< Hesekiel 2 >
1 Ɔka kyerɛɛ me se, “Onipa ba, sɔre gyina hɔ na me ne wo nkasa.”
౧ఆ స్వరం నాతో ఇలా చెప్పింది. “నరపుత్రుడా, నీవు లేచి నీ కాళ్ళపై నిలబడు. నేను నీతో మాట్లాడుతాను.”
2 Ɔrekasa no, Honhom no bɛhyɛɛ me mu maa me so gyinaa hɔ, na metee se ɔrekasa kyerɛ me.
౨ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఆత్మ నన్ను పట్టుకుని నా కాళ్ళపై నిలువబెట్టాడు. అప్పుడు ఆయన స్వరం నేను విన్నాను.
3 Ɔkae se, “Onipa ba, meresoma wo akɔ Israelfo mu, atuatew man a wayɛ dɔm atia me; wɔne wɔn agyanom ayɛ dɔm atia me abesi nnɛ.
౩ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
4 Nnipa a meresoma wo wɔn nkyɛn no yɛ nnipa a wɔasen wɔn kɔn na wɔn aso awu. Ka kyerɛ wɔn se, ‘Sɛɛ na Otumfo Awurade se.’
౪వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి.
5 Na sɛ wotie anaa wɔantie a, esiane sɛ wɔyɛ atuatewfo nti, wobehu ampa ara sɛ odiyifo bi aba wɔn mu.
౫వాళ్ళు తిరగబడే జనం. అలా ప్రకటిస్తే వాళ్ళు విన్నా, వినకున్నా కనీసం వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు.
6 Na wo, onipa ba, nsuro wɔn anaasɛ wɔn nsɛm. Nsuro, ɛwɔ mu sɛ nsasono ne nsɔe atwa wo ho ahyia na wote nkekantwɛre mu de, nanso nsuro nea wɔka, na mma wɔmmɔ wo hu, ɛwɔ mu sɛ wɔyɛ atuatewfo.
౬నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు.
7 Wɔyɛ atuatewfo ankasa nanso sɛ wobetie oo, sɛ wɔrentie oo, ɛsɛ sɛ woka me nsɛm kyerɛ wɔn.
౭వాళ్ళు ఎంతో తిరగబడే జనం. అయితే వాళ్ళు విన్నా, వినకున్నా నా మాటలు వాళ్లకి చెప్పు.
8 Nanso wo onipa ba, tie asɛm a meka kyerɛ wo no. Ntew atua te sɛ saa atuatewfo no; bue wʼanom na di nea mede ma wo no.”
౮నరపుత్రుడా, నువ్వు అయితే నేను చెప్తున్నది విను. ఆ తిరగబడే జాతిలా నువ్వూ తిరుగుబాటు చేయకు. నేను నీకు ఇవ్వబోతున్న దాన్ని నోరు తెరచి తిను.”
9 Afei mehwɛe, na mihuu nsa bi a ateɛ wɔ me so, na mu na nhoma mmobɔwee bi wɔ.
౯అప్పుడు నేను ఒక హస్తం నా దగ్గరికి రావడం చూశాను. ఆ చేతిలో చుట్టి ఉన్న ఒక పత్రం ఉంది.
10 Ɔtrɛw mu wɔ mʼanim. Nʼafanu no mu, na wɔakyerɛw kwadwom, awerɛhowdi ne nnome nsɛm.
౧౦ఆయన ఆ చుట్ట నా ఎదుట విప్పి పరిచాడు. దానికి రెండు వైపులా రాసి ఉంది. దాని పైన గొప్ప విలాపం, రోదన, వ్యాకులంతో నిండిన మాటలు రాసి ఉన్నాయి.