< Hesekiel 33 >
1 Awurade asɛm baa me nkyɛn se:
౧యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2 “Onipa ba, kasa kyerɛ wo manmma na ka kyerɛ wɔn se: ‘Sɛ metwe mʼafoa wɔ asase bi so, na sɛ asase no so nnipa yi wɔn mmarima no mu baako sɛ ɔnyɛ ɔwɛmfo mma wɔn,
౨“నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ విషయం చెప్పు, నేను ఒకానొక దేశం మీదికి కత్తి రప్పిస్తే ఆ ప్రజలు తమలో ఒకణ్ణి ఎన్నుకుని కావలివానిగా ఏర్పరచుకున్నారనుకో.
3 na ohu sɛ afoa reba abɛko atia asase no a, ɔhyɛn torobɛnto de bɔ nnipa no kɔkɔ.
౩అతడు దేశం మీదికి కత్తి రావడం చూసి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకో.
4 Na sɛ obi te torobɛnto no nnyigyei na wanna ne ho so, na sɛ afoa no bekum no a, ne mogya bɛbɔ ɔno ankasa ti so.
౪అప్పుడు ఎవడైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్తపడక పోతే, కత్తి వచ్చి వాడి ప్రాణం తీసేస్తే వాడు తన చావుకు తానే బాధ్యుడు.
5 Esiane sɛ ɔtee torobɛnto no nnyigyei na wantie kɔkɔbɔ no nti, ne mogya bɛbɔ nʼankasa ti so. Sɛ otiee kɔkɔbɔ no a, anka onyaa ne ti didii mu.
౫బూర శబ్దం విని కూడా వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి తన చావుకు తానే బాధ్యుడు. వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడే.
6 Nanso sɛ ɔwɛmfo no hu sɛ afoa no reba na wanhyɛn torobɛnto no ammɔ nnipa no kɔkɔ, na sɛ afoa no ba bekum wɔn mu baako a, wɔbɛfa saa onipa no akɔ wɔ ne bɔne nti, nanso mɛma ɔwɛmfo no abu owufo no mogya ho akontaa.’
౬అయితే కావలివాడు కత్తి రావడం చూసినా కూడా, బూర ఊదకుండా ప్రజలను హెచ్చరించకుండా ఉన్నాడనుకో. కత్తి వచ్చి వాళ్ళలో ఒకడి ప్రాణం తీస్తే, వాడు తన దోషాన్ని బట్టి చస్తాడు. కానీ, అతని చావుకు నేను కావలి వాడినే బాధ్యుని చేస్తాను.
7 “Onipa ba, mayɛ wo ɔwɛmfo ama Israelfi, ɛno nti tie mʼanom nsɛm na fa kɔkɔbɔ a efi me nkyɛn ma wɔn.
౭నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి.
8 Sɛ meka kyerɛ omumɔyɛfo se, ‘Wo omumɔyɛfo, owu na wubewu,’ na sɛ woankasa ankyerɛ no amma wamfi nʼakwan so a, saa omumɔyɛfo no bewu ne bɔne mu, na mɛma woabu ne mogya ho akontaa.
౮‘దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను.
9 Nanso sɛ wobɔ omumɔyɛfo no kɔkɔ sɛ omfi nʼakwan so na sɛ wanyɛ a, ne bɔne nti, obewu, nanso worenni ne mogya ho fɔ.
౯అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు అతన్ని హెచ్చరించావనుకో. అతడు తన దుర్మార్గం విడిచి పెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి చస్తాడు గానీ నువ్వు అతని చావుకు బాధ్యుడివి కాదు.
10 “Onipa ba, ka kyerɛ Israelfi se: ‘Sɛɛ ne nea moreka: “Yɛn mfomso ne yɛn nnebɔne hyɛ yɛn so, yɛresɛe, esiane eyinom nti. Na dɛn na yɛbɛyɛ na yɛanya nkwa?”’
౧౦నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ విషయం తెలియచెయ్యి. ‘మా అపరాధాలూ పాపాలూ మా మీద భారంగా ఉన్నాయి. వాటి వలన మేము నీరసించిపోతున్నాము. మేమెలా బతుకుతాం?’ అని మీరంటున్నారు.
11 Ka kyerɛ wɔn se, ‘Sɛ mete ase yi, Otumfo Awurade asɛm ni, mʼani nnye amumɔyɛfo wu ho, na mmom mepɛ sɛ wɔdan fi wɔn akwan so na wonya nkwa. Monnan! Monnan mfi mo amumɔyɛ akwan no so! Adɛn nti na ɛsɛ sɛ muwuwu, Israelfi?’
౧౧వారితో ఇలా చెప్పు, నా జీవం మీద ఆనబెట్టి చెబుతున్నాను, దుర్మార్గుడు చస్తే నాకేమీ సంతోషం లేదు. దుర్మార్గుడు తన పద్ధతిని బట్టి పశ్చాత్తాపపడి బతకాలి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు మార్చుకోండి. మీ దుర్మార్గతనుంచి పశ్చాత్తాప పడండి. మీరెందుకు చావాలి? ఇదే యెహోవా ప్రభువు సందేశం.
