɛka se, “Ɔkwan no ni na momfa so.”
౨౧మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు.
22 Afei mobɛtow mo ahoni a mode dwetɛ adura ho ne nsɛsode a mode sikakɔkɔɔ afa ho no nyinaa agu. Mobɛtow wɔn agu sɛ ntamagow fi, na moaka kyerɛ wɔn se, “Mumfi yɛn so nkɔ.”
౨౨వెండితో పోత పోసిన చెక్కిన బొమ్మలనూ, బంగారంతో పోత పోసిన విగ్రహాలనూ మీరు అపవిత్రం చేస్తారు. అసహ్యమైన గుడ్డగా వాటిని భావిస్తారు. “ఇక్కడ నుండి పో” అని వాటికి చెప్తారు.
23 Afei ɔde osu behyira mo bere a mudua nnuaba, na aduan a asase no bɛbɔ no bɛyɛ papa na ɛbɛdɔɔso nso. Da no, mo anantwi bedidi wɔ adidibea a ɛtrɛw so.
౨౩నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూసారమైన ఆహారాన్ని విస్తారంగా నీకిస్తాడు. నీ పంటలు విస్తారంగా పండుతాయి. ఆ రోజున నీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేస్తాయి.
24 Mo anantwi ne mo mfurum a wofuntum asase no bɛwe atoko pa ne ne ntɛtɛ a, wɔde sofi ne nkorata trɛtrɛw mu.
౨౪భూమిని సేద్యం చేయడానికి సహాయం చేసే ఎద్దులూ, గాడిదలూ పార, జల్లెడలతో చెరిగిన ధాన్యాన్ని మేతగా తింటాయి.
25 Saa okum kɛse da no a abantenten ahwehwe ase no, nsuwa bɛteɛ wɔ bepɔw tenten ne koko a ɛkorɔn biara so.
౨౫గోపురాలు కూలి పోయే ఆ మహా సంహారం జరిగే రోజున ఎత్తయిన ప్రతి పర్వతం పైనా, ఎత్తయిన ప్రతి కొండ పైనా వాగులూ, జలధారలూ ప్రవహిస్తాయి.
26 Ɔsram bɛhyerɛn sɛ owia, na owia hyerɛn no bɛyɛ mpɛn ason, te sɛ nnafua ason mu hyerɛn, bere a Awurade kyekyere ne nkurɔfo akuru na ɔsa apirakuru a ɔde ama wɔn no.
౨౬చంద్రుడి కాంతి సూర్య కాంతితో సమానంగా ఉంటుంది. సూర్య కాంతి ఏడు రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది. యెహోవా తన ప్రజల గాయాలకి కట్లు కడతాడు. తాను చేసిన గాయాలను ఆయన బాగు చేస్తాడు.
27 Hwɛ! Awurade fi akyirikyiri reba, ɔde abufuwhyew ne wusiw kumɔnn; abufuw ahyɛ nʼanom ma, na ne tɛkrɛma yɛ ogya a ɛhyew nneɛma.
౨౭చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది.
28 Ne home te sɛ asuworoe a ɛsen ntɛmntɛm, na ɛforo kɔdeda kɔn mu. Ɔwosow aman no wɔ ɔsɛe sɔnee so; ɔde nnareka a ɛma wɔfom kwan hyehyɛ nnipa no nnyepi.
౨౮ఆయన శ్వాస గొంతు వరకూ వచ్చిన బలమైన నదీ ప్రవాహంలా ఉంది. అది నాశనం చేసే జల్లెడలా జాతులను జల్లెడ పడుతుంది. ఆయన శ్వాస జాతుల దవడల్లో కళ్ళెంలా ఉండి వాళ్ళని దారి తప్పిస్తుంది.
29 Na mobɛto dwom te sɛ anadwo a mudi afahyɛ kronkron no; mo koma bedi ahurusi te sɛ bere a nnipa de atɛntɛbɛn foro kɔ Awurade bepɔw no so, kɔ Israel Ɔbotan no nkyɛn.
౨౯పండగ ఆచరించేటప్పుడు రాత్రి వేళ మీరు పాట పాడుతారు. ఇశ్రాయేలుకి ఆశ్రయ దుర్గమైన యెహోవా పర్వతానికి ఒక వ్యక్తి పిల్లనగ్రోవి వాయిస్తూ ప్రయాణం చేసేటప్పుడు కలిగే ఆనందం వంటిది వారి హృదయంలో కలుగుతుంది.
30 Awurade bɛma nnipa ate nʼabrɛmpɔnnne na ɔbɛma wɔahu ne basa a ɛresian na ɛde abufuwhyew ne ogya a ɛhyew nneɛma osu dennen, aprannaa ne mparuwbo reba.
౩౦యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు.
31 Awurade nne bɛhwe Asiria; ɔde nʼabaa bɛbɔ wɔn ahwe fam.
౩౧యెహోవా స్వరం విని అష్షూరు ముక్కలైపోతుంది. ఆయన దాన్ని కర్రతో దండిస్తాడు.
32 Ɔbɛbɔ wɔn wɔ ɔko mu, na bere biara a ɔbɛbɔ wɔn no ɛbɛyɛ sɛ akasae ne sankuten so nnwonto koro.
౩౨యెహోవా తాను నియమించిన కర్రతో అష్షూరు పై వేసే ప్రతి దెబ్బా, ఆయన వాళ్ళతో యుద్ధం చేస్తుండగా, తంబురాల, సితారాల సంగీతంతో కలసి ఉంటుంది.
33 Wɔasiesie Topet dedaada; wɔayɛ no krado ama ɔhene no. Wɔahyehyɛ ogya ne nnyentia bebree wɔ ne gya amoa no a emu dɔ na ɛtrɛw no mu; Awurade home te sɛ sufre asuten no bɛsɔ mu gya.
౩౩తగలబెట్టే స్థలం చాలా కాలం కిందే సిద్ధం అయి ఉంది. నిజంగా రాజు కోసం సిద్ధం అయింది. దాన్ని దేవుడు లోతుగా, విశాలంగా చేశాడు. తగలబెట్టడానికి మంటలు, విస్తారంగా కట్టెలు సిద్ధంగా ఉన్నాయి. యెహోవా శ్వాస గంధక ప్రవాహంలా దాన్ని తగలబెడుతుంది.

< Yesaia 30 >