< Hosea 8 >
1 “Monhyɛn torobɛnto! Ɔkɔre bi wɔ Awurade fifo so efisɛ nnipa no abu mʼapam so na wɔasɔre atia me mmara.
౧“బాకా నీ నోట ఉంచుకో. ప్రజలు నా నిబంధన అతిక్రమించారు. నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలడానికి గద్ద వస్తూ ఉంది అని ప్రకటించు.”
2 Afei Israel su frɛ me se, ‘Yɛn Nyankopɔn, yegye wo to mu!’
౨వారు నాకు మొర్రపెడతారు. “మా దేవా, ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగిన వారమే.”
3 Nanso Israel apo nea eye; ɔtamfo bɛtaa no.
౩కానీ ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు. కాబట్టి శత్రువు వారిని తరుముతాడు.
4 Wosisi ahemfo a minnim ho hwee, wɔpaw ahenemma wɔ bere a mempenee so ɛ. Wɔde wɔn dwetɛ ne wɔn sikakɔkɔɔ yɛ ahoni ma wɔn ho de sɛe wɔn ankasa ho.
౪వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.
5 Tow wo nantwi ba ohoni no kyene, Samaria! Mʼabufuwhyew reba wɔn so. Wɔbɛtena nea ɛho ntew mu akosi da bɛn?
౫ప్రవక్త ఇలా అంటున్నాడు “షోమ్రోనూ, ఆయన నీ దూడను విసిరి పారేశాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంత కాలం వారు అపవిత్రంగా ఉంటారు?
6 Wofi Israel! Saa nantwi ba yi, odwumfo bi na osenii; ɛnyɛ Onyankopɔn! Wobebubu mu asinasin, saa Samaria nantwi ba no.
౬ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? కంసాలి దాన్ని తయారు చేశాడు. అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది.
7 “Wodua mframa na wotwa mfɛtɛ. Awi a egyina hɔ no nni ti; nti wɔrennya siam mfi mu. Sɛ ɛsow aduan mpo a, ahɔho na wobedi.
౭ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు. పెనుగాలిని వారు కోసుకుంటారు. కనిపించే పైరులో కంకులు లేవు. దాన్ని గానుగలో వేస్తే పిండి రాదు. ఒకవేళ పంట పండినా విదేశీయులు దాన్ని కోసుకుంటారు.
8 Wɔamene Israel; afei ɔfra aman no mu te sɛ ade a so nni mfaso biara.
౮ఇశ్రాయేలు వారిని శత్రువులు కబళిస్తారు. ఎవరికీ ఇష్టంలేని ఓటికుండల్లా వారు అన్యజనుల్లో చెదిరి ఉంటారు.
9 Na wɔakɔ Asiria te sɛ wuram afurum a ɔno nko ara nenam. Efraim nso atɔn ne ho ama adɔfo.
౯వారు ఒంటరి అడవి గాడిదలాగా అష్షూరీయుల దగ్గరికి పోయారు. ఎఫ్రాయిము తన కోసం విటులను డబ్బిచ్చి పిలిపించుకుంది.
10 Ɛwɔ mu, wɔatɔn wɔn ho wɔ amanaman no mu de, nanso mɛboaboa wɔn ano. Wɔn so befi ase atew wɔ ɔhene kɛse bi nhyɛso ase.
౧౦వారు కానుకలు ఇచ్చి అన్యజనాల్లో విటులను పిలుచుకున్నా ఇప్పుడే నేను వారిని సమకూరుస్తాను. చక్రవర్తి పీడన పెట్టే బాధ కింద వారు కృశించి పోతారు.
11 “Ɛwɔ mu sɛ Efraim sisii afɔremuka bebree a wɔbɔ bɔnefakyɛ afɔre wɔ so de, ɛno nti abɛyɛ afɔremuka a wɔyɛ bɔne wɔ so.
౧౧ఎఫ్రాయిము పాపపరిహారం కోసం ఎన్నెన్నో బలిపీఠాలను కట్టింది. కానీ అతడు పాపం చేయడానికి అవే దోహదం చేశాయి.
12 Mekyerɛw me mmara a ɛfa nneɛma bebree ho maa wɔn, nanso wɔfaa no sɛ ananafo ade.
౧౨నేను పదివేల సార్లు అతని కోసం నా ధర్మశాస్త్రాన్ని రాయించి నియమించినా, అయినా దాన్ని ఎప్పుడూ చూడనట్టుగా అతడు ఉంటాడు.
13 Wɔde mʼayɛyɛde bɔ afɔre na wɔwe nam no, nanso wɔnsɔ Awurade ani. Afei ɔbɛkae wɔn atirimɔdensɛm na wɔatwe wɔn aso wɔ wɔn bɔne ho: Wɔbɛsan akɔ Misraim.
౧౩నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే, వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాటి బలులను నేను, అంటే యెహోవాను అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది.
14 Israel werɛ afi ne yɛfo na wasisi ahemfi akɛseakɛse; Yuda abɔ nkurow bebree ho ban. Nanso mɛto ne nkuropɔn mu gya a ɛbɛhyew wɔn aban.”
౧౪ఇశ్రాయేలువారు తమ సృష్టికర్త అయిన దేవుని మర్చి పోయారు. తమ కోసం భవనాలు కట్టించుకున్నారు. యూదావారు, చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాలను తగలబెడతాను. వారి కోటలను ధ్వంసం చేస్తాను.