< Yesaia 11 >
1 Dua foforo bi befifi wɔ Yisai dunsin ho; efi ne ntin mu na Dubaa bi bɛsow aba.
౧యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.
2 Awurade Honhom bɛtena ne so, nyansa ne ntease Honhom, afotu ne tumi Honhom, nimdeɛ ne Awurade suro Honhom,
౨జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.
3 Na nʼani begye wɔ Awurade suro mu. Ɛnyɛ nea ɔde nʼani hu so na obegyina abu atɛn, anaa nea ɔde nʼaso bɛte so na obegyina asi gyinae;
౩యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.
4 na mmom ɔde trenee bebu mmɔborɔfo atɛn, ɔde atɛntrenee besi gyinae ama asase so ahiafo. Ɔde nʼano abaa na ɛbɛbɔ asase; ɔde nʼanofafa home bekunkum amumɔyɛfo.
౪కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.
5 Trenee bɛyɛ nʼabɔso na nokwaredi ayɛ nʼabɔso.
౫అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.
6 Pataku ne oguamma bɛtena, ɔsebɔ ne abirekyi bɛda, nantwi ba ne gyata ne ne ba bɛbɔ mu; na abofra ketewa bi adi wɔn anim.
౬తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.
7 Nantwi ne sisi bɛbɔ mu adidi, wɔn mma bɛdeda faako, na gyata bɛwe wura te sɛ nantwi.
౭ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.
8 Akokoaa bedi agoru abɛn ɔprammiri amoa ano, na abofra ketewa de ne nsa ahyɛ ahurutoa bon mu.
౮పాలు తాగే పసిపిల్ల పాము పుట్ట మీద ఆడుకుంటుంది. పాలు విడిచిన పిల్ల, సర్పం పుట్టలో తన చెయ్యి పెడుతుంది.
9 Wɔrenyɛ obi bɔne na wɔrensɛe ade wɔ me bepɔw Kronkron nyinaa so, na Awurade ho nimdeɛ bɛyɛ asase so ma sɛnea nsu ayɛ po ma no.
౯నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
10 Na da no, Yisai aseni bɛsɔre; nea ɔbɛsɔre abedi aman aman no so; ɔno na wɔn ani bɛda ne so, na nʼahomegyebea benya anuonyam.
౧౦ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది.
11 Saa da no, Awurade bɛma ne nsa so ne mprenu so de agye ne nkurɔfo a wɔaka afi Asiria, Misraim anafo fam, Misraim atifi fam, Kus, Elam, Babilonia, Hamat ne Po so asupɔw.
౧౧ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.
12 Ɔbɛma frankaa so ama aman no na wɔaboaboa Israelfo a wɔatwa wɔn asu no ano; Ɔbɛboaboa Yudafo a wɔahwete no ano afi asase ntwea anan no so.
౧౨జాతులను పోగు చెయ్యడానికి ఆయన ఒక ధ్వజం నిలబెట్టి, బహిష్కరణకు గురైన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాడు. చెదిరి పోయిన యూదా వాళ్ళను భూమి నలుదిక్కుల నుంచి సమకూరుస్తాడు.
13 Efraim anibere betu ayera, na wɔbɛsɛe Yuda atamfo. Efraim ani remmere Yuda bio, na Yuda nso rentan Efraim ani.
౧౩ఎఫ్రాయిముకున్న అసూయను నిలువరిస్తాడు. యూదా పట్ల విరోధంగా ఉన్న వాళ్ళు నిర్మూలమౌతారు. ఎఫ్రాయిము యూదాను బట్టి అసూయ పడడు. యూదా ఎఫ్రాయిమును బాధించడు
14 Wobetwiw afa Filistia asiansian ahorow no so akɔ atɔe fam; na wɔbɛbɔ mu afow nnipa akɔ apuei fam. Wɔbɛfa Edom ne Moab, na Amonfo bɛhyɛ wɔn ase.
౧౪వాళ్ళు పడమటివైపు ఉన్న ఫిలిష్తీయుల కొండల మీదకి దూసుకొస్తారు. వాళ్ళు ఏకమై తూర్పు వారిని కొల్లగొడతారు. వాళ్ళు ఎదోము మీద, మోయాబు మీద దాడి చేస్తారు, అమ్మోనీయులు వాళ్లకు విధేయులౌతారు.
15 Awurade bɛma nsu a ɛwɔ Misraim Po no mu ayow korakora; ɔbɛma ne nsa mu mframa a mu yɛ hyew abɔ afa Asubɔnten Eufrate so. Ɔbɛpaapae mu ayɛ no nsuwansuwa ason sɛnea ɛbɛyɛ a obiara betumi ahyɛ mpaboa atwa.
౧౫యెహోవా ఐగుప్తు సముద్రం అగాధాన్ని విభజిస్తాడు. చెప్పులు తడవకుండా మనుషులు దాన్ని దాటి వెళ్ళేలా తన వేడి ఊపిరిని ఊది, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించి, ఏడు కాలువలుగా దాన్ని చీలుస్తాడు.
16 Ɔtempɔn bi bɛda hɔ ama ne nkurɔfo nkae a wɔaka Asiria, sɛnea bi daa hɔ maa Israel bere a wofi Misraim bae no.
౧౬ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది.