< Yesaia 10 >
1 Wonnue, wɔn a wɔhyɛ mmara a ɛmfa ne kwan mu, wɔn a wɔhyɛ mmara dennen a ɛde nhyɛso ba,
౧వితంతువులు తమకు కొల్లసొమ్ముగా ఉండాలనీ,
2 de siw ahiafo ahofadi ho kwan, de atɛntrenee bɔ me nkurɔfo a wɔhyɛ wɔn so no atirimɔden. Wɔma akunafo yɛ amanehunufo na wɔbɔ ayisaa korɔn.
౨తల్లిదండ్రులు లేని వాళ్ళను దోచుకోవాలనీ కోరి, అవసరతలో ఉన్న వాళ్లకు న్యాయం జరిగించకుండా చేసి, నా ప్రజల్లో ఉన్న పేదలకు హక్కులు లేకుండా చేసి, అన్యాయ నియమాలు విధించే వారికీ, బాధ కలిగించే శాసనాలు చేసే వారికీ బాధ.
3 Dɛn na mobɛyɛ wɔ akontaabu da no, bere a amanehunu fi akyirikyiri reba? Hena nkyɛn na mubeguan akɔpɛ mmoa? Ɛhefa na mubegyaw mo ahode?
౩తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?
4 Ɛrenka mo hwee sɛ mobɛfra nneduafo mu anaasɛ mobɛtotɔ wɔ atɔfo mu. Nanso eyinom nyinaa akyi no ne bo nnwoo ɛ, na ne nsa da so wɔ soro.
౪నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
5 “Nnome nka Asiriani no, mʼabufuw abaa, nea okura mʼabufuwhyew pema no!
౫అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.
6 Mesoma no akɔ ɔman a wonnim Onyankopɔn so migya no kwan ma wakɔ nnipa a wɔhyɛ me abufuw so sɛ wonkogye akorɔnne abran so na wonhuam afowde, na wontiatia wɔn so sɛ dɔte wɔ mmɔnten so.
౬భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.
7 Nanso ɛnyɛ eyi ne nea ɔpɛ sɛ ɔyɛ ɛnyɛ eyi ne nea ɛwɔ nʼadwene mu; ne botae ne sɛ ɔbɛsɛe, sɛ ɔde aman bebree bɛba wɔn awiei.
౭కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.
8 Na obisa se, ‘Ahemfo nyinaa nyɛ mʼasahene ana?
౮అతను “నా అధిపతులందరూ మహారాజులు కారా?
9 Kalno nyɛɛ sɛ Karkemis ana? Hamat nte sɛ Arpad na Samaria nte sɛ Damasko ana?
౯కల్నో పట్టణం కర్కెమీషులాంటిదే కదా? హమాతు అర్పాదులాంటిది కాదా? షోమ్రోను దమస్కులాంటిది కాదా?
10 Sɛnea migyee ahoni ahenni ahorow abran so, ahenni a wɔn nsɛsode sen nea ɛwɔ Yerusalem ne Samaria no.
౧౦విగ్రహాలను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి గదా, వాటి విగ్రహాలు యెరూషలేము, షోమ్రోనుల విగ్రహాల కంటే ఎక్కువే గదా.
11 Merentumi ne Yerusalem ne ne nsɛsode nni, sɛnea me ne Samaria ne nʼahoni dii no?’”
౧౧షోమ్రోను పట్ల, దాని విగ్రహాల పట్ల నేను చేసినట్టు యెరూషలేము పట్ల, దాని విగ్రహాల పట్ల చెయ్యకుండా ఉంటానా” అంటాడు.
12 Sɛ Awurade wie nʼadwuma a etia Bepɔw Sion ne Yerusalem nyinaa a, ɔbɛka se, “Mɛtwe Asiriahene aso wɔ ne komapirim ne nʼani a ɛnsɔ ade no ho.
౧౨సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు.
13 Efisɛ ɔka se, “‘Mede mʼahoɔden na ayɛ eyi, na mifi me nyansa mu, efisɛ mewɔ nimdeɛ. Mesɛee aman aman ahye, mefow wɔn ademude; mebrɛɛ wɔn ahemfo ase te sɛ ɔbran.
౧౩ఎందుకంటే అతడు, “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.
14 Sɛnea obi teɛ ne nsa hyɛ berebuw mu no, saa ara nso na mɛteɛ me nsa wɔ amanaman no ahonyade so; sɛnea wɔtase nkesua a wɔagyaw hɔ no, saa ara na mɛboaboa amanaman no nyinaa ano; obiara ammɔ ne ntaban mu, na wammue nʼano ansu.’”
౧౪పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు.
15 Abonnua ma ne ho so tra nea ɔtow, anaasɛ ɔwan hoahoa ne ho kyɛn nea ɔde no yɛ adwuma ana? Ayɛ te sɛnea abaa tumi dannan nea ɔmaa no so, anaasɛ poribaa tumi hinhim nea ɔnyɛ dua!
౧౫నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా? ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.
16 Afei Awurade, Asafo Awurade, de ɔyaredɔm bɛbɔ nʼakofo ahoɔdenfo no; ne kɛseyɛ mu wobefita ogya mu ama adɛw te sɛ gyaframa.
౧౬కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
17 Israel Hann no bɛdan ogya. Wɔn Kronkronni no bɛyɛ ogya a ɛdɛw; ɔde da koro bɛhyew na wasɛe ne nsɔe ne nnɛnkyɛnse.
౧౭ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.
18 Ne kwae ne nʼasasebere anuonyam no, ɛbɛsɛe pasapasa te sɛ ɔyarefo a ɔrefɔn.
౧౮ఒకడు వ్యాధితో క్షీణించిపోయినట్టు శరీర ప్రాణాలతోపాటు అతని అడవికీ అతని ఫలభరితమైన పొలాలకూ కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది.
19 Nnua a ɛbɛka wɔ ne kwae mu bɛyɛ kakraa bi a abofra betumi akyerɛ ne dodow.
౧౯అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు.
20 Da no, Israel nkae, Yakob fifo a wɔbɛka no, remfa wɔn ho nto no so bio nea ɔbɔɔ wɔn hwee fam no; na mmom wɔde wɔn ho bɛto Awurade so nokware mu, Israel Kronkronni no.
౨౦ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు.
21 Nkae bi bɛsan aba, Yakob nkae bi bɛsan aba Otumfo Onyankopɔn no nkyɛn.
౨౧యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు.
22 Israel, ɛwɔ mu sɛ wo nkurɔfo dɔɔso sɛ mpoano nwea de, nanso nkae bi pɛ na wɔbɛsan. Wɔahyɛ ɔsɛe ho mmara dennen a ebebunkam so na ɛteɛ.
౨౨ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
23 Awurade, Asafo Awurade de ɔsɛe a wɔahyɛ ho mmara ketee na ɛbɛba asase no so nyinaa.
౨౩ఎందుకంటే ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భూమంతటా తాను నిర్ణయించిన సమూల నాశనం అమలు చెయ్యబోతున్నాడు.
24 Enti sɛɛ na Awurade, Asafo Awurade se, “Me nkurɔfo a mote Sion, munnsuro Asiriafo no, wɔn a wɔde mmaa hwe mo na wɔma kontibaa so tia mo, sɛnea Misraim yɛe no.
౨౪ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “సీయోనులో నివాసం ఉంటున్న నా ప్రజలారా, అష్షూరుకు భయపడవద్దు. ఐగుప్తీయులు చేసినట్టు వాళ్ళు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తమ దండం ఎత్తుతారు.
25 Ɛrenkyɛ koraa mʼabufuw a etia mo no ano bedwo na mʼanibere bɛkɔ wɔn sɛe so.”
౨౫అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.”
26 Asafo Awurade de mpire bɛhwe wɔn, sɛnea ɔbɔɔ Midian hwee fam wɔ Oreb Ɔbotan ho no; na ɔbɛteɛ ne pema wɔ nsu no so, sɛnea ɔyɛɛ wɔ Misraim no.
౨౬ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించినట్టు సేనల ప్రభువైన యెహోవా తన కొరడాను అతని మీద ఝుళిపిస్తాడు. ఆయన ఐగుప్తులో చేసినట్టు తన కర్ర సముద్రం మీద ఎత్తి దాన్ని పైకెత్తుతాడు.
27 Da no wobeyi wɔn adesoa no afi wɔn mmati so wɔn konnua afi wo kɔn mu; wobubu konnua no efisɛ woayɛ ɔbran yiye.
౨౭ఆ రోజున నీ భుజం మీద నుంచి అతని బరువు, నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేయడం జరుగుతుంది. నీ మెడ బలంగా ఉన్న కారణంగా ఆ కాడి నాశనం అవుతుంది.
28 Wɔhyɛn Ayat; wɔfa Migron; na wɔkora wɔn nneɛma wɔ Mikmas.
౨౮శత్రువు ఆయాతు దగ్గరికి వచ్చాడు, మిగ్రోను మార్గంగుండా వెళ్తున్నాడు. మిక్మషులో తమ సామగ్రి నిల్వ చేశాడు.
29 Wɔfaa ɔtempɔn no so, na wɔka se, “Yɛbɛwɛn wɔ Geba anadwo yi.” Rama ho popo; Saulo kurow Gibea nso guan.
౨౯వాళ్ళు కొండ సందు దాటారు, గెబలో బస చేశారు. రమా వణకుతోంది. సౌలు గిబ్యా నివాసులు పారిపోయారు.
30 Teɛ mu, Galim Babea! Tie, Laisa! Anatot Mmɔborɔni!
౩౦గల్లీము ఆడపడుచులారా, బిగ్గరగా కేకలు వేయండి. లాయిషా, ఆలకించు! అయ్యయ్యో, అనాతోతు!
31 Madmena reguan; Gebimfo kɔtetɛw.
౩౧మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గెబీము నివాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తుతున్నారు.
32 Nnɛ ara wobegyina wɔ Nob; wobehim wɔn nsa wɔ Ɔbabea Sion bepɔw no so, wɔ Yerusalem koko no so.
౩౨ఈ రోజే అతను నోబులో ఆగుతాడు. ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండవైపు వాళ్ళు తమ పిడికిలి ఊపుతున్నారు.
33 Hwɛ, Awurade, Asafo Awurade no, ɔde tumi kɛse betwitwa dua mman no. Wobebubu nnua atenten no agu fam nea ɛwowaree no bɛba fam.
౩౩చూడండి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భీకర శబ్దంతో కొమ్మలను తెగగొట్టినప్పుడు ఎత్తయిన చెట్లు కూలిపోతాయి. గంభీరమైనవి పడిపోతాయి.
34 Ɔde abonnua betwitwa kwaedɔtɔ agu fam Lebanon bɛhwe ase wɔ Ɔkɛse no anim.
౩౪ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతాడు. ప్రఖ్యాతిగాంచిన లెబానోను కూలిపోతుంది.