12 “Ɛno nti onipa ba, ka kyerɛ wo manmma se, ‘Ɔtreneeni trenee rentumi nnye no nkwa wɔ bere a ɔnyɛ osetie; na omumɔyɛfo amumɔyɛ remma ɔnhwe ase wɔ bere a ɔdan fi ho. Sɛ ɔtreneeni yɛ bɔne a, ɔrennya nkwa wɔ ne kan treneeyɛ nti.’
౧౨నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ మాట చెప్పు. నీతిమంతుడు పాపం చేస్తే అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు! దుష్టుడు చెడుతనం విడిచి మనస్సు మార్చుకుంటే తాను చేసిన దుర్మార్గాన్ని బట్టి వాడు నాశనం కాడు. అలాగే నీతిమంతుడు పాపం చేస్తే తన నీతిని బట్టి అతడు బతకడు.
13 Sɛ meka kyerɛ ɔtreneeni sɛ obenya nkwa, na afei ɔde ne ho to ne treneeyɛ so na ɔyɛ bɔne a, wɔrenkae ne kan trenee nneyɛe biara. Obewu wɔ ne bɔne a wayɛ nti.
౧౩నీతిమంతుడు తప్పక బతుకుతాడు, అని నేను చెప్పినందువలన అతడు తన నీతిని నమ్ముకుని పాపం చేస్తే మునుపు అతడు చేసిన నీతి పనులన్నిటిలో ఏదీ జ్ఞాపకానికి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి అతడు చస్తాడు.
14 Na sɛ meka kyerɛ omumɔyɛfo se, ‘Owu na wubewu,’ na afei ɔdan fi ne nnebɔne ho na ɔyɛ nea eye na ɛteɛ,
౧౪‘తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గునికి నేను చెప్పిన తరువాత అతడు తన పాపం విడిచి, నీతి న్యాయాలను అనుసరిస్తూ
15 na sɛ ɔsan de bosea ho awowaside ma, na ɔsan de nea wawia ma, na odi ahyɛde a ɛma nkwa so, na wanyɛ bɔne a, ampa ara obenya nkwa, na ɔrenwu.
౧౫తన దగ్గర అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ అప్పగించి, తాను దొంగిలించినదాన్ని మళ్ళీ ఇచ్చి వేసి పాపం చేయకుండా, జీవాధారమైన చట్టాలను అనుసరిస్తే అతడు చావడు. తప్పకుండా బతుకుతాడు.
16 Wɔrenkae bɔne a wayɛ no mu biara ntia no. Wayɛ nea eye na ɛteɛ, ampa ara obenya nkwa.
౧౬అతడు చేసిన పాపాల్లో ఏదీ అతని విషయం జ్ఞాపకానికి రాదు. అతడు నీతిన్యాయాలను అనుసరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతడు బతుకుతాడు.
17 “Nanso wo manmma ka se, ‘Awurade akwan nteɛ.’ Nanso ɛyɛ wɔn akwan mmom na ɛnteɛ.
౧౭అయినా నీ ప్రజలు ‘యెహోవా పద్ధతి న్యాయం కాదు’ అంటారు. అయితే వారి పద్ధతే అన్యాయమైనది.
18 Sɛ ɔtreneeni fi ne trenee ho na ɔyɛ bɔne a, ɛno nti obewu.
౧౮నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు.
19 Na sɛ omumɔyɛfo dan fi ne nnebɔne ho na ɔyɛ nea eye na ɛteɛ a, obenya nkwa.
౧౯దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి నీతిన్యాయాలను అనుసరిస్తే వాటిని బట్టి అతడు బతుకుతాడు.
20 Nanso Israelfi, moka se, ‘Awurade akwan nteɛ.’ Nanso mebu obiara atɛn sɛnea nʼakwan te.”
౨౦అయితే మీరు ‘యెహోవా పద్ధతి న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడి ప్రవర్తననుబట్టి వాడికి శిక్ష విధిస్తాను.”
21 Yɛn asutwa afe a ɛto so dumien no sram a ɛto so du no nnaanum so, ɔbarima bi a waguan afi Yerusalem baa me nkyɛn bɛkae se, “Kuropɔn no ahwe ase!”
౨౧మనం చెరలోకి వచ్చిన పన్నెండవ సంవత్సరం పదో నెల అయిదో రోజు ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా దగ్గరికి వచ్చి “పట్టణాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.
22 Na anwummere a ade rebɛkye ama ɔbarima no aba no, na Awurade nsa wɔ me so na obuee mʼano ansa na ɔbarima no baa anɔpa. Enti na mʼano abue a mitumi kasa.
౨౨అతడు రాకముందు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీద ఉంది. ఉదయాన అతడు నా దగ్గరికి వచ్చేముందే యెహోవా నా నోరు తెరచాడు. నేను మాట్లాడగలుగుతున్నాను. అప్పటినుంచి నేను మౌనంగా లేను.
23 Afei Awurade asɛm baa me nkyɛn se,
౨౩యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
24 “Onipa ba, nnipa a wɔtete saa nnwiriwii so wɔ Israel asase no so no reka se, ‘Abraham yɛ onipa baako, nanso onyaa asase no nyinaa. Nanso yɛdɔɔso, na nokware wɔde asase no ama yɛn sɛ yɛn agyapade.’
౨౪“నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, ‘అబ్రాహాము ఒక్కడుగానే ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. మనం అనేకులం. ఈ దేశం మనకు స్వాస్థ్యంగా వచ్చింది’ అని చెప్పుకుంటున్నారు.
25 Ɛno nti, ka kyerɛ wɔn se, ‘Sɛɛ na Otumfo Awurade se: Sɛ mowe nam a mogya wɔ mu, mosom mo anyame na muhwie mogya gu nti, ɛsɛ sɛ mofa asase no ana?
౨౫కాబట్టి వారికీ మాట చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, మీరు రక్తం తింటున్నారు. మీ విగ్రహాలను చూస్తూ ఉంటారు. మీరింకా హత్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?
26 Mode mo ho to mo afoa so. Moyɛ akyiwade na mo mu biara gu ne yɔnko yere ho fi. Ɛsɛ sɛ munya asase no ana?’
౨౬మీరు మీ కత్తిని నమ్ముకుంటారు. నీచమైన పనులు చేస్తారు. పక్కింటివాడి భార్యను పాడు చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?
27 “Ka eyi kyerɛ wɔn se, ‘Nea Otumfo Awurade se ni: Ampa ara sɛ mete ase yi, wɔn a wɔaka wɔ kurow no nnwiriwii mu no bɛtotɔ wɔ afoa ano. Wɔn a wɔwɔ wuram no mede wɔn bɛma nkekaboa ama wɔawe wɔn na wɔn a wɔwɔ abandennen ne abodan mu no, ɔyaredɔm bekunkum wɔn.
౨౭వారికి నువ్విలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, కత్తి పాలవుతారు. బయట పొలాల్లో ఉండే వాళ్ళను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను. కోటల్లో గుహల్లో ఉండేవాళ్ళు రోగాలతో చస్తారు.
28 Mɛsɛe asase no ama ayɛ amamfo, na nʼahomaso ahoɔden no bɛba awiei na Israel mmepɔw no bɛda mpan a obiara rentwa mu wɔ hɔ.
౨౮ఆ దేశాన్ని నిర్జనంగా పాడుచేస్తాను. దాని బలాతిశయం అంతం అవుతుంది. ఇశ్రాయేలు కొండలు నిర్జనంగా ఉంటాయి. ఎవరూ వాటి గుండా వెళ్ళరు.
29 Afei wobehu sɛ mene Awurade no, bere a mama asase no ada mpan wɔ akyiwade a wɔayɛ nyinaa nti.’
౨౯వారు చేసిన నీచమైన పనుల వలన వారి దేశాన్ని పాడుగా నిర్జనంగా నేను చేస్తే నేను యెహోవానని వారు తెలుసు కుంటారు.
30 “Wo de, onipa ba, wo manmma reka wo ho nsɛm wɔ afasu ho ne afi apon ano kyerɛ wɔn ho wɔn ho se, ‘Mommra mmetie asɛm a efi Awurade nkyɛn aba.’
౩౦నరపుత్రుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇంటి గుమ్మాల్లో నిలబడి ఒకరినొకరు నీ గురించి మాట్లాడుతూ, ‘యెహోవా దగ్గర నుంచి వచ్చే ప్రవక్త మాట విందాం పదండి’ అని చెప్పుకుంటున్నారు.
31 Me nkurɔfo ba wo nkyɛn, sɛnea wɔyɛ daa no, bɛtenatena wʼanim betie wo nsɛm, nanso wɔmmfa nyɛ adwuma. Wɔde wɔn ano ka ahofama, nanso wɔn koma mu de, wɔn ani bere asisi mu adenya.
౩౧నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.
32 Nokware, wɔn de, wote sɛ obi a ne nne yɛ dɛ, na ɔde nnwontode to ɔdɔ nnwom, efisɛ wɔte wo nsɛm nanso wɔmmfa nyɛ adwuma.
౩౨నువ్వు వాళ్లకు, తీగ వాయిద్యంతో చక్కటి సంగీత కచేరీ చేస్తూ కమ్మగా పాడే వాడిలా ఉన్నావు. వాళ్ళు నీ మాటలు వింటారు గానీ ఎవ్వరూ వాటిని పాటించరు.
33 “Sɛ eyinom nyinaa ba mu a, na nokware ɛbɛba mu nso, na afei wobehu sɛ odiyifo bi baa wɔn mu.”
౩౩తప్పక జరుగుతాయి అని నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు.”