< Hesekiel 39 >

1 “Onipa ba, hyɛ nkɔm tia Gog na ka se: ‘Sɛɛ na Otumfo Awurade se: Me ne wo anya. Gog, Mesek ne Tubal obirɛmpɔn.
నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
2 Mekyinkyim wo na matwe wʼase. Mede wo befi atifi fam nohɔ tɔnn na mede aba Israel mmepɔw so.
నిన్ను వెనక్కి తిప్పి నడిపించి దూరంగా ఉత్తరాన ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతాలకు రప్పిస్తాను.
3 Afei, mɛbɔ wo bɛmma afi wo nsa benkum mu na mama wʼagyan afi wo nsa nifa mu agu fam.
నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను.
4 Wo ne wʼasraafo nyinaa ne aman a wɔka wo ho no bɛtotɔ wɔ Israel mmepɔw so. Mede wo bɛma nnomaa ahorow a wɔpɛ nea aporɔw ne wuram mmoa sɛ wɔn aduan.
నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు.
5 Mobɛtotɔ wɔ mfuw so, efisɛ makasa, Otumfo Awurade asɛm ni.
నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
6 Mɛtɔ ogya agu Magog so ne wɔn a wɔtete hɔ asomdwoe mu wɔ mpoano nsase so no na wobehu sɛ mene Awurade no.
ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.
7 “‘Mɛma me nkurɔfo Israelfo ahu me din kronkron wɔ wɔn mu na meremma ho kwan ma wonngu me din kronkron no ho fi na aman no behu sɛ me Awurade mene Ɔkronkronni no wɔ Israel.
నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను.
8 Ɛreba! na ampa ara ebesi, Otumfo Awurade asɛm ni. Da a maka ho asɛm no ni.
ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9 “‘Afei wɔn a wɔtete Israel nkurow so befi adi na wɔde akode no bɛsɔ gya, akokyɛm nketewa ne akɛse, bɛmma ne agyan, nkontimmaa ne mpeaw. Wɔde bɛyɛ nnyina asɔ gya mfe ason.
ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.
10 Ɛrenhia sɛ wɔbɛkɔ anyan wɔ mfuw so anaasɛ wɔbɛpɛ bi wɔ kwae mu, efisɛ wɔde akode no bɛsɔ gya. Na wɔbɛsɛe wɔn a wɔsɛe wɔn nneɛma no nneɛma na wɔafom wɔn a wɔfom wɔn nneɛma no nso nneɛma, Otumfo Awurade asɛm ni.
౧౦ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
11 “‘Saa da no, mɛyɛ amusiei wɔ Israel ama Gog, wɔ obon a ɛda baabi a wɔn a wotu kwan kɔ apuei fam wɔ po no ho no fa no. Ebesiw akwantufo kwan efisɛ wobesie Gog ne ne dɔm no wɔ hɔ. Ɛno nti wɔbɛfrɛ hɔ se Hamon Gog bon.
౧౧“ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు.
12 “‘Na Israelfi de asram ason besie wɔn de adwira asase no.
౧౨దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది.
13 Nnipa a wɔwɔ asase no so besie wɔn na da a wɔbɛhyɛ me anuonyam no bɛyɛ nkaeda ama wɔn, Otumfo Awurade na ose.
౧౩ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు.
14 Wɔbɛkɔ so afa nnipa ama wɔatew asase no ho. Ebinom bɛfa asase no so nyinaa, na ebinom nso asie wɔn a wɔda so gugu asase no so no. “‘Asram ason akyi no wɔbɛhwehwɛ asase no so yiye.
౧౪దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు.
15 Bere a wɔrekyinkyin asase no so no, sɛ wɔn mu bi hu onipa dompe a, ɔbɛhyɛ hɔ agyirae akosi sɛ asieifo bɛfa akosie wɔ Hamon Gog bon no mu.
౧౫దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు.
16 (Kurow bi bɛba hɔ a ne din de Hamona). Na sɛɛ na wobedwira asase no.’
౧౬హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.”
17 “Onipa ba, sɛɛ na Otumfo Awurade se: Frɛ nnomaa ahorow ne wuram mmoadoma nyinaa na ka kyerɛ wɔn se, ‘Mommoaboa mo ho ano mfi mmeaemmeae mmra afɔrebɔ a meresiesie ama mo no ase, afɔrebɔ kɛse wɔ Israel mmepɔw so. Hɔ na mubedi nam na moanom mogya.
౧౭“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.
18 Mobɛwe dɔmmarima nam wɔ hɔ na moanom asase so mmapɔmma mogya te sɛ nea wɔyɛ adwennini ne nguantenmma, mpapo ne anantwinini a wɔn nyinaa yɛ Basan nyɛmmoa a wɔadodɔ srade.
౧౮బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు.
19 Afɔre a meresiesie ama mo no, mubedi srade akosi sɛ mobɛyɛ pintinn na moanom mogya akosi sɛ mobɛbobow.
౧౯మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి.
20 Mobɛwe apɔnkɔ ne sotefo, dɔmmarima ne asraafo ahorow nyinaa nam amee wɔ me pon so,’ Otumfo Awurade asɛm ni.
౨౦నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
21 “Mɛda mʼanuonyam adi wɔ amanaman no mu na wɔn nyinaa behu asotwe ne nsa a mede ato wɔn so no.
౨౧నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు.
22 Efi saa da no rekɔ, Israelfi behu sɛ mene Awurade, wɔn Nyankopɔn no.
౨౨ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు.
23 Na amanaman no behu sɛ Israelfo kɔɔ nkoasom mu wɔn bɔne nti, efisɛ wɔanni me nokware. Ɛno nti mede mʼanim hintaw wɔn, na mede wɔn hyɛɛ wɔn atamfo nsa na wɔn nyinaa totɔɔ wɔ afoa ano.
౨౩ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు.
24 Mene wɔn dii no sɛnea wɔn ho fi ne wɔn mfomso te, mede mʼanim hintaw wɔn.
౨౪వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.
25 “Ɛno nti sɛɛ na Otumfo Awurade se: Mede Yakob befi nkoasom mu aba na manya ahummɔbɔ ama Israelfo nyinaa, na mɛtwe me din kronkron no ho ninkunu.
౨౫కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను.
26 Wɔn werɛ befi wɔn animguase ne nokware a wɔanni me bere a na wɔte hɔ asomdwoe mu wɔ wɔn asase so a obiara nhunahuna wɔn no.
౨౬వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు.
27 Sɛ mede wɔn fi amanaman no so san ba na meboaboa wɔn ano fi wɔn atamfo nsase so a, mɛfa wɔn so ada me kronkronyɛ adi wɔ amanaman no nyinaa ani so.
౨౭అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.
28 Afei wobehu sɛ mene Awurade wɔn Nyankopɔn no, efisɛ ɛwɔ mu sɛ mede wɔn kɔɔ nnommum mu wɔ amanaman no mu de, nanso mɛboaboa wɔn ano akɔ wɔn ankasa asase so a merennyaw wɔn mu biara wɔ akyi.
౨౮వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
29 Meremfa mʼanim nhintaw wɔn bio, efisɛ mehwie me Honhom agu Israelfi so, Otumfo Awurade asɛm ni.”
౨౯అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

< Hesekiel 39 >