< Ɛsra 4 >
1 Yuda ne Benyamin atamfo no tee sɛ wɔn a wotwaa wɔn asu no resiesie Awurade, Israel Nyankopɔn, asɔredan no.
౧అప్పుడు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయం కడుతున్న విషయం యూదా, బెన్యామీను ప్రజల శత్రువులకు తెలిసింది.
2 Enti wɔkɔɔ Serubabel ne ntuanofo no a wɔaka no nkyɛn, na wɔkae se, “Momma yɛne mo nsi, efisɛ yɛsom mo Nyankopɔn sɛnea mosom no no. Efi bere a Asiriahene Esarhadon de yɛn baa ha yi, yɛabɔ afɔre ama no.”
౨వారు జెరుబ్బాబెలును, పూర్వికుల వంశాల పెద్దలను కలుసుకుని “మీరు సేవించే దేవుణ్ణి మేము కూడా సేవిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజు ఏసర్హద్దోను కాలం నుండి మేము యెహోవాకు బలులు అర్పిస్తున్నాము. మేము కూడా మీతో కలిసి ఆలయం కడతాం” అని చెప్పారు.
3 Na Serubabel, Yesua ne Israel ntuanofo bi buae se, “Munni kyɛfa wɔ saa dwuma yi di mu, efisɛ yɛne mo nni hwee yɛ. Yɛn nko ara na yebesi Awurade, Israel Nyankopɔn, asɔredan no sɛnea Persiahene Kores ahyɛ yɛn no.”
౩అందుకు జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు పెద్దల్లో మిగిలినవారు “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టాల్సిన అవసరం లేదు. పర్షియా దేశపు రాజు కోరెషు మాకిచ్చిన అనుమతి ప్రకారం మేమే పూనుకుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుకుంటాం” అని వారితో చెప్పారు.
4 Na ɔmanfo no pɛɛ sɛ wobu Yudafo no aba mu na wohunahunaa wɔn wɔ adwuma no yɛ ho.
౪ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు, ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు.
5 Wɔhyɛɛ ananmusifo bi afono mu sɛ wɔnhaw wɔn na wɔnsɛe wɔn botae no. Eyi kɔɔ so wɔ Persiahene Kores ahenni nyinaa mu kosii bere a Persiahene Dario bedii ahengua no.
౫అంతేకాక, పర్షియా దేశపు రాజు కోరెషు కాలమంతటిలో, పర్షియా రాజు దర్యావేషు పాలనా కాలం వరకూ ఆలయం కట్టే వారి ప్రయత్నాలు భగ్నం చేయడానికి మంత్రులకు లంచాలు ఇచ్చారు.
6 Bere a Ahasweros dii ade mfe kakraa bi akyi no, Yudafo atamfo kyerɛw no krataa, bɔɔ kwaadu tiaa Yuda ne Yerusalem.
౬ఇంకా అహష్వేరోషు పాలించడం ప్రారంభించినప్పుడు వారు యూదా, యెరూషలేము నివాసుల గురించి ఉత్తరం రాసి వారిపై తప్పుడు నేరాలు ఆరోపించారు.
7 Na ɛno akyi no mpo, Persiahene Artasasta bere so no, Yuda atamfo a Bislam, Mitredat ne Tabeel di anim, kyerɛw krataa wɔ Arameike kasa mu kɔmaa Artasasta, na wɔkyerɛɛ ase kyerɛɛ ɔhene no.
౭పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు.
8 Amrado Rehum ne Simsai a ɔyɛ asennii kyerɛwfo kyerɛw krataa kɔkyerɛɛ ɔhene Artasasta sɛnea ɔman Yerusalem mu te.
౮నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి యెరూషలేము గురించి ఈ విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తకు పంపారు.
9 Wokyiaa ɔhene no ma ɛkɔtoo wɔn a wɔne wɔn bɔ, atemmufo ne ɔman no mu ntuanofo, Tarpela manfo, Persiafo, Babelfo ne Elamfo.
౯“నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అఫర్సతాక్, తార్పెల్, అఫరాస్, ఎరుకు, బబులోను, షూషను, దెహా, ఏలాము జాతుల వారూ
10 Wɔsan kyiaa nnipa a wɔaka no a ɔkɛse ne otitiriw Asurbanipa atwa wɔn asu, de wɔn akogu Samaria ne nsase a atwa hɔ ahyia wɔ asu Eufrate atɔe fam no so no.
౧౦గతంలో ఘనత వహించిన అషుర్ బనిపాల్ షోమ్రోను పట్టణంలో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు.”
11 Eyi yɛ krataa a wɔde kɔmaa no no nsɛso: Efi wʼasomfo a wɔwɔ asu Eufrate agya no nkyɛn de kɔma Artasasta:
౧౧వీరంతా అర్తహషస్త రాజుకు రాసి పంపిన ఉత్తరం నకలు. “నది ఇవతల వైపు ఉన్న మీ దాసులమైన మేము రాజైన మీకు విన్నవించేదేమంటే,
12 Yɛrebɔ wo amanneɛ sɛ, Yudafo a wofi Babilonia baa Yerusalem ha no resiesie atuatewfo ne abɔnefo kurow no. Wɔato afasu no fapem dedaw, na ɛrenkyɛ na wɔawie.
౧౨మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి, పునాదులు బాగు చేస్తున్నారు.
13 Na yɛpɛ sɛ wote sɛ, sɛ wosiesie kurow yi ne nʼafasu no wie a, ɛremmoa wo koraa, efisɛ Yudafo no rentua wɔn tow ne aguade biara mma wo.
౧౩కాబట్టి రాజైన మీకు తెలియజేసేదేమిటంటే, ఈ పట్టణం గోడలు నిలబెట్టి, పట్టణం కట్టిన పక్షంలో వారు ఇకపై శిస్తుగానీ, సుంకంగానీ, పన్నుగానీ మీకు చెల్లించరు. అప్పుడు రాజుకు వచ్చే రాబడి తగ్గిపోతుంది.
14 Esiane sɛ yɛyɛ wʼasomfo nokwafo nti, yɛmpɛ sɛ wʼanim begu ase wɔ saa kwan yi so nti na yɛrebɔ wo saa amanneɛ yi.
౧౪మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఈ ఉత్తరం పంపి రాజైన మీకు ఈ విషయం తెలియచేస్తున్నాం.
15 Yɛpɛ sɛ wohwehwɛ wʼagyanom nkrataa mu, hu sɛnea saa kurow yi yɛɛ atuatew kurow tete no. Nokware ni, wɔsɛee no, esiane abakɔsɛm tenten a ɛda hɔ sɛ wɔsɔre tiaa ahemfo ne aman a wɔpɛe sɛ wodi wɔn so no nti.
౧౫తమ పూర్వికులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూస్తే, ఈ పట్టణం ప్రజలు తిరుగుబాటు చేసేవారుగా, రాజులకు, దేశాలకు కీడు తలపెట్టేవారనీ, కలహాలు రేపేవారనీ, ఆ కారణం వల్లనే ఈ పట్టణం నాశనానికి గురయిందనీ మీకు తెలుస్తుంది.
16 Yɛpae mu ka se, sɛ wosiesie kurow yi na wowie nʼafasu no a, wobɛhwere asu Eufrate agya asase no.
౧౬కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, ఈ పట్టణ నిర్మాణం పూర్తి అయితే, ఇకపై నది ఇవతలి వైపు మీకు హక్కు, అధికారం ఏమీ ఉండదు.”
17 Artasasta mmuae ni: Mede krataa yi kɔma amrado Rehum, asennii kyerɛwfo Simsai ne wɔn mfɛfo a wɔte Samaria ne wɔn a wɔwɔ asu Eufrate agya no nyinaa.
౧౭అప్పుడు రాజు ఇలా జవాబు రాయించాడు. “మంత్రి రెహూముకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులో నివసించేవారి పక్షంగా ఉన్న మిగిలిన వారికి, నది ఆవతల ఉన్న మిగిలిన వారికి క్షేమం కలుగు గాక.
18 Mikyia mo nyinaa. Krataa a mokyerɛwee no, wɔakyerɛ ase, akenkan akyerɛ me.
౧౮మీరు మాకు పంపిన ఉత్తరం ప్రశాంతంగా చదివించుకొన్నాం.
19 Mahyɛ sɛ wɔnkɔyɛ nkrataa mu mpɛnsɛnpɛnsɛnmu, na mahu sɛ, ampa ara, mmere bi a atwa mu no, na Yerusalem yɛ atuatewman a etiaa ahemfo bebree a na abantugu yɛ ade a wɔyɛ daa wɔ hɔ.
౧౯దీని విషయం నేనిచ్చిన ఆజ్ఞను బట్టి పరిశీలించినప్పుడు, పూర్వం నుండి ఆ పట్టణ ప్రజలు రాజద్రోహం చేసి, కలహాలు రేపుతూ తిరుగుబాటు చేసే వారని మాకు నిర్ధారణ అయింది.
20 Ahemfo atumfo a adi ade wɔ Yerusalem ne asu Eufrate agya no nyinaa agye tow ne aguade bebree.
౨౦గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు.
21 Ɛno nti, hyɛ na saa nnipa yi nnyae wɔn adwuma. Ɛnsɛ sɛ wosiesie kurow no, gye sɛ mema ho kwan.
౨౧కాబట్టి మేము అనుమతి ఇచ్చే వరకూ వాళ్ళు ఆ పట్టణ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆజ్ఞాపించండి.
22 Monntwentwɛn so koraa, efisɛ ɛnsɛ sɛ yɛma asɛm no gye nsam.
౨౨పని జరగకుండా ఉండేలా తప్పకుండా జాగ్రత్త పడండి. రాజ్యానికి నష్టం, ద్రోహం కలగకుండా చూడండి.”
23 Bere a wɔkenkan saa krataa a efi ɔhene Artasasta nkyɛn kyerɛɛ Rehum, Simsai ne wɔn mfɛfo no, wɔyɛɛ ntɛm kɔɔ Yerusalem kɔhyɛɛ Yudafo no ma wogyaee adansi no.
౨౩రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరంలోని వివరాలు రెహూముకు, షిమ్షయికి, వారి పక్షం వహించిన మిగిలిన వారికి తెలిసింది. వారు వెంటనే యెరూషలేములో నిర్మాణ పనిలో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి బలవంతంగా, అధికార పూర్వకంగా పని ఆపించారు.
24 Wogyaee Onyankopɔn asɔredan a ɛwɔ Yerusalem no ho adwumayɛ, wɔ nea adu hɔ ara, kosii Persiahene Dario ahenni afe a ɛto so abien no so.
౨౪కాబట్టి యెరూషలేములో దేవుని మందిరం నిర్మాణ పని నిలిచిపోయింది. ఈ విధంగా పర్షియా దేశపు రాజు దర్యావేషు పాలనలో రెండో సంవత్సరం వరకూ ఆ పని నిలిచిపోయింది